12 May 2017 Written by 

అంతరిక్షంలో స్నేహగీతిక

pslv f09సార్క్‌ దేశాల కోసం ఓ ఉపగ్రహాన్ని పంపాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కోరికను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నెరవేర్చింది. దౌత్య సంబంధాల మెరుగు కోసం మోడీ చేస్తున్న కృషికి తమవంతు సహకారం అందించింది. దక్షిణ ఆసియా దేశాలకు సమాచార, సాంకేతిక రంగాలలో అండగా నిలిచేందుకు భారత్‌ కానుకగా ఇచ్చిన 'సాస్‌' ఉపగ్రహ ప్రయోగం విజయవంతమై అంతరిక్షంలో సరికొత్త స్నేహగీతికను ఆవిష్కరించింది.

ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4.57గంటలకు నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌ సెంటర్‌) రెండో లాంచ్‌ ప్యాడ్‌ నుండి ప్రయోగించిన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌09 విజయ వంతమైంది. 18 నిముషాలలోనే ప్రయోగం పూర్తయ్యి జిశాట్‌-9 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్థాన్‌, బూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, మాల్దీవులకు ఈ ఉపగ్రహం ద్వారా కమ్యూనికేషన్‌ టెలిఎడ్యుకేషన్‌, టెలిమెడిసిన్‌, డిటిహెచ్‌ వంటి సేవలు అందుతాయి. ప్రకృతి విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆయా దేశాలకు చేరవేస్తుంది. ఈ ఉపగ్రహంలో 12కెయూబాండ్‌ ట్రాన్స్‌పాండర్‌లను ఏర్పాటు చేయగా ఒక్కో దేశం ఒక్కో ట్రాన్స్‌పాండర్‌ను ఉపయోగించుకోనుంది. 350కోట్ల ఖర్చుతో ప్రయోగించిన ఈ ఉపగ్రహం 12ఏళ్ల పాటు సార్క్‌ దేశాలకు సేవలందించనుంది.

దక్షిణ ఆసియాలో మిగిలిన ఏ దేశానికి సొంతంగా ఉపగ్రహాలను పంపే సామర్ధ్యం లేదు. ప్రధానిగా తన ప్రమాణస్వీకారానికి సార్క్‌ దేశాల అధినేతలను ఆహ్వానించిన మోడీ, ఆ తర్వాత వారి కోసం ఉపగ్రహ సేవలను కానుకగా అందించాలనుకున్నారు. పాకిస్థాన్‌ మాత్రం తమ దేశ రహస్యాలు భారత్‌కు తెలిసిపోతాయని భయపడి ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోగా మిగిలిన ఏడు దేశాలు భారత్‌ స్నేహపూరిత కానుకను అందు కోవడానికి సిద్ధపడ్డాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter