12 May 2017 Written by 

ఢిల్లీ చూపు... ఎవరి వైపు?

modi jag naraఇటీవలే బాలకృష్ణ హీరోగా నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా చూసాం. భారత ఉపఖండంలోని చిన్నచిన్న రాజ్యాలన్నిం టిని జయించి ఒకే పరిపాలన క్రిందకు తేవా లన్న లక్ష్యంతో శాతకర్ణి అన్ని రాజ్యాలను జయిస్తూ పోతుంటాడు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నది కూడా అలాంటి యుద్ధమే! అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ జెండా ఎగురవేయాలని, ఒక్కో రాష్ట్రాన్ని ఆక్ర మించుకుంటూ పోవాలన్నది నరేంద్ర మోడీ పన్నాగం.

ఆయన ఆలోచనలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కాబట్టే ముస్లిం ప్రాబల్యంగల జమ్మూ కాశ్మీర్‌లో మిత్రపక్షం పిడిపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో బీజేపీ సొంతంగా జెండా ఎగురవేయగలిగింది. పెద్దరాష్ట్రమైన యూపీలో పాగా వేసింది. ఒక్కో రాష్ట్రంలో జెండా ఎగురవేయడానికి నరేంద్ర మోడీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఈ పరంపరలోనే ఈసారి మోడీ గ్యాంగ్‌ దక్షిణాది రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో బలపడడం ఆ పార్టీకి మొదటి నుండి సవాల్‌గానే మారింది. ఇక్కడ బీజేపీ బలహీనత అంతా కూడా తెలుగుదేశమే! ఆ పార్టీతో పొత్తే బీజేపీని ఎదగనీయకుండా చేస్తోంది. టీడీపీ నిలవడం కోసం బీజేపీ కూలబడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపిలో టీడీపీని కాపాడేందుకు బీజేపీ భవిష్యత్‌ను, ఇక్కడ బీజేపీ కార్యకర్తల బ్రతుకులను పణంగా పెట్టారని చెప్పవచ్చు.

అయితే ఇకముందు టీడీపీ కోసం తమ పార్టీని బలిపెట్టడానికి బీజేపీ నాయకులు సిద్ధంగా లేరు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రా, తెలంగాణలలో బలపడేందుకు ఈ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసుకు న్నట్లు సమాచారం. ఏపిలో ఎవరితో కలిసి పయ నించాలనేదానిపై త్వరలోనే మోడీ, అమిత్‌షాలు ఒక స్పష్టతకు వచ్చే అవకాశముంది. టీడీపీతో కలిసి ప్రయాణించడం వారికి సుతారం ఇష్టం లేదు. 2014ఎన్నికలప్పుడే ఒంటరిగా పోటీ చేయాలని భావించారు. కాని ప్రజల్లో నరేంద్ర మోడీ క్రేజ్‌ను గుర్తించిన చంద్రబాబు ఆంబానీల స్థాయిలో పైర వీలు సాగించి బీజేపీతో పొత్తు కలిసేలా చేసాడు. ఆ పొత్తు చంద్రబాబుకు అధికారాన్ని తెచ్చిపెట్టింది.

ఇప్పుడు కూడా చంద్రబాబు బీజేపీని వదలా లనుకోవడం లేదు. దేశవ్యాప్తంగా బీజేపీకి అను కూలంగా వస్తున్న ఫలితాలను చూస్తున్నాడు కదా! కాని మోడీ, అమిత్‌షాలు మాత్రం ఇక టీడీపీతో కలిసి ప్రయాణించకూడదని భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు వల్లే 30 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఎదగలేకపోయా మని గుర్తించారు. అదీగాక చంద్రబాబు కంటే కూడా జగన్‌ను నమ్మకమైన నేస్తంగా భావిస్తున్నారు. చంద్రబాబు ఎటు గాలి తోలితే అటు మొగ్గుతాడు. రేపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఫ్రంట్‌ కడితే చంద్రబాబు పోయి వారి ముందు నిల్చున్నా ఆశ్చర్యపోవాల్సిం దేమీ లేదు. అదే జగన్‌ అయితే ఇచ్చిన మాట తప్పడు. నాలుగు పదుల వయసు లోనే ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకు రాలిగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించు కున్న సోనియాగాంధీని ఎదిరించి, ఆమెతో రాజీపడకుండా 16నెలలు జైలులో గడి పిన జగన్‌పై మోడీ, అమిత్‌షాలకు ప్రత్యేక నమ్మకముంది. అందుకే వాళ్లు చంద్ర బాబుతో కంటే జగన్‌ వైపే ఎక్కువగా చూస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా రాష్ట్ర పతి ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయా లలో సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని వైసిపి అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి కలవడం, రాష్ట్రంలో పరిస్థితులను నివేదించడం, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బేషరతుగా మద్దతునిస్తామని ఆయన ప్రకటించడం... రాష్ట్ర రాజకీయాల్లో సరి కొత్త ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయం నుండే జగన్‌కు అపాయింట్‌మెంట్‌ రావడం తెలుగుదేశం నాయకులకు మింగుడు పడడం లేదు. కేసులను మాఫీ చేసుకు నేందుకే జగన్‌ మోడీ వద్ద మోకరిల్లాడని తెలుగుదేశం నాయకులు అప్పుడే తమ అక్కసు వెళ్ళగక్కారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకులే తెలుగుదేశం వాళ్ళకు కౌంటర్‌ సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఎలక్షన్‌లోపే జగన్‌ను జైలుకు పంపిస్తారని ఒక నమ్మకం తెలుగుదేశం నాయకుల్లో ఉండేది. జగన్‌కు మోడీ నుండి వచ్చిన పాజిటివ్‌ రెస్పాన్స్‌తో తెలుగుదేశం నాయకుల కలలు కరిగి పోతున్నాయి. ముఖ్యంగా మోడీ, అమిత్‌ షాల ద్వయం ఏపిని టార్గెట్‌గా పెట్టు కుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని దూరంగా పెట్టి రాష్ట్రంలో పోటీ చేయడానికి సన్నా హాలు చేస్తోంది. అవసరమైతే ఒంటరిగా పోటీ చేయడమా, లేక జాతీయ రాజకీ యాల్లో తమకు ఎప్పుడూ అడ్డుపడని, పడలేని వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో పొత్తు కుదుర్చుకుని ముందుకు సాగడమా? అనే దానిపై కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశముందని విశ్వస నీయ సమాచారం.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…

Newsletter