14 April 2017 Written by 

14-04-2017 రాశిఫలాలు

rasi 07

1Ariesమేషం

ఉద్యోగ ప్రయత్నాలు వెనుకబడతాయి. ప్రలోభా లకు లొంగకుండా ఉద్యోగులు పని చేయాలి. అనుకొన్న పనులు నిదానంగా జరుగుతాయి. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. కొన్ని ముఖ్యవిషయాలు ఎవరితోనూ అనవద్దు. అనుకోని ప్రయాణాలు, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. ఆర్ధిక వ్యవహారాల నిర్వ హణలో జాగ్రత్త పడండి.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు కార్యసామర్ధ్యంతో పాటు పని వత్తిడి ఉంటుంది. విలువైన వస్తువులను పదిలపర్చుకొనండి. పెట్టుబడులకు కొత్త అవకాశాలుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ఒక ముఖ్య కార్యం మీద శ్రద్ధ చూపుతారు. కోర్టు వ్యవహారాలందు అనుకూలత కలదు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో వ్యాప్తి బాగుండి ఆదాయం పెరుగుతుంది.

 

3Geminiమిధునం

విలువైన వస్తువులు సమకూరటం, దూర ప్రయా ణాలుంటాయి. బిడ్డల వివాహ విద్యా విషయములపై శ్రద్ధ పెడతారు. అధికారులకు మంచి గుర్తింపు గౌరవా లుంటాయి. ఆరోగ్యం, విద్యా ప్రగతి బాగుంది. ఆర్ధిక ఇబ్బందులు, వ్యవహారంలో ఇబ్బందులు సర్దుకుంటాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరుగవచ్చును. భాగస్వామిక చర్చల్లో ప్రధాన పాత్ర వహిస్తారు.

 

4Cancerకర్కాటకం

బంధువర్గం నుండి అనారోగ్య వార్తలు వింటారు. ఒక మంచి పనికి సంసిద్ధులై కృషి చేస్తారు. కోర్టు వ్యవ హారాలు వాయిదా పడతాయి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. విద్యార్థులు మంచి కృషి చేస్తారు. స్థిరాస్తుల లావాదేవీలు జరుగుతాయి. కొత్త ఆర్ధి కావకాశాలు త్వరలో లభించగలవు. ఆరోగ్యం ఫరవా లేదు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

 

5Leoసింహం

విద్యా ప్రగతి బాగుంటుంది. అనుకున్న పనులు టెన్షన్‌తో సాగుతాయి. నష్టాలను ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. సభలు సమావేశాలలో మీదే కీలకపాత్ర వుంటుంది. ముఖ్య నోటీసులు అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి క్రమంగా బాగుంటుంది. ఖర్చులు అదుపు చేయాలి. బంధువర్గంతో సంబంధాలు బలపడగలవు. వ్యాపార వృత్తి జీవనాలు లాభసాటిగా జరుగుతాయి.

 

6Virgoకన్య

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం, కోర్టు కేసులు వాయిదా పడడం, బంధుముఖ్యులలో ఒకరికి అనారోగ్య బాధలుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. చేయ దలచిన పనులందు ఆర్ధిక వ్యవహారాలలో పొరపాట్లు రాకుండా చూచుకొనాలి. పనుల తీవ్రత ఇబ్బంది పెట్టక పోవచ్చు. ఇతరులను అతిగా నమ్మవద్దు.

 

7Libraతుల

విద్యార్థులు చదువుపై బాగా దృష్టి పెట్టాలి. బిడ్డల విద్యా ఉద్యోగ శుభకార్య విషయాలు ఆందోళన కలి గిస్తాయి. అనుకున్న పనులు జరుపుకొనడానికి శ్రమ పడాల్సి వస్తుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా పడ తాయి. ఉద్యోగులు ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుం టుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

 

8Scorpioవృశ్చికం

దూరం నుండి ఆహ్వానాలు అందుతాయి. శుభ కార్యాలు నిర్ణయం కాగలవు. సన్నిహితులే ఇబ్బందులు పెట్టే అవకాశం కలదు. కొత్త వస్తువులు ఇంటికి సమ కూరుతాయి. విద్యాప్రగతి, ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీ యులకు సహాయపడతారు. బంధుత్వ స్నేహాలు బలపడ తాయి. వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు అవకాశాలు బాగుంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి.

 

9Sagittariusధనుస్సు

కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్ర వర్గంతో సత్సం బంధాలు నెలకొంటాయి. కొత్త పెట్టుబడులు, స్థిరాస్తుల లావాదేవీలు జరుపుతారు. కుటుంబసౌఖ్యం, ప్రముఖు లతో పరిచయాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుట, మంచి ఆర్ధికాభివృద్ధి అవకాశాలు లభించడం జరుగుతుంది. తొందరపాటు మాటలు వద్దు.

 

10Capricornమకరం

వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యవ హారాలలో మీకు మంచి విలువ వుంటుంది. కొద్దిపాటి అనారోగ్య బాధలుంటాయి. ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా మెలగండి. వ్యాపారులకు, ఉద్యోగులకు అధికారుల వత్తిడి ఉంటుంది. విద్యా ప్రగతి బాగుం టుంది. కుటుంబంలో కొంత అనుకూలత లేకున్నా సర్దుబాటు చేసికొంటారు.

 

11Aquariusకుంభం

ఇతరుల పని మీద ప్రయాణాలుంటాయి. నిరుద్యో గులకు మంచి అవకాశాలుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కాంట్రాక్టు పనులు, గృహ నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. అనవసర ఖర్చులు తప్పవు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక లావాదేవీలు ఉత్సాహ పరుస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు జరుగవచ్చును. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది.

 

12Piscesమీనం

శుభకార్యాలలో పాల్గొంటారు. అదనపు ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. ఆహ్వానాలు నోటీసులు అందు కుంటారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. విద్యా ప్రగతి బాగుంటుంది. కుటుంబసౌఖ్యం కలదు. పనులు సక్రమంగా సానుకూలంగా జరుగుతాయి. వృత్తి వ్యాపా రాలు సామాన్యంగా జరిగి సామాన్య ఆదాయం ఉం టుంది. మంచి ఆర్ధికావకాశాలు చేజారిపోవచ్చును.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
    ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…
  • పాపం పండెన్‌!
    నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…

Newsletter