28 April 2017 Written by 

ఫేస్‌'బుక్‌'అయ్యారు!

lokeshతెలుగుదేశం ప్రభుత్వం అక్రమా లను అభివృద్ధి పథాలుగా చూపిస్తూ, అరాచకాలను ఆదర్శ మార్గాలుగా వల్లిస్తూ, అవినీతిని అంతులేని ప్రగతిగా అభివర్ణిస్తూ ఇంతకాలం ఎల్లో మీడియా ఏపి ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. తాము చెప్పేవే సత్యాలు అన్నట్లుగా ప్రచారం చేసింది. అయితే ఎప్పటికప్పుడు నిజాలను బయట పెడుతూ, అక్రమాలను ప్రశ్నిస్తూ ఎల్లో మీడియాకు చుక్కలు చూపిస్తుంది సోషల్‌ మీడియానే!

అవును... రాష్ట్రంలో దాదాపు 90శాతం మీడియా సంస్థలన్నీ పచ్చ ప్రభుత్వం పట్ల పక్షపాతం చూపిస్తూ, ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒక భ్రమలోకి నెట్టే ప్రయత్నం చేసాయి. ఆ ప్రయత్నా లను చిత్తు చేస్తుంది సోషల్‌ మీడియా!

ఎల్లో మీడియాలో సంస్థల అధి పతులు కొందరే! కాని సోషల్‌ మీడియా లోకి వచ్చే సరికి టచ్‌స్క్రీన్‌ ఫోన్‌ వున్న ప్రతివ్యక్తి కూడా మీడియా ఓనరే! ఈ రాష్ట్ర ప్రజల ఆలోచనలను, ఆశలను, సమస్యలను ఏ మీడియా సంస్థా పట్టించు కోవడం లేదు. ఒకటి అరా మీడియా సంస్థలు పట్టించుకుంటున్నా వాటి మీద ప్రభుత్వ వ్యతిరేక ముద్రలున్నాయి. ఈ దశలో రాష్ట్ర

ప్రజలు మనోభావాలకు సోషల్‌ మీడియానే వేదికగా నిలిచింది. సోషల్‌ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటపెట్టడం ఎక్కువైంది. ప్రభుత్వపరంగా ఏ చిన్న పొరపాటు జరిగినా వెంటనే సోషల్‌ మీడియాలో నెటిజన్లు తుప్పు రేపేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌నైతే ఆడుకుంటున్నారు. తన ఎల్లో మీడియా భజన చేస్తున్నంత కాలం చంద్రబాబుకు సమ్మగా వుండింది. సోషల్‌ మీడియాలో ఎప్పుడైతే వ్యతిరేక ప్రచారం ఉధృతమైందో అప్పుడు సుర్రుమంది. అదీగాక ఈమధ్య జనాలు టీవీ ఛానెల్స్‌ను ఎక్కువుగా చూడ్డం లేదు. టీవీలో చెప్పింది నమ్మడం లేదు. చేతిలో సెల్‌ఫోన్‌ వుంటుంది కాబట్టి ఫేస్‌బుక్‌లోనే వార్తావిశేషాలు చూసుకుంటున్నారు. రాష్ట్రంలో యువత ఎక్కువ భాగం చంద్రబాబుకు వ్యతిరేకంగానే వుంది. ప్రత్యేకహోదా, నిరుద్యోగ భృతి, ఉపాధి అంశాల విషయంలో బాబు మోసం చేయడంతో పాటు ప్రతిపక్ష నేత జగన్‌ పట్ల యువత ఆకర్షింపబడుతున్నారు. సోషల్‌ మీడియాను ఎక్కువుగా ఉపయోగించేది కూడా యువతే! కాబట్టే సోషల్‌ మీడియాలో తెలుగుదేశం వ్యతిరేక ప్రచారం ఎక్కువుగా ఉంటోంది. దీనిని తట్టుకోలేకే చంద్రబాబు సోషల్‌ మీడియాలో తనకు వ్యతిరేక ప్రచారం చేస్తున్న వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టించి, అరెస్ట్‌ చేయిస్తున్నాడు. చంద్రబాబు బండారం ఇక్కడే బయటపడుతుంది. ప్రతిపక్షనేత జగన్‌ మీద, ఆయన కుటుంబం మీద పచ్చమీడియా ఎంత విషప్రచారం చేసింది. ఈ లెక్కన చూస్తే ఎంతమంది ఎల్లో మీడియా అధిపతులను అరెస్ట్‌ చేసి వుండాలి. సోషల్‌ మీడియాలో వ్యక్తులే అధిపతులు. సోషల్‌ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతుందని అరెస్ట్‌ల జోలికి వెళితే చంద్రబాబు కొన్ని లక్షల మందిని అరెస్ట్‌ చేయించాల్సి వస్తుంది. అరెస్ట్‌ల వంటి వాటితో సోషల్‌ మీడియాను అణచాలని చూస్తే చంద్రబాబు తేనెతుట్టె మీద రాయి వేసినట్లే!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
    రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…

Newsletter