20 April 2017 Written by 

కలుస్తారా... కలసి నడుస్తారా?

tdp leadటీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం. కాబట్టే ఈ పార్టీలో ఇప్పుడు అన్ని పార్టీల అవలక్షణాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలలో వుండే చెడు సంస్కృతి అంతా కూడా ఇప్పుడు ఈ ఒక్క పార్టీలోనే కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో వుండే కుమ్ములాటలు, తిరుగుబాట్లు తెలుగుదేశం లోనూ నెలకొన్నాయి. ఎంతైనా ఇందులో ఇప్పుడు కాంగ్రెస్‌ రక్తం కలిసిందిగా!

నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీలోనూ తిరుగుబాట్లు, వర్గ గలాటాలు కామన్‌గా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంత్రి పదవిని చేజిక్కించుకున్నాడు. అయితే మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని వాడ్ని తొక్కాలి, వీడ్ని తొక్కి నార తీయాలి అనే పద్ధతిలో కాకుండా 'కలిసినడుద్దాం... పార్టీని ముందుకు నడిపిద్దాం' అనే కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టాడాయన. మూడేళ్లు ఎడమొగం పెడమొగంగా వున్న మంత్రి పి.నారాయణకే మొదటి స్నేహహస్తం అందించాడు. ఆ తర్వాత పార్టీలో పెద్ద కుటుంబంగా వున్న ఆనం సోదరులకు స్నేహహస్తం అందించారు. ఇక మంత్రి పదవి కోసం తనతో పోటీపడ్డ బీద రవిచంద్రతో మొదటిరోజే కలిసిపోయాడు. ఇక ఒకే పార్టీలో వున్నా, వేర్వేరు పార్టీలలో వున్నా సోమిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు నిప్పు, ఉప్పు లాగా వుండేవాళ్లు. సోమిరెడ్డి ప్రమాణస్వీకారానికి ఆనం సోదరు లతో పాటు ఆదాల కూడా హాజరు కాలేదు. అయినా కూడా ఆదాలను కలుపుకుపోవాలనే ఆలోచనతో సోమిరెడ్డి వున్నాడు.

ఇక ఎన్నికలకు రెండేళ్లే వున్నాయి. మంత్రి బాధ్యతలను సోమిరెడ్డి సమర్ధవంతంగానే నిర్వర్తిస్తాడు. చంద్రబాబుకు కూడా ఆ నమ్మకముంది. అయితే నిన్న జరిగింది ఎన్నికల మంత్రి వర్గ విస్తరణ. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కొత్తవాళ్లకు మంత్రిపదవు లిచ్చాడు. సోమిరెడ్డికి రాజకీయ కోణంలోనే మంత్రిపదవి వచ్చింది. ఈ రెండేళ్లలో జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేయాల్సి వుంది. తెలుగుదేశం పార్టీ బలహీనంగా వున్న జిల్లాల్లో నెల్లూ రొకటి. ఇక్కడ పార్టీని పటిష్టం చేయడం కత్తిమీద సామే! ఈ రెండేళ్లు సోమిరెడ్డికి పరీక్షా కాలమే! అటు మంత్రిగా ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూనే ఇటు జిల్లా మంత్రిగా పార్టీ ప్రయోజనాలు చూడాలి. పార్టీలో అందరినీ కలుపుకుని పోతేగాని ఇది సాధ్యం కాదు. అందుకే మంత్రికాగానే అందరికీ ఆయన స్నేహహస్తం అందించాడు. ఎంతమంది ఆయన స్నేహాన్ని స్వాగతిస్తారో చూడాలి!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • పాపం పండెన్‌!
    నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…
  • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
    ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…

Newsletter