Friday, 28 April 2017 10:21

బాబు ఇంట బొమ్మరిల్లు సినిమా!

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది ప్రపంచంలోని మేటి నగరాల న్నింటిని కాసి వడబోసి కట్టిన అమరావతి రాజధాని నగరం. నారా లోకేష్‌ పంచా యితీరాజ్‌, ఐ.టి శాఖ మంత్రిగా తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అనం తరం అక్కడే వున్న విలేకరులతో మాట్లా డుతూ రాష్ట్రంలో అన్ని పంచాయితీలకు కొత్త భవనాలు కట్టించి పంచాయితీరాజ్‌ మంత్రిగా సత్తా చూపిస్తాను... అట్లాగే రాష్ట్రంలో ప్రజలందరి చేత అఖరకు అడుక్కునేవాళ్ళ చేత కూడా ఆదాయపన్ను కట్టించి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచు తానని చెప్పాడు. అప్పుడు 'ఆత్మసాక్షి' రిపోర్టర్‌ వుండి... సార్‌, పంచాయితీ రాజ్‌ మంత్రిగా పంచాయితీలకు కొత్త బిల్డింగ్‌లు కట్టిస్తామన్నారు సరే, ఆదాయ పన్నుకు మీకు సంబంధమేంటని అడి గాడు. వెంటనే లోకేష్‌... ఐటి శాఖ అంటే ఇన్‌కంటాక్స్‌ శాఖే కదా అని సమా ధానమిచ్చాడు. ఆ జవాబుకు అక్కడున్న వారందరి కళ్లు బైర్లుకమ్మాయి. వెంటనే ఏబిసిడి రిపోర్టర్‌ వుండి... సార్‌, ఐటి అంటే ఆదాయపన్నుశాఖ కాదు, ఇన్‌ఫర్మే షన్‌ టెక్నాలజీ శాఖ అని అర్ధం అని చెప్పాడు. లోకేష్‌ సెల్‌ తీసి తన తండ్రి చంద్రబాబుకు ఫోన్‌ చేసాడు. అవతల చంద్రబాబు ఫోన్‌ ఎత్తగానే... నాన్నారు ఐ.టి శాఖ అంటే ఏంటి అని అడిగాడు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అని చంద్రబాబు చెప్పాడు. ఆ ముక్క నాకు మంత్రి పదవి ఇచ్చేముందు చెప్పాలి, మీరు ఐటి శాఖ ఇచ్చారంటే ఇన్‌కంటాక్స్‌ శాఖ ఇచ్చారను కున్నా, దాని గురించే మీడియా ముందు మాట్లాడి ఫూల్‌నయ్యా, పోండి నాన్నగారు, మీరెప్పుడూ ఇలానే చేస్తారు అని లోకేష్‌ విసురుగా ఫోన్‌పెట్టేసాడు. మీడియా వాళ్ళు వెళ్లిపోయాక లోకేష్‌ పి.ఎస్‌ కొన్ని ఫైళ్లను తీసుకుని లోపలకు వచ్చాడు. పెద్ద ఫైళ్ల కట్టే ఉండడంతో లోకేష్‌ వాటిని చూసి... నాకిప్పుడు మూడేం బాగాలేదు, వాటిని అక్కడపెట్టండి, మూడ్‌ వచ్చాక అన్ని ఫైళ్లను చదివి సంతకం పెడతా నన్నాడు. అందుకు పి.ఎస్‌... మీరేం వాటిని అంత కష్టపడి చదవబల్లేదు సార్‌, నాన్నగారే అన్నీ చదివి పంపించారు. జస్ట్‌ మీరు వాటి మీద సంతకాలు పెడితే చాలు అని చెప్పాడు. ఆ మాటకు లోకేష్‌ విసురుగా ఇక్కడ కూర్చుని ఇక నేనేం చేయాలి అని అడిగాడు. గంటకొకసారి బూస్ట్‌, లంచ్‌కు రెండు పుల్కాలు ఇవ్వ మన్నారు సార్‌. మీరు బూస్ట్‌ తాగి ఆ రెండు పుల్కాలు తింటే చాలని చెప్పాడు పి.ఎస్‌. ఆ మాటతో లోకేష్‌కు చిర్రెత్తు కొచ్చింది. షిట్‌... అంటూ కాలితో ఫ్లోర్‌ను గట్టిగా తన్నాడు. ఆ దెబ్బకు ఆ ఛాం బర్‌లో ఎంతో నాణ్యతగా వేసిన రెండు టైల్స్‌ పగిలిపోయాయి.

్య్య్య్య్య

విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం. ఆరోజు హైటెక్‌రత్న, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రు లందరూ చంద్రబాబును వీరుడు, ధీరుడు, కత్తిపట్టని విక్రమార్కుడు అంటూ తెగ పొగిడారు. అందరూ మాట్లాడాక లోకేష్‌ వంతు వచ్చింది. ఆయన లేచి మైక్‌ వద్దకు పోగానే పి.ఎస్‌ ఒక పేపర్‌ తెచ్చిచ్చాడు. ఏమిటిదని లోకేష్‌ అడిగాడు. స్క్రిప్ట్‌ సార్‌, నాన్నగారు రాసిచ్చారు అని పి.ఎస్‌ చెప్పాడు. అందుకు లోకేష్‌ సీరియస్‌గా... మేమూ చదువుకున్నామండి, మేమూ సొంతంగా మాట్లాడగలం. మా స్క్రిప్ట్‌లు మాకుంటాయి. చెప్పండి మీ సీఎం గారికి అని అన్నాడు. అందుకు పి.ఎస్‌, బికాంలో ఫిజిక్స్‌ చదివిన జలీల్‌ఖాన్‌ గారిని మీరు ఫాలో అవుతున్నారని నాన్నగారు భయ పడుతున్నారు. మొన్న అంబేద్కర్‌ జయంతి నాడు అందరికీ వర్ధంతి శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ కూడా అది రిపీట్‌ అవుతుందేమోనని నాన్నగారి భయం అని చెప్పాడు. నేను అంత శుద్ధ పప్పును కాను... మొన్నంటే తెలియక నోరు జారాను... ఇప్పుడు నాకు బాగా తెలి సింది. బర్త్‌డేను జయంతి, డెత్‌డేను వర్ధంతి అంటారు అని లోకేష్‌ చెప్పాడు. దానికి పి.ఎస్‌... మీరక్కడే పప్పులో కాలే స్తున్నారు, చనిపోయినవ్యక్తుల విషయం లోనే బర్త్‌డేను జయంతి, డెత్‌డేను వర్ధంతి అంటారు. ఇప్పుడు జీవించివున్న మనుషుల విషయంలో అయితే బర్త్‌డేను జన్మదినోత్సవం అంటారు. ఎందుకొచ్చిన రిస్క్‌ సార్‌, మళ్ళీ ఆ సోషల్‌ మీడియా వాళ్లకు పని పెట్టడమెందుకు, శుభ్రంగా నాన్నగారిచ్చిన స్క్రిప్ట్‌ చదివేసేయండి సార్‌ అని చేతిలో పెట్టాడు. లోకేష్‌ ఆ స్క్రిప్ట్‌ చదివేసి మౌనంగా దిగిపోయాడు. లోకేష్‌ను చూసి అక్కడున్న మంత్రులు, నాయకులు కూడా తండ్రి చాటు బిడ్డ, ఇప్పటికీ అన్నీ తండ్రి చెబితేనే చేస్తుంటా డని అనుకోసాగారు. ఆ మాటలు లోకేష్‌ చెవిన పడ్డాయి.

------------

అది చంద్రబాబు ఇల్లు. లోకేష్‌, నారా బ్రాహ్మిణితో క్యారమ్స్‌ ఆడుతుంటే భువనేశ్వరీదేవి దేవాన్ష్‌ను ఒడిలో కూర్చో బెట్టుకుని వారి ఆటను చూస్తుంది. లోకేష్‌ అప్పటికి నాలుగు వైట్‌, ఐదు బ్లాక్‌ కాయిన్స్‌ వేసి అప్పుడే రెడ్‌కాయిన్‌ను కూడా వేసాడు. ఫాలో కాయిన్‌ వేస్తే రెడ్‌ కాయిన్‌ సొంతమవుతుంది. లోకేష్‌ ఒక వైట్‌ కాయిన్‌కు స్ట్రైగర్‌కు గురిపెట్టి కొట్టబో తుండగా చంద్రబాబు వచ్చాడు. ఠక్కున లోకేష్‌ చేయి పట్టుకుని ఆ కాయిన్‌ను ఇలా కొడితే ఎలా పడుద్దనుకున్నావ్‌... గురి చూసి రిఫ్‌లో ఈ బ్లాక్‌ కాయిన్‌ను కొట్టు అని చెప్పాడు. లోకేష్‌ ఇక కాదనలేక అలాగే చేసాడు. బ్లాక్‌ కాయిన్‌ పడలేదు గాని స్ట్రైగర్‌ పోయి బొక్కలో పడింది. లోకేష్‌ ఇంకో ఎగస్ట్రా కాయిన్‌ పెట్టాల్సి వచ్చింది. బ్రాహ్మణి తర్వాత మళ్ళీ స్ట్రైగర్‌ లోకేష్‌కు వచ్చింది. లోకేష్‌ రెడ్‌కాయిన్‌కు స్ట్రైగర్‌ను గురిపెట్టి కొట్టబోతుండగా, చంద్రబాబు... రేయ్‌, లోకేష్‌ అలా కొడితే ఎలా పడుతుందనుకున్నావ్‌, ఇటు డైరక్షన్‌ మార్చు అని చెప్పాడు. అపండి నాన్నగారు అంటూ లోకేష్‌ పెద్దగా అరిచాడు. ఏమైం దిరా అని చంద్రబాబు ఆతృతగా అడి గాడు. ఆ పరిణామానికి భువనేశ్వరి కూడా నిర్ఘాంతపోయింది. లోకేష్‌ వుండి... ఇంతకంటే ఏం కావాలి నాన్నగారు, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు నాన్నగారు, నా పని కూడా మీరే చేస్తుంటే ఇక నా పని నేనెప్పుడు చేసుకోవాలని నాన్నగారు... మంత్రిని చేసారు, కాని ఫైల్స్‌ మీరే చూస్తారు, స్టేజీల మీదకు పంపిస్తారు, స్క్రిప్ట్‌ మాత్రం మీరే ఇస్తారు. ఇక నా స్క్రిప్ట్‌ నేనెప్పుడు చదవాలి నాన్న గారు. మిమ్మల్ని గెలిపించడం కోసం ప్రతి క్షణం నేను ఓడిపోతున్నాను నాన్నగారు. నాకు కావాల్సిన డ్రాయర్లు మీరే కొం టారు, నాకు హార్లిక్స్‌ ఇష్టమైతే మీరు బూస్ట్‌ ఇస్తారు, నాకు చపాతీలు తినాలనిపిస్తే మీరు పుల్కాలు పెట్టిస్తారు. నాకు ఏరో బిక్స్‌ ఇష్టం... మీరేమో యోగా చేయి స్తారు. ఆఖరకు నేను అంతంత మాత్రంగా ఆడే క్యారమ్స్‌లో కూడా వేలుపెట్టి ఆ ఆటలో కూడా నన్ను చేతగాని వాడిగా చేస్తున్నారు. అందరూ నవ్వుతున్నారు నాన్న గారు. ఆ సోషల్‌ మీడియాలో అయితే నన్ను శుద్ధపప్పు అంటూ పోస్టింగ్‌లు పెడుతున్నారు అని బాధగా అన్నాడు. అందుకు చంద్రబాబు... వాళ్ళు పోస్టింగ్‌లు పెడితే నాదా తప్పు... నేనేం చేసానురా అని అడిగాడు. అంతా మీరే చేసారు నాన్నగారు... చేయాల్సిందంతా మీరే చేసారు... అని లోకేష్‌ అన్నాడు. ఆ మాటకు చంద్రబాబుతో పాటు భువ నేశ్వరిదేవి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లు కూడా నిర్ఘాంత పోయారు. అవేం మాటలు లోకేష్‌... నాన్నగారు ఏం చేసారని భువ నేశ్వరీదేవి అడిగింది. అందుకు లోకేష్‌... అంతా నాన్నగారే చేసారమ్మా... ఈ రాష్ట్రానికి సెల్‌ఫోన్‌లు ఆయనే తెచ్చారు, ఐ.టి కంపెనీలను ఆయనే తీసుకొచ్చారు, అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్‌లు ఉం డేలా చేసారు. అందరూ వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌లు వాడేలా డెవలప్‌ చేసారు. ఆయన తెచ్చిన ఫోన్‌లు, ఆయన తెచ్చిన సాఫ్ట్‌వేర్‌ల మూలంగానే ఈ రోజు సోషల్‌ మీడియా డెవలప్‌ అయ్యి అందులో అందరూ నన్ను 'పప్పు' అని ఆడుకుంటున్నారమ్మా... ఆయన అసలు సెల్‌ఫోన్లే తేకుంటే నాకీ పరిస్థితి ఉండేది కాదుకదా అని ప్రశ్నిం చాడు. ఆ మాటకు భూవనేశ్వరీదేవి... నిజమే కదా అన్నట్లు చంద్రబాబు వైపు చూసింది. లోకేష్‌ లాజిక్‌కు ఏం చెప్పాలో తెలియక చంద్రబాబు పైన తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌కేసి చూడసాగాడు.

Read 191 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter