12 May 2017 Written by 

దుగరాజపట్నం ఎత్తేసినట్లే?

portదాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు దుగరాజపట్నంను ఎంపిక చేయడం తెలిసిందే! రాష్ట్ర విభజన బిల్లులో కూడా ఏపికి ఇచ్చిన హామీలలో దుగరాజపట్నంను పొందుపరిచారు. 2014 ఎలక్షన్‌లకు ముందు తిరుపతి ఎంపిగా వున్న చింతా మోహన్‌ ఈ పోర్టుకు హడావిడిగా శంకు స్థాపన చేయించాలని కూడా చూసారు. అయితే అది సాధ్యం కాలేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ పోర్టుపై మీన మేషాలు లెక్కిస్తూ వచ్చారు. ఈ పోర్టు ఇక్కడ కడితే వచ్చే లాభనష్టాలపై బేరీజు వేశారు. దుగరాజపట్నంకు సమీపంలోనే కృష్ణపట్నం పోర్టుతో పాటు చెన్నైలో రెండు పోర్టులు వుండడం, దీనికితోడు ఇస్రో, పర్యావరణ శాఖ అభ్యంతరాలు ఈ పోర్టుకు అడ్డంకిగా మారాయి. ఈ పోర్టు కట్టినా పెద్దగా ఆదాయం ఉండబోదని నీతిఅయోగ్‌ తేల్చిచెప్పింది. దీనిబదులు ఏపికి మరో రూపంలో ప్రయోజనం కల్పిస్తామని కేంద్రం చెప్పడంతో ఇక దుగరాజపట్నం పోర్టుకు తెరపడినట్లేనని భావించాల్సి వస్తోంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మళ్ళీ చెడింది
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
    ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
  • పని చేసేవాళ్ళు వీళ్ళకు పనికిరారు
    అధికారులు మూడు రకాలుగా వుంటారు. ఒకరు అధికారపార్టీ అడుగు లకు మడుగులొత్తుతుంటారు. వీళ్ళనే బూట్లు నాకేవాళ్ళు అని కూడా అంటుం టారు. ఇంకోరకం... అధికార పార్టీవాళ్లనే ఉచ్చపోయించే వాళ్ళు. వీళ్ళు మహా ముదుర్లు. ఇకపోతే మూడోరకం... చట్ట ప్రకారం, నిబంధన ప్రకారం…

Newsletter