Friday, 12 May 2017 12:08

బాబు విజన్‌కు ట్రంప్‌ బేజారు!

Written by 
Rate this item
(0 votes)

galpikaప్రపంచంలోని మేటి నగరాలన్నిం టిని రోటిలో వేసి రుబ్బి బయటకు తీస్తే వచ్చిన అమరావతి రాజధాని నగర మది. హైటెక్‌రత్న చంద్రబాబు బృందం అమెరికా పర్యటనకు బయల్దేరబోతుంది. భువనేశ్వరీదేవి, నారా లోకేష్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌లు బాబు టీంకు మంగళహారతి ఇచ్చి వీడ్కోలు పలకసాగారు. తన తండ్రితో లోకేష్‌ వుండి... నాన్నారు, క్షేమంగా వెళ్ళి భారీ పెట్టుబడులతో లాభంగా రండి అని విషెస్‌ చెప్పాడు. అందుకు చంద్రబాబు... నాయనా, నేను క్షేమంగా వెళ్ళి మనశ్శాంతిగా రావాలంటే నువ్వొక వ్రతం చేయాలని చెప్పాడు. వెంటనే లోకేష్‌... ఉపవాసాలు వంటివి కాకుండా ఇంకే వ్రతమైనా చెప్పండి నాన్నగారు, చేస్తానన్నాడు. నేను అమెరికా నుండి తిరిగొచ్చే వరకు మౌనవ్రతం పాటించు నాయనా, నేను అమెరికా నుండి ప్రశాంతంగా, మనశ్శాంతితో తిరిగొస్తాను అని కోరాడు. అది విన్న కేంద్రమంత్రి సుజనాచౌదరి... అదేంటి సార్‌, చినబాబు మౌనవ్రతం పాటిస్తే ఎలా? మీరొచ్చే దాకా చినబాబే కదా అన్నీ చూసుకోవా ల్సిందని అడిగాడు. అందుకు చంద్ర బాబు... చిన్నబాబు ఏమీ చూసుకోలేక పోయినా ఫర్వాలేదు. కాని నేను లేన ప్పుడు ఎవరికి జయంతిని చేస్తాడో, ఎవరికి వర్ధంతి శుభాకాంక్షలు చెప్తాడో తెలియక అనుక్షణం టెన్షన్‌ పడుతుం టాను. మనిషిని అమెరికాలో వున్నా మనసు ఇక్కడే వుంటుంది. లోకేష్‌ నేనొచ్చే దాకా మౌనవ్రతం పాటించాడనుకో... ఏ చింతా లేకుండా అమెరికా పర్యటన పూర్తి చేసుకోగలనన్నాడు. మీ లాజిక్‌ బాగుంది సార్‌... యుక్తికి భక్తికి ముడి పెట్టి కొట్టారు అని సుజనా కితాబిచ్చాడు. అంతలో సేద్యం శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్కడకు వచ్చాడు. చంద్రబాబు టీమ్‌కు విదేశీ యాన శుభా కాంక్షలు చెప్పి... అక్కడేవున్న లోకేష్‌తో... చిన్నబాబు గారు, బాగున్నారా అని పలుకరించాడు. వెంటనే లోకేష్‌... నేను మౌనవ్రతం పాటిస్తున్నానండి... ఎవరి తోనూ మాట్లాడకూడదన్నాడు. అది విని చంద్రబాబు జుట్టు పీక్కుని, ఇక అక్కడ ఆగకుండా ఎయిర్‌పోర్టుకు బయలు దేరాడు.

--------------

వాషింగ్టన్‌లో జాన్‌కెనడీ ఎయిర్‌పోర్ట్‌. చంద్రబాబు టీం స్పెషల్‌ ఫ్లైట్‌ అప్పుడే ల్యాండయ్యింది. విమానం దిగి ఎయిర్‌ పోర్టు ప్రాంగణంలోకి వచ్చిన చంద్ర బాబుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు, మాజీఅధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌క్లింటన్‌ దంపతు లతో పాటు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌, సిఇఓ సత్య నాదెండ్ల, గూగుల్‌ సిఇఓ సుందర్‌ పిచాయ్‌లు ఘనస్వాగతం పలికారు. బిల్‌గేట్స్‌ వుండి ట్రంప్‌తో... సార్‌, చంద్రబాబు గారి దయవల్లే నేను మైక్రోసాఫ్ట్‌ కంపెనీని పెట్టగలిగాను, కంప్యూటర్‌ల వ్యాపారం చేసుకో, బాగా డెవలప్‌మెంట్‌ అవుతావు అని నాకు సలహా ఇచ్చింది ఆయనే అని చెప్పాడు. వెంటనే సత్య నాదెండ్ల కూడా... సార్‌ నాకు మైక్రోసాఫ్ట్‌ సిఇఓగా ఉద్యోగం ఇప్పించింది కూడా చంద్రబాబుగారే అని ట్రంప్‌తో అన్నాడు. అక్కడేవున్న సుందర్‌ పిచాయ్‌ నేనేం తక్కువ తిన్నానా.. అన్నట్లు... సార్‌, నేను చిన్నప్పటి నుండి చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుని చదివాను, కాబట్టే గూగుల్‌ సిఇఓని కాగలిగానన్నాడు. అప్పటిదాకా అందరూ చెప్పింది ఓపిగ్గా వున్న ట్రంప్‌ ఇక

ఉండబట్టలేక... పిచ్చోళ్ళారా... అసలు నేను అమెరికా అధ్యక్షుడినయ్యిందే చంద్రబాబు గారి దయవల్ల అని చెప్పాడు. ఆ మాటకు అమెరికావాళ్లే కాదు, ఆంధ్రా నుండి వచ్చిన నాయకులు కళ్ళు కూడా గిర్రున తిరిగాయి. చంద్రబాబుకైతే ఒక్క నిముషం ఏమీ అర్ధం కాలేదు. మనసులో మాత్రం ఈ విషయం నాకు ముందే తెలుసుండుంటే ప్రతి సభలోనూ డప్పు కొట్టుకుని ఉండేవాడిని కదా అని అనుకున్నాడు. మీరు అధ్యక్షుడు కావడానికి చంద్రబాబుకు సంబంధమేంటని బిల్‌ క్లింటన్‌ అడిగాడు. దానికి ట్రంప్‌... 2014లో ఆయన ఎలక్షన్‌ చేసిన విధా నాన్ని నేను అబ్జర్వ్‌ చేసాను. ఆచరణ సాధ్యం కాని ఋణమాఫీ, నిరుద్యోగ భృతి, కోటి ఉద్యోగాలు వంటి హామీలిచ్చి ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి ఆయన గెలవగాలేనిది, ఆచరణలో సాధ్యమయ్యే హామీలిచ్చి నేను గెలవలేనా అనిపిం చింది. ఆయన ఉద్యోగాలిస్తానన్నాడు, నేను భారతీయులను ఉద్యోగాల నుండి తీసేసి మా దేశపువాళ్లకు ఇస్తానని హామీ ఇచ్చాను. అంతే.. అమెరికన్లందరూ నాకు అండగా నిలిచారని చెప్పాడు. అది విన్న సత్య నాదెండ్ల... మా చంద్రబాబు దెబ్బకు మీకు అధ్యక్ష ఉద్యోగం వచ్చి మా వాళ్ళ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలన్నీ పోయా యన్న మాట అని మనసులో అనుకు న్నాడు. అక్కడ పలకరింపులు అయిపో యాక అందరూ వైట్‌హౌస్‌కు బయలు దేరారు. చంద్రబాబుతో పాటు ట్రంప్‌, ఒబామా, బిల్‌క్లింటన్‌లు ఒకే కారులో కూర్చున్నారు. దారిలో పోతుండగా వీరికి లిబర్టీ ఆఫ్‌ స్టాచ్యూ కనిపించింది. చంద్ర బాబుకు ట్రంప్‌ దానిని చూపిస్తూ... ఇది ప్రపంచ వింతల్లో ఒకటి అని చెప్పాడు. దానికి చంద్రబాబు... విగ్రహాలు కూడా ఒక వింతేనా? ఇలాంటివే మా రాష్ట్రంలో వీధికొకటి లెక్కన వై.యస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహాలు ఉన్నాయన్నాడు. ఆ మాటకు ట్రంప్‌ ముఖం చిన్నబోయింది. ఇట్లా కాదనుకుని కారును నేరుగా నయాగారా జలపాతం దగ్గరకు పోనిచ్చాడు. నయా గారా జలపాతం చూపిస్తూ... ఇలాంటి జలపాతం ప్రపంచంలో ఎక్కడా ఉండ దని ట్రంప్‌ చెప్పాడు. వెంటనే చంద్ర బాబు... మీకు నయాగారా జలపాతం ఒక్కటే... భారీ వర్షాలు, వరదల సమ యంలో మా రాష్ట్రానికి వచ్చి చూడు... చెరువులు, కాలువలు తెగి ఊరికొక నయాగారా జలపాతం ఉంటుందని అన్నాడు. ఇక్కడా ట్రంప్‌కు తల కొట్టేసి నట్లయ్యింది. నాకే తిక్క అనుకుంటే ఇతనికి నన్ను మించిన తిక్కుంది. ఇతనికి ఇలా కాదు అనుకుంటూ కారును నేరుగా లాడెన్‌ విమానాలతో నేల కూల్చిన డబ్ల్యూటిసి భవనాల ప్రాంతానికి తీసు కెళ్లాడు. అక్కడ 26/11 మృతులకు అందరూ నివాళులర్పించారు. తర్వాత ట్రంప్‌ వుండి... లాడెన్‌ రెండు విమానా లతో ఇక్కడ భవనాలను కూల్చేసాడని చెప్పాడు. దానికి చంద్రబాబు స్పం దిస్తూ... మేం ఉగ్రవాదులకు అలాంటి అవకాశాలివ్వం, విమానాలతో కూల్చేంత పటిష్టంగా మేం భవనాలు కట్టం. ఎందు కంటే అక్కడ విమానాలను కూడా నష్ట పోవాల్సి వస్తుంది. అందుకే ప్రొక్లెన్‌ బకెట్‌తో ఒక దెబ్బ కొడితే కూలిపోయేంత నాణ్యతగా భవనాలు కడతామన్నాడు. చంద్రబాబు ప్రతి దానికి కౌంటర్‌ అటాక్‌ చేస్తుండడంతో ట్రంప్‌కు చిర్రెత్తింది. ఈ బాబుకు అమెరికా గొప్పతనాన్ని ఎక్కడో చోట అర్ధమయేర్యలా చెప్పాలి... అమెరికా గ్రేట్‌... అని అతని నోటి నుండే అనిపించాలని మనసులో అనుకుంటూ అక్కడ నుండి వైట్‌హౌస్‌కు బయల్దేరారు.

(ఇంకా వుంది)

Read 111 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter