05 May 2017 Written by 

రియల్టర్ల గుండెల్‌ గు'బిల్లు'

realఅసలే కాల్లో ముల్లు గుచ్చుకుని నక్క మూలుగుతూ తాటి చెట్టు క్రిందికొచ్చింది... అప్పుడే దాని నెత్తిన తాటికాయ పడింది. ఇంకా మూలుగు పెంచి నీరసంగా ఇంకో చోటకు చేరింది. అప్పుడే భారీ ఈదురు గాలి వచ్చి ఎండిన చెట్టు ఒకటి కూలి దాని మీద పడింది. నక్క చచ్చింది. నెల్లూరుజిల్లాలో రియల్టర్లకు ఈ నక్కకు అలాంటి పోలికే వుంది.

2004కు ముందు నెల్లూరు జిల్లాలో రియల్‌ఎస్టేట్‌ ఒక వ్యాపారం లాగానే జరిగేది. 2004 నుండి రియల్‌ ఎస్టేట్‌ స్వరూపమే మారిపోయింది. వై.యస్‌. హయాంలో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కొత్తపుంతలు తొక్కడంతో రియల్‌ వ్యాపారం వెర్రితలలు వేసింది. జిల్లా నిండా రియల్టర్లు, మీడియేటర్లు తయార య్యారు. తొండలు గుడ్లు పెట్టని భూములు కూడా లక్షలు, కోట్లకు చేరాయి. 2009లో కృష్ణపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సోనియాగాంధీ వచ్చేదాకా కూడా రియల్‌ వ్యాపారం కళ్లెం లేని గుర్రంలా పరుగులు తీసింది. సోనియా వచ్చి వెళ్లాక రియా ల్టీలో మందకొడితనం మొదలైంది. 2009 సెప్టెంబర్‌లో వై.యస్‌. చనిపోవడం జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. 2014 దాకా కూడా ఈ జిల్లాలో రియల్‌ఎస్టేట్‌ లేవలేదు. 2014లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ జిల్లాలో రియల్టర్లు పండుగ చేసుకుని ఉండేవాళ్లు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో రాజధాని వచ్చుండేది. దాని ప్రభావం ప్రధా నంగా నెల్లూరు మీదే వుండేది కాబట్టి రియల్‌ బూమ్‌ వచ్చుండేది. కాని జగన్‌ కాకుండా చంద్రబాబు సీఎం కావడంతో నెల్లూరు జిల్లా రియల్టర్ల దరిద్రం పరాకాష్టకు చేరింది. గత మూడేళ్లుగా జిల్లాలో రియల్‌ వ్యాపారం అన్నది లేదు. రియల్టర్లు తెచ్చిన అప్పులకు కట్టలేక, వేసిన లే అవుట్లలో ప్లాట్లను అమ్ముకోలేక నానా పాట్లు పడుతూ చావలేక బ్రతకలేకపోతున్న తరుణంలో పెద్దనోట్ల రద్దు ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ చావుదెబ్బ కొట్టాడు. పెద్దనోట్ల రద్దుతో రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా పడుకుంది. ఇక రియల్‌ ఎస్టేట్‌కు భవిష్యత్‌ లేదని గ్రహించిన చాలామంది వ్యాపారులు, ఇతర రంగాలవైపు దృష్టి సారిస్తున్నారు.

ఈ దశలోనే కేంద్రం రియల్‌ఎస్టేట్‌ అథారిటీ బిల్లును తీసుకొచ్చి రియల్టర్ల నెత్తిన వంద పిడుగులను ఒకేసారి వేసింది. ఈ బిల్లుతో రియల్‌ మార్కెట్‌ నుండి చాలామంది రియల్టర్లు ఔట్‌ అయి పోవాల్సిందే! డూప్‌ సరుకంతా పోయి ఒరిజినల్‌ మాత్రమే మిగులుతుంది. కాకపోతే రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌ మొత్తం కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుంది. రైతుల భూముల ధరలను నిర్ణయించే అధికారం సైతం పరోక్షంగా కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లోనే ఉంటుంది. ఇంతకాలం జరిగిన మార్కెట్‌లో పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీ లతో పాటు చిన్నాచితకా రియల్టర్లు కూడా మనుగడ సాగిస్తూ వచ్చారు.

కోటి రూపాయలు చేతిలో వుంటే ఇంకో నాలుగుకోట్లు అప్పు చేయడం, రైతుల నుండి డెవలప్‌మెంట్‌ ప్రక్రియ క్రిందనో, లేదా కొన్ని నెలలు గడువులోగా పూర్తి మొత్తం చెల్లించే విధానంగాగాని భూములను తీసుకుని లే అవుట్లు వేస్తూ ఓ పక్క ప్లాట్లు అమ్ముకుంటూనే మరోపక్క వచ్చిన అడ్వాన్స్‌లతో లేఅవుట్‌ డెవలప్‌ మెంట్‌ చేసుకునేవాళ్లు. ఇంట్లో కోట్లు లేక పోయినా ఒంట్లో శక్తి, తలలో తెలివున్నోళ్లు ఈ ప్రక్రియలో వ్యాపారం చేసుకుంటూ అభివృద్ధి చెందారు. ఇలాంటి చిన్న వ్యాపా రులు అధికంగా ఉండబట్టే రైతుల భూము లకు విపరీతంగా ధరలొచ్చాయి. కాని ఇప్పటి బిల్లు చిన్న వ్యాపారులకు గుది బండగా మారింది. బిల్లులో వున్న నిబంధ నలకు అనుగుణంగా రియల్‌ఎస్టేట్‌లో నిలబడడం చిన్న వ్యాపారులకు సాధ్యం కాదు. కాబట్టి భవిష్యత్‌ రియల్‌మార్కెట్‌ అంతా కూడా పెద్ద కంపెనీలదే!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter