12 May 2017 Written by 

12-05-2017 రాశిఫలాలు

rasi 12

1Ariesమేషం

ఉద్యోగ ప్రయత్నాలు వెనుకబడతాయి. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యోగులు పని చేయాలి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. కొన్ని ముఖ్యవిషయాలు ఎవరితోనూ అనవద్దు. అనుకోని ప్రయాణాలు, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. ఆర్ధిక వ్యవహారాల నిర్వ హణలో జాగ్రత్త పడండి.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు కార్యసామర్ధ్యంతో పాటు పని వత్తిడి ఉంటుంది. విలువైన వస్తువులను పదిలపర్చుకొనండి. పెట్టుబడులకు కొత్త అవకాశాలుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ఒక ముఖ్యకార్యం మీద శ్రద్ధ చూపుతారు. కోర్టు వ్యవహారాలందు అనుకూలత కలదు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో వ్యాప్తి బాగుండి ఆదాయం పెరుగుతుంది.

 

3Geminiమిధునం

విలువైన వస్తువులు సమకూరటం, దూరప్రయాణా లుంటాయి. బిడ్డల వివాహ విద్యా విషయాలపై శ్రద్ధ పెడతారు. అధికారులకు మంచి గుర్తింపు గౌరవాలుం టాయి. ఆరోగ్యం, విద్యాప్రగతి బాగుంటుంది. ఆర్ధిక ఇబ్బందులు, వ్యవహారంలో ఇబ్బందులు సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారాలు విస్తృతం మరియు ఆదాయ వృద్ధి కలదు. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరగవచ్చు.

 

4Cancerకర్కాటకం

ఒక మంచి పనికి సంసిద్ధులై కృషి చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. విద్యార్థులు మంచి కృషి చేస్తారు. స్థిరాస్తుల లావాదేవీలు జరుగుతాయి. కొత్త ఆర్ధి కావకాశాలు త్వరలో లభించగలవు. ఆరోగ్యం ఫరవా లేదు. వ్యవహారాలలో తొందరపాటు ప్రదర్శించకండి. ఇబ్బందికరమగు పరిస్థితులు క్రమంగా చక్కబడగలవు.

 

5Leoసింహం

వస్తు, వాహన, ఇంటి రిపేర్ల ఖర్చులు అదనం. విద్యా ప్రగతి బాగుంటుంది. అనుకున్న పనులు టెన్షన్‌తో సాగుతాయి. నష్టాలను ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొం టారు. సభలు సమావేశాలలో మీదే కీలకపాత్ర వుం