Friday, 14 April 2017 07:32

బాబు ఇంటర్వ్యూలో పాసైన సోమిరెడ్డి

Written by 
Rate this item
(0 votes)

galpikaజరిగిన కథ: అమరావతి రాజధానిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు పి.నారాయణ, యనమల రామకృష్ణుడు, స్వీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావులు మంత్రివర్గ సభ్యుల తీసివేతకు, ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఫెయిలైన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిషోర్‌బాబు, పీతల సుజాత, కిమిడి మృణాళినిలను మంత్రి వర్గం నుండి తొల గిస్తారు. వైసిపి నుండి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు సీనియర్‌ కోటాలో కిమిడి కళావెంక్రటావ్‌ను, అలాగే రిజ ర్వేషన్‌ కోటాలో ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను ఇంటర్వ్యూ నుండి మినహాయిస్తారు. లోకేష్‌ను కూడా ఇంటర్వ్యూ నుండి మిన హాయించాలన్న నారాయణ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరిస్తాడు. అతనికి కూడా ఇంటర్వ్యూ పెట్టాలని, తన కొడుకు సామర్ధ్యానికి పరీక్ష కాబట్టి తాను ఆ ఆపరేషన్‌కు దూరంగా వుంటానని చెబు తాడు. ఆ తర్వాత...

ఇక మిగిలింది లోకేష్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలే కాబట్టి మొదట లోకేష్‌ను పిలిచారు. ఓ ఉద్యోగం కోసం వచ్చినట్లుగానే లోకేష్‌ ఇంటర్వ్యూకు వచ్చాడు. యనమల రామకృష్ణుడు మొదటి ప్రశ్న వేశాడు. పది మధ్యలో సున్నా పెడితే ఏమవుతుందని అడిగాడు. ఇక్కడ యనమల గణితం లాజిక్‌తో ప్రశ్న అడిగాడు. పది పక్కన సున్నా పెడితే వంద అవుతుందని చెబుతారు. కాని లోకేష్‌ను కన్ఫ్యూజ్‌ చేయడానికి పది మధ్యలో సున్నా పెడితే ఏమవుతుందని అడిగాడు. కాని, లోకేష్‌ వీళ్ళకు దిమ్మ తిరిగే విధంగా పది మధ్యలో సున్నా పెడితే 'పంది' అవుతుందని చాలా లాజిక్‌గా చెప్పాడు. అతని తెలివికి ఈ ముగ్గురూ ఆశ్చర్యపోయారు. తర్వాత నారాయణ వుండి... రెండురెళ్ళు ఎంత? అని అడిగాడు. లోకేష్‌ ఏ మాత్రం తడు ముకోకుండా 'ఆరు' అని ఆన్సర్‌ చెప్పాడు. ఆ సమాధానంతో నారాయణ డైలమాలో పడ్డాడు. నా స్కూళ్లలో, కాలేజీలలో ఇంత కాలం రెండురెళ్లు నాలుగు అనే చెబుతు న్నారు, కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఇదే లెక్క చెప్పాము... ఇంతకాలం మేమే మన్నా తప్పు లెక్క చెప్పామా? లేకపోతే లోకేష్‌ అంత ఖచ్చితంగా 'ఆరు' అని వెంటనే చెప్పడు. ఎంతయినా మేధావుల కుటుంబంలో పుట్టినవాడు కదా అని మనసులో అనుకుంటూ, ఎందుకైనా మంచిది, సందేహం తీర్చుకుంటే పోతుం దని యనమల రామకృష్ణుడి చెవి దగ్గరగా నోరు పెట్టి... అన్నా, లోకేష్‌ చెప్పిన 'రెండురెళ్లు ఆరు' రైటేనంటారా? అని నెమ్మదిగా అడిగాడు. అందుకు యన మల... లోకేష్‌ చెప్పినా, చంద్రబాబు చెప్పినా అది నిజమే అయి వుంటుంది... అదీగాక 'రెండు రెళ్లు ఆరు' అనే సినిమా కూడా వుంది. 'రెండురెళ్లు ఆరు' కాక పోయి వుంటే అదే టైటిల్‌తో అంత డబ్బు ఖర్చుపెట్టి సినిమా ఎందుకు తీసుంటారని గట్టిగా చెప్పాడు. దాంతో నారాయణకు కూడా ఆ ఆన్సర్‌ మీద నమ్మకం కుదిరి, ఓకే వెరీగుడ్‌, బాగా చెప్పావు. యువార్‌ సెలక్టెడ్‌ అని చెప్పి పంపించారు.

