Print this page
20 April 2017 Written by 

కావలి ప్రజల దాహార్తి తీర్చండి

шаблоны RocketTheme
Форум вебмастеров

pratapకావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును పరిశీలించారు. ఆ చెరువులో వున్న కొద్దిపాటి నీరు ప్రజల త్రాగునీటికి సరిపోవని, వెంటనే సోమశిల జలాలను చెరువుకు అందజేయాలని ఆయన అధికారులను కోరారు. పశువులకు కూడా తాగేందుకు సరిగా నీరందడం లేదని, వెంటనే సోమశిల జలాలు పంపిణీ చేసి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్న ఇనమడుగు శివరామిరెడ్డి మాట్లాడుతూ, కావలి ప్రాంతం పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని, కోవూరుకు రెండో పంటకు నీరిచ్చి కావలి నియోజకవర్గానికి తాగునీటికి కూడా నీరు వదలకపోవడం దారుణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే చెరువుకట్ట సంగం వద్ద నివాసం వుంటున్న కుటుంబాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కనుమర్లపూడి వెంకటనారాయణ, సాయి, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, పి.కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com