05 May 2017 Written by 

నెల్లూరు మిషన్‌ భగీరథుడు

bhagiradhaమండుటెండలో ఓ బాటసారి నడిచిపోతున్నాడు... నడిచి నడిచి ఎండ దెబ్బకు శోషవచ్చి పడి పోయాడు. ఆ టైంలో అతనికి రియాజ్‌ బిరియాని పెట్టినా, మురళీకృష్ణ స్వీట్స్‌ తిని పించినా... ఫలితం ఉం టుందా? ఆ సమయంలో అతనికి కావాల్సింది గుక్కెడు నీళ్ళు. ఆపదలో వున్నవాడి అవసరాన్ని గుర్తించి చేసే దాన్ని మానవత్వంతో కూడిన దానం అంటారు. ఇప్పుడు అలాంటి అవసరాన్ని గుర్తించే ఓ వ్యక్తి గొంతెండిపోతున్న పల్లెలకు గుక్కెడు నీళ్ళు అం దించే కార్యక్రమం పెట్టు కున్నాడు.

గొంతు తడారిన పల్లెసీమలను గుర్తిస్తూ, తన సొంత నిధులతో ఆ పల్లెల్లో మినరల్‌వాటర్‌ ప్లాంట్లను పెట్టిస్తూ మీ గొంతుల్లోనే కాదు, మీ గుండెల్లోనూ తడారనివ్వనని భరోసా ఇస్తున్న ఆ మిషన్‌ భగీరథుడే ప్రముఖ దాత, విపిఆర్‌ ఫౌండేషన్‌ అధినేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి!

పల్లెప్రజలకు గుక్కెడు నీరందించడంలోనే సంతృప్తి

- వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి

విపిఆర్‌ అమృతధార కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చడం తనకెంతో సంతృప్తి కలిగిస్తోందని ప్రముఖ దాత విపిఆర్‌ ఫౌండేషన్‌ అధినేత వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అన్నారు. మంగళ వారం ఆయన జలదంకి, కలిగిరి మండలాల్లో విపిఆర్‌ వికాస్‌ అమృతధార కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారం భించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, తాము

ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలకు

గుక్కెడు మంచినీరు అందివ్వడంలో తమకెంతో అనందం వుందన్నారు. విపిఆర్‌ వికాస్‌ ద్వారా అమృతధార పథకం కింద ఈ ఏడాదిలో నూరు మినరల్‌ వాటర్‌ప్లాంట్‌లు ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్లాంట్‌లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. జలదంకి మండలంలోని సోమవరప్పాడు గ్రామంలో 3వ విడతగా ఆ గ్రామపెద్దలైన రమణారెడ్డి, కామేశ్వరమ్మ చేతుల మీదుగా వేమిరెడ్డి ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభింపజేశారు. అదేవిధంగా కలిగిరి మండలంలోని తూర్పు గుడ్లదొనలో గ్రామ పెద్దలు సుబ్బారెడ్డి, శేషమ్మల చేతుల మీదుగా ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ సిఇఓ ప్రొ. వి.నారాయణరెడ్డి, చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ ఎన్‌.శంకర్‌, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, సర్పంచ్‌లు శ్రీనివాసులురెడ్డి, ఆదిశేషా రెడ్డి, ఎంపిటిసి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువతకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి క్రికెట్‌ కిట్‌లను, వాలీబాల్‌ కిట్‌లను అందజేశారు.

ప్రజల ప్రశంసలందుకుంటున్న విపిఆర్‌ సేవలు :

విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విపిఆర్‌ విద్య, విపిఆర్‌ వైద్యం, విపిఆర్‌ వాత్సల్యం సంస్థలు ఇప్పటికే జిల్లా ప్రజల మనసుల్లో సముచిత స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో భాగంగానే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో 'విపిఆర్‌ వికాస్‌' అనే నూతన కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. వెనుకబడిన గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం 100ఆర్‌ఓ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ లను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ఎంపిక చేసిన గ్రామాల్లో ఆ మేరకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వాటి స్థాపనకు కృషి చేస్తుండడం ప్రజలందరికీ ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఈ సందర్భంగానే గ్రామీణ యువతకు క్రీడాస్ఫూర్తినందిస్తూ వారికి అవసరమైన క్రికెట్‌, వాలీబాల్‌ కిట్‌లను అందజేస్తుండడం యువతలో ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. విపిఆర్‌ వికాస్‌ ద్వారా ఇప్పటికే తొలివిడతగా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో 8 గ్రామాల్లో ఆర్‌ఓ ప్లాంట్‌లు స్థాపించి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చేతుల మీదుగా విపిఆర్‌ అమృతధార కార్యక్రమాన్ని ప్రారంభించారు.2వ విడతలో సీతారామపురం మండలం బసినేనిపల్లిలో, ఉదయగిరి మండలం దాసరిపల్లి గ్రామం లోనూ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు ప్రారం భించి ప్రజల దాహార్తిని తీర్చారు.

బసినేనిపల్లిలో :

తొలుత రెండవ విడతలో భాగంగా సోమవారం సీతా రామపురం మండలంలోని బసినేనిపల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సమక్షంలో గ్రామపెద్దలు ఖాజావళి, మహబూబాబీ చేతుల మీదుగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని విపిఆర్‌ వికాస్‌ కార్యక్రమం ద్వారా గ్రామీణ యువతను భాగస్వాములను చేసి ఈ మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిం చడం ఎంతో సంతోషదాయకమన్నారు. మనిషికి నీరు ప్రాణా ధారం కనుక, ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను గ్రామంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విపిఆర్‌ ఫౌండేషన్‌ సిఇఓ ప్రొ. వి.నారాయణరెడ్డి, ఛీప్‌ కో-ఆర్డినేటర్‌ ఎన్‌.శంకర్‌, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, గ్రామసర్పంచ్‌ శ్రీమతి రమాదేవి, రమణయ్య, గ్రామపెద్దలు వేంకటసుబ్బారెడ్డి మరియు వికాస్‌ యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి యువతకు క్రికెట్‌ కిట్‌లను, వాలీబాల్‌ కిట్‌లను ప్రదానం చేశారు.

దాసరిపల్లి గ్రామంలో :

ఆ తర్వాత అదే రోజున ఉదయగిరి మండలం దాసరపల్లి గ్రామంలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సమక్షంలో గ్రామపెద్దలు మొహిద్దీన్‌ షా, ఫాతిమా చేతుల మీదుగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల సుబ్బారెడ్డి, సయ్యద్‌ గౌస్‌మొహిద్దీన్‌, విపిఆర్‌ వికాస్‌ యువత తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేమిరెడ్డి చేతుల మీదుగా గ్రామ యువతకు క్రికెట్‌ కిట్‌లు, వాలీబాల్‌ కిట్‌లు అంద జేశారు. అదేరోజు మధ్యాహ్నం 12గంటలకు వింజమూరు మండలంలోని జనార్దనపురం గ్రామంలోనూ గ్రామపెద్దలు యహోనా చేతుల మీదుగా మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌ కొండస్వామి, గ్రామపెద్ద రవి, మోహన్‌రెడ్డి, విపిఆర్‌ వికాస్‌ యువత పాల్గొన్నారు. అనంతరం గ్రామయువతకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చేతుల మీదుగా క్రికెట్‌ కిట్‌లు, వాలీబాల్‌ కిట్‌లు అందజేశారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • మూడేళ్ళు.... జిల్లాలో కనిపించని అభివృద్ధి ఆనవాళ్ళు!
    కలెక్షన్‌లలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 'బాహుబలి' చిత్రాన్ని చూసిన తర్వాత అదే హీరో ప్రభాస్‌ నటించిన 'బుజ్జిగాడు' సినిమాను చూస్తే ఎంత చెత్త ఫీలింగ్‌ కలుగుతుందో, 2004 నుండి 2009 వరకు బాహుబలి లాంటి వై.యస్‌. పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలకు…

Newsletter