ఆ తర్వాత సోమిరెడ్డి వంతు వచ్చింది. ఇక ఎలక్షన్‌కు రెండేళ్లే వుంది. ఈ రెండేళ్లలో బాగా తిరగాలి. కాబట్టి మంత్రి అయ్యేవాళ్లకు ఫిట్‌నెస్‌ వుండాలి. అందుకని ముందుగా సోమిరెడ్డికి రన్నింగ్‌ రేస్‌ పెట్టారు. వెయ్యిమీటర్ల దూరాన్ని ఒక్క నిముషంలో పరుగెత్తాలి. సాధారణంగా ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్స్‌ కొట్టినవాళ్లు కూడా ఇలా పరుగెత్తలేరు. నారాయణ ప్రోద్భలంతో చంద్రబాబు ఆ పరీక్ష పెట్టాడు. సోమిరెడ్డి కళ్లు మూసుకుని ఒక్క నిముషం భగవంతుడిని ప్రార్ధించాడు. తర్వాత రన్నింగ్‌ ట్రాక్‌ మీదకొచ్చి నిల బడ్డాడు. కోడెల విజిల్‌ వూదాడు. డిస్క వరీ ఛానల్‌లో జింకను వేటాడే చిరుతలా సోమిరెడ్డి పరుగు మొదలుపెట్టాడు. అప్పుడే పడమర గాలి కూడా బలంగా వీయసాగింది. ఆ గాలి దెబ్బకు సోమిరెడ్డి గాల్లోనే తేలుతూ అర నిముషంలోనే వెయ్యి మీటర్ల పరుగును కంప్లీట్‌ చేసాడు. రన్నింగ్‌ అయ్యాక డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌ సోమిరెడ్డి వద్దకు వచ్చి... సార్‌, ఇందాక కళ్లు మూసుకుని ఎవర్ని ప్రార్ధించారని అడిగాడు. ఇంకెవరు... ఇలాంటి సమ యాల్లో ఆదుకునేది వాయుదేవుడే కదా, ఆయననే ప్రార్థించాను, ఆయన కరు ణించబట్టే పడమర గాలితోలి ఈ రన్నింగ్‌ ఈవెంట్‌లో సక్సెస్‌ కాగలిగాను. వాయు దేవుడి సపోర్ట్‌ లేకుంటే మనం ఇక్కడే వెనుదిరగాల్సివచ్చేదని సోమిరెడ్డి చెప్పి, ఇంటర్వ్యూకు క్యాంప్‌ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ చంద్రబాబుతో పాటు నారాయణ, కోడెల, యనమల ఉన్నారు. చంద్రబాబుతో నారాయణ వుండి... ఈ ఇంటర్వ్యూలో మీరెవరూ కలుగజేసుకో వద్దు, అన్ని ప్రశ్నలు నేనే వేస్తాను, అన్నిం టికి ఆన్సర్లు చెబితేనే సెలక్ట్‌ చేద్దామన్నాడు. మిగతావాళ్లు అందుకు సరేనన్నారు. నారాయణ ప్రశ్నలేసాడు. నెల్లూరు నగ రంలో వున్న మొత్తం ముదురుదోమల సంఖ్య ఎంత? అని అడిగాడు. వెంటనే సోమిరెడ్డి... నెల్లూరుటౌన్‌, రూరల్‌ నియో జకవర్గాలు కలిపా... లేక కార్పొరేషన్‌ పరిధిలో వున్న 54డివిజన్‌లలోనివా? అని ఎదురుప్రశ్న వేసాడు. ఓన్లీ కార్పొ రేషన్‌లోని 54డివిజన్‌లలో వున్నవే చెప్పు అని నారాయణ అడిగాడు. అప్పుడు సోమిరెడ్డి 'ఠాగూర్‌' సినిమాలో చిరంజీవి లెవల్లో చేతులుకట్టుకుని... 54డివిజన్‌ లలో వున్న దోమలు 8కోట్ల 94లక్షల 66వేల ఏడువందలయాభైరెండు... అలాగే నెల్లూరు జిల్లాలో వున్న దోమల సంఖ్య 92కోట్ల 14లక్షల 93వేల యాభై మూడు... నెల్లూరు కార్పొరేషన్‌లో వున్న మొత్తం పందులు 4లక్షల 27వేల నూట పదహారు, నెల్లూరులో వున్న ఆటోలు 32వేల 16వందల నలభైనాలుగు, బైక్‌లు ఒక లక్షా రెండువేల 602, నెల్లూరులో వున్న మొత్తం కోతుల సంఖ్య 7లక్షల 12వేల నాలుగు వందల అరవై నాలుగు... అని చెప్పుకుంటూ పోతుం డగా... చంద్రబాబు కలుగజేసుకుని ఇక చాలు చాలు... నెల్లూరు మీద నీకున్న పట్టుకు ఈ సమాధానాలే నిదర్శనం. గుడ్‌ బాగా చెప్పావ్‌ అని కితాబిచ్చాడు. నారా యణ కిమ్మనకుండా ఇంకో ప్రశ్న వేసాడు. నీకు అవకాశమిస్తే ఈ ప్రపంచాన్ని ఎన్ని రోజుల్లో చుట్టి రాగలవని అడిగాడు. వెంటనే సోమిరెడ్డి... అరనిముషం చాలు అని చెప్పాడు. ఎలా అని అందరూ ఆశ్చ ర్యంగా ప్రశ్నించారు. ఇలా అంటూ సోమిరెడ్డి చంద్రబాబు చుట్టూ ఓ రౌండ్‌ కొట్టి... నా దృష్టిలో ప్రపంచమంటే చంద్ర బాబే... ఆయనను మించిన అద్భుత ప్రపంచం ఇంకొకటి లేదు. నాకు ఆయ నను చూస్తే ప్రపంచాన్ని చూసినట్లే వుం టుంది. ఆయనను చదివితే ప్రపంచాన్ని చదివినట్లే వుంటుందని చెప్పాడు. సోమి రెడ్డి సమాధానంతో చంద్రబాబు కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఆయన కళ్లు తుడుచుకుంటూ... నా చేత డైమండ్‌ను టెస్ట్‌ చేయించారు, డైమండ్‌ ఎప్పటికీ డైమండే అంటూ సోమిరెడ్డి భుజంతట్టి గోహెడ్‌ అని లేచాడు. సోమిరెడ్డి బయ టకు వచ్చాక జడ్‌.శివప్రసాద్‌ ఆయన వద్దకెళ్లి... సార్‌, లోపల ఇంటర్వ్యూ అంతా చూసాను... నారాయణ వేసిన ప్రశ్నలకు మీరు టకటక సమాధానాలు చెప్పారు. మీరు చెప్పిన దోమలు, పందుల లెక్కలు కరెక్టేనా? అని అడిగాడు. దానికి ఆయన నాకు మాత్రం ఏం తెలుసు అని అన్నాడు. మరి నారాయణ ఈ విషయం పసిగట్టలేదా అని సందేహం వెలిబు చ్చాడు జడ్‌.యస్‌. అందుకు సోమిరెడ్డి... వాళ్ళు వేసే ప్రశ్నలకు ఆన్సర్‌లు వాళ్లకు కూడా తెలియవనే విషయం నాకు తెలుసు. అందుకే నోటికొచ్చినట్లు చెప్పాను. ఇలాంటి ప్రశ్నలకు ఇలాగే సమాధానం చెప్పాలి. పద నెల్లూరు అంటూ బయలుదేరాడు.

Read 51 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
  ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…
 • పాపం పండెన్‌!
  నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…

Newsletter