20 April 2017 Written by 

21-04-2017 రాశిఫలాలు

rasi 21

1Ariesమేషం

ఉద్యోగ నిర్వహణలో జాగ్రత్త వహించండి. యజ మానులకు వర్కర్లతో ఇబ్బందులుంటాయి. షేర్లు, పెట్టు బడులు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం, ఆర్ధి కావకాశాలు తగ్గిపోవడం ఉంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది. వస్తువులు డబ్బు జాగ్రత్తగా పెట్టుకొనండి. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి.

 

2Taurusవృషభం

శుభవార్తలు వింటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. ప్రభుత్వ కార్యాలయంలో పనులు ఆలస్యం కాగలవు. విద్యా ప్రగతి బాగుంటుంది. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులు, ప్రయాణ ఖర్చులు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. విద్యాప్రగతి బాగుం టుంది. చేసే పనికి కృషికి తగ్గట్లుగా ఆర్ధిక స్థితి ఉం డదు. ఖర్చులు బాగా పెరిగిపోతాయి.

 

3Geminiమిధునం

కోర్టు వ్యవహారాలలో అనుకూలత, రావలసిన బాకీలు కొంతవరకు లభించడం జరుగుతుంది. వస్తు వాహన గృహ రిపేర్ల ఖర్చులుంటాయి. ఉద్యోగులకు అధికారు లతో సత్సంబంధాలుంటాయి. విద్యాప్రగతి ఉంటుంది. వ్యవహారాలలో నిర్ణయాలను, ఆర్ధిక వ్యవహారాలను సమర్ధవంతంగా జరుపుతారు. మాట, ప్రవర్తనలో తొందరపాటు లేకుండా చూచుకొనండి.

 

4Cancerకర్కాటకం

దైవ కార్యాలలో పాల్గొనడం, ప్రముఖులు పరిచయా లుంటాయి. షేర్లు పెట్టుబడుల మీద లాభాలుంటాయి. ఉద్యోగులకు అధికారుల వల్ల సహచరుల వల్ల సమస్య లుంటాయి. వృత్తి వ్యాపారాలలో రాబడి కొద్దిగా పెరుగు తుంది. ఉపాధి పథకాలలో నిలద్రొక్కుకుంటారు. కళా క్రీడా శాస్త్ర వైద్య రంగాల వారికి పరిస్థితులు ప్రోత్సా హకరంగా ఉంటాయి.

 

5Leoసింహం

ఉద్యోగులకు ప్రయోజనం కలిగే పనులు జరగడం, అధికార వర్గ అనుకూలత ఉంటుంది. ఆస్థి వ్యవహా రాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి రాగలవు. శుభకార్య ప్రయత్నాలు, అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. కొత్త వస్తువులు సమకూరుతాయి. కుటుంబంలో చిన్నచిన్న విషయాల వల్ల అభిప్రాయ బేధాలుంటాయి కాబట్టి సర్దుకొనిపోవాలి.

 

6Virgoకన్య

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు లభించడం, స్థిరాస్తుల లావాదేవీలు జరుగగలవు. హామీలు ఇవ్వడం, రిస్క్‌ తీసుకొనడం చేయవద్దు. ఉద్యోగార్ధులకు అవకాశాలు లభించగలవు. ఆర్ధికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. కాని మనస్సుకు కొరతగా అనిపిస్తుంది. కొత్త పెట్టుబడు లకు భాగస్వామ్య పెట్టుబడులకు అవకాశాలుంటాయి.

 

7Libraతుల

కొత్త పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. ఆకర్షణలకు వత్తిడులకు లొంగవద్దు. దూర ప్రయాణా లుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, పెట్టు బడులపై లాభాలుంటాయి. గృహ వస్తు వాహన రిపే ర్లుంటాయి. బంధువుల నుండి శుభవార్త వింటారు. ఆరోగ్యం కాపాడుకొనండి. ఆర్ధికముగా పెరుగుదల చేసే పనులన్నీ కలసివస్తాయి.

 

8Scorpioవృశ్చికం

బంధుముఖ్యులతో మాటపట్టింపు విరోధాలుంటాయి. జీవిత సహచరులకు ఆరోగ్య లోపం ఉండవచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల వల్ల ఇబ్బందులు కలుగవచ్చును. గృహ వస్తు వాహన రిపే ర్లుండవచ్చును. శ్రమతో అనుకున్న పనులు జరుపుకొం టారు. ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన ఆర్ధిక నిర్ణయాలలో పొరపాట్లు రాకుండా జాగ్రత్తపడండి.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులకు పని బాధ్యతలపై శ్రద్ధ ఉండడం, రావ లసిన బాకీలు కొంత చేతికందటం, స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరుగుట, దూర ప్రయాణాలు తప్పనిసరిగా ఉంటాయి. శుభకార్యాలు నిర్ణయం కావచ్చును. కొత్త కాంట్రాక్టులు అగ్రిమెంట్లు, లీజులకు అవకాశాలు రాగలవు. కుటుంబ సమస్యలను రాజీమార్గంలో సర్దు బాటు చేసికొనగలరు.

 

10Capricornమకరం

కళాక్రీడా మార్కెటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి. గృహోపకరణాలు విలువైన వస్తువులు చేకూరుతాయి. దైవకార్యాలలో పాల్గొనడం, సహాయ పడడం జరుగుతుంది. దూర ప్రయాణాలుంటాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగార్ధులకు ప్రయత్నాలు ఫలించవచ్చును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. భూలావాదేవీలు వాయిదా వేయండి.

 

11Aquariusకుంభం

పెట్టుబడులకు అవకాశాలు, షేర్ల మీద లాభాలుం టాయి. కొత్త వారితో పరిచయాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరుగుతాయి. ప్రభుత్వ అనుమతులు లభించగలవు. ఉద్యోగ బాధ్యతలు పెరిగి విశ్రాంతి తగ్గుతుంది. ఉద్యోగార్ధులకు ఇంటర్వ్యూ అవకాశాలు లభిస్తాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. కుటుంబంలో స్వల్పంగా అపార్ధాలుండి సర్దుకుంటాయి.

 

12Piscesమీనం

పనులు చేపట్టినవి నిదానంగా జరుగుతాయి. ప్రభుత్వ అనుమతులలో జాప్యం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. శుభవార్తలు వింటారు. బంధు ముఖ్యు లను ఆత్మీయులను కలుసుకొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు, ఉద్యోగులకు బాధ్యతల భారం పెరుగు తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగిపోతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడగలవు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter