28 April 2017 Written by 

అయోమయంలో... ఆనం బ్రదర్స్‌

anam bros'ఎర్కపోయి వచ్చాము... ఇరుక్కు పోయాము' అన్నట్లుగా ఉంది తెలుగు దేశంపార్టీలో ఆనం సోదరుల పరిస్థితి. కాంగ్రెస్‌లో వున్నప్పుడు హైమాక్స్‌ లైట్లు లాగా ధగధగ వెలిగారు. తెలుగుదేశం లోకి వచ్చాక కిరసనాయిల్‌ దీపాల్లా మారి పోయారు. కాంగ్రెస్‌పార్టీలో వున్నంత వైభవం ఇక్కడ రాదని తెలుసు... అయితే మరీ ఇంత అధ్వాన్నమవుతారనుకోలేదు.

రెండేళ్ల క్రితమే తెలుగుదేశంలో చేరిన ఆనం సోదరులు ఈ పార్టీలో ఎందుకు చేరామా అనే పరిస్థితుల్లో ఇప్పు డున్నారు. కాంగ్రెస్‌లో వున్న గౌరవం ఇక్కడ లేకపోగా, కనీసం ఇక్కడ వాళ్లను నాయకులుగా కూడా గుర్తించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సరిగా పిలవడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనం కావడం వారి రాజకీయ జీవితానికి శాపంగా మారింది. రాజకీయ పునరా వాసం కోసమే వాళ్ళు తెలుగుదేశంలో చేరారు. ఆరోజుకు వాళ్లు వైసిపిలో చేరే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌లో వున్నప్పుడు జగన్‌ను వాళ్లు అట్లా ఇట్లా తిట్టలేదు. రాజకీయ విమర్శలు చేస్తే ఫర్వాలేదు. వీళ్ళు హద్దులు దాటి వ్యక్తి గతంగా కూడా విమర్శలు చేశారు. దానివల్లే వీళ్ళు వైకాపా వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. అదీగాక తెలుగుదేశం అధికారంలో వుండడం, చంద్రబాబుతో పాత స్నేహం ఉండ డంతో ఇక్కడైతే బాగుంటుందిలే అను కుని తెలుగుదేశంలో చేరారు. అయితే చేరినప్పటి నుండి

వాళ్లకు మనశ్శాంతి లేదు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు. ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జి బాధ్యత ఇవ్వడం తప్పించి ఇంకేమీ పదవులు లేవు. ఆనం వివేకాకు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ గాలికి కొట్టుకుపోయింది. అదంతా పక్కనపెడితే ఒకప్పుడు జిల్లాలో వీళ్లు ఏనుగులు లాగా పోతుంటే నక్కి నక్కి చూసిన ఎలుకల్లాంటి నాయకులు కూడా ఇప్పుడు వాళ్ల ముందుకు వచ్చి తోక చూపిస్తున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోవడం వారికి కష్టమే! ఇక వాళ్ళు తెలుగుదేశంలో ఎక్కువరోజులు కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • మూడేళ్ళు.... జిల్లాలో కనిపించని అభివృద్ధి ఆనవాళ్ళు!
    కలెక్షన్‌లలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 'బాహుబలి' చిత్రాన్ని చూసిన తర్వాత అదే హీరో ప్రభాస్‌ నటించిన 'బుజ్జిగాడు' సినిమాను చూస్తే ఎంత చెత్త ఫీలింగ్‌ కలుగుతుందో, 2004 నుండి 2009 వరకు బాహుబలి లాంటి వై.యస్‌. పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలకు…

Newsletter