28 April 2017 Written by 

దాహార్తికి మూగజీవాలు విలవిల

cowతాగడానికి గుక్కెడు మంచినీరు దొరక్క జనం అల్లాడిపోతుంటే, దాహార్తికి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు అడుగంటి ఎటుచూసినా ఎడారే కనిపిస్తోంది. దీంతో దాహంతో మూగజీవాలు గిలగిల కొట్టుకుంటూ వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. పశుగ్రాసం, నీటి కొరతవల్ల గడిచిన 45 రోజుల్లో 1255 పాడిపశువులు మృత్యు వాత పడినట్లు సమాచారం. పూట గడ వడమే కష్టమైన సమయంలో పశుపోషణ భారంగా మారిన రైతులు వాటిని తెగ నమ్ముకుంటున్నారు. పశుపోషణ భరించ లేక ఇప్పటికే అత్యధిక శాతం పశువులను ఒక్కొక్కటిగా రైతులు కబేళాలకు తరలిస్తు న్నారు. పాల దిగుబడి నిలిచిపోయిన పశువులను తక్కువ ధరలకు రైతులు అమ్మేస్తున్నారు. నీటి కొరతవల్ల పశువుల సంఖ్య తగ్గి పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మార్చి నుంచి కరువు రక్కసి ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో పశుపోషణ రైతులకు తీవ్రమైన భారంగా మారింది. దీంతో జిల్లాలో పాడిపశువులు గడ్డిపోచ కరువై నకనకలాడుతున్నాయి. పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నరైతు కుటుంబాల పరిస్థితి అగమ్య గోచ రంగా మారింది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter