05 May 2017 Written by 

జోరు పెంచిన జగన్‌

jagan2014లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటన్న ప్రశ్నకు చాలామంది చెప్పే సమాధానం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఇంకొందరు చెప్పేది పవన్‌ కళ్యాణ్‌ మద్దతు పలకడం, మరికొందరు చెప్పేది చంద్రబాబు చేసిన ఋణ మాఫీ వాగ్దానాన్ని రైతులు నమ్మడం. వీటిలో కొంతవరకు వాస్తవం వుండొచ్చు. అయితే అన్నింటికంటే కరెక్ట్‌ సమాధానం తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణం వైకాపా అధినేత జగన్‌! ఇది నమ్మాల్సిన నిజం కూడా!

జగన్‌ 2014 ఎన్నికలను జాగ్రత్తగా చేసుకుని వుంటే అధికారం అతని చేయి దాటిపోయేది కాదు. వస్తామన్న కాంగ్రెస్‌ కేడర్‌ను చేర్చుకుని వున్నా, చంద్రబాబులాగే రైతు ఋణమాఫీ వాగ్దానం చేసున్నా, ఒక మతపరమైన ముద్రను పడకుండాచేసుకుని వున్నా వైసిపిదే అధికారం. కాని ఉత్తుత్తి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి వున్నా, ఇప్పటికే ఫెయిలై వుండేవాడు. హామీల విషయంలో వాస్తవాలకు కట్టుబడి అధికారానికి దూరమైనా, తండ్రిలాగే మాటిస్తే తప్పడనే పేరును మాత్రం నిలుపుకున్నాడు. అయితే 2014 ఎన్నికల నాటి వైఫల్యాలను గుణపాఠంగా తీసుకున్న జగన్‌ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాటన్నింటిని కూడా సరిదిద్దుకుంటున్నాడు. ముఖ్యంగా అధికారపార్టీ వైఫల్యాలను ఓట్లుగా మలచుకునే ప్రక్రియను వేగవంతం చేశాడు. రాష్ట్ర రాజకీయాలను శాసించే యువత దృష్టిని ప్రముఖంగా ఆకర్షిస్తున్నది జగనే! ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు రాష్ట్రంలో యువతకు టోపీ పెడితే, ఆ ప్రత్యేకహోదా కోసం ఇప్పటికీ పోరాడుతున్నది జగనే! ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌ చేపట్టిన దీక్షలకు సైతం యువత నుండి విశేషస్పందన రావడం చూసాం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ఋణమాఫీ వాగ్దానం వల్ల రైతులు తెలుగుదేశాన్ని నమ్మారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన ఋణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా సెజ్‌ల పేరుతో ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీకి బలవుతున్నది కూడా రైతులే! ఇప్పుడు పండించుకుంటున్న పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు లబోదిబోమంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ రైతూ సంతోషంగా లేడు. దీనికితోడు కరువు కాటకాలతో రైతాంగం అల్లాడుతోంది. గిట్టుబాటు ధరలు లేని మిర్చి రైతుల కోసం జగన్‌ గుంటూరులో నిర్వహించిన రైతు దీక్షకు రైతులు పోటెత్తడం చూసాము. అలాగే బి.సిలలో చేరుస్తామన్న చంద్రబాబు మాట నమ్మి తెలుగుదేశానికి మద్దతు తెలిపిన కాపులు సైతం ఈరోజు కసితో రగిలిపోతున్నారు. చంద్రబాబుపై దండయాత్రకు సిద్ధంగా వున్నారు. జీవితంలో ఒకే ఒక్కసారి చంద్రబాబును నమ్మిన పాపానికి మోసపోయామనే బాధతో వున్నారు. ఇక మైనార్టీలు జగన్‌కు బలమైన అండగా నిలిచివున్నారు.

రాష్ట్రంలో ఒకట్రెండు సామాజిక వర్గాల నుండి తప్పితే మిగిలిన అన్ని సామాజిక వర్గాల నుండి కూడా జగన్‌కు బలమైన మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా యువత, అన్నదాత జగన్‌కు అండగా నిలవనున్నారు. జగన్‌ చేసుకోవాల్సిందల్లా 2014 ఎన్నికలనాటి వైఫల్యాలను పునరావృతం కాకుండా చూసుకోవడమే! పార్టీ కమిటీలను పటిష్టం చేయాలి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతో బూత్‌కమిటీలు వేయాలి. వార్డులు మొదలుకొని మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలవారీగా కమిటీలను నియమించాలి. ప్రతిజిల్లాకు ఒక్కో ఇన్‌ఛార్జిని నియమించాలి. కొందరు సీనియర్లను ఎన్నికల్లో నిలపకుండా ఎన్నికలు నడిపే పరిశీలకులుగా నియమించుకోవాలి.

జగన్‌ గతానికి చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్‌ నాయకులను, తన తండ్రి వై.యస్‌. సన్నిహితులను తిరిగి దగ్గరకు చేర్చుకోవాలనే ఆలోచనలో వున్నట్లు సమాచారం. ప్రజల్లో వున్న అభిమానమే కాదు, రాజకీయాలలో, ఎన్నికలలో వ్యూహప్రతివ్యూహాలు నడిపే నాయకగణాలు కూడా ఎంతో అవసరం. ఈ గణాలను సమకూర్చుకునే దిశగా జగన్‌ అన్ని వైపుల నుండి జోరు పెంచాడు. ఓ పక్క ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంకో పక్క ప్రజాక్షేత్రంలో పోరాటాల ద్వారా ప్రజామద్దతు కూడగడుతూ మరోపక్క మిత్రులను దరి చేర్చుకుంటూ పక్కా వ్యూహాలతో ఆయన ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాడని సమాచారం.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter