14 April 2017 Written by 

జై లవకుశలో చేరిపోయిన మరో బ్యూటీ

niveda thomasఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు పాత్రలు చేస్తున్నాడు. కాగా, ఇప్పటికే ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా రాశీఖన్నాను తీసుకోగా, మరో ఇద్దరు హీరోయిన్స్ కోసం వేట సాగిస్తున్న నిర్మాతలు ఇటీవలే జంటిల్మన్ మూవీతో విమర్శకుల ప్రశంసలందుకున్న మళయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఎప్పటినుండో నివేదను తీసుకోవాాలని చూస్తున్న చిత్రం బృందం ఎన్నో గాసిప్స్ సాగుతున్న తరుణంలో ఆశ్చర్యంగా నివేదను తీసుకోవడం విశేషం. మరో హీరోయిన్ ను చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. సినిమా మొదలైనప్పటి నుండి ఎన్నో భారీ అంచనాలతో తూసుకుపోతూ ఈమధ్య శ్రీరామనవమికి విడుదల చేసిన జై లవకుశ టైటిల్ ను యూ ట్యూబ్ లో ఎంత ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలతో వున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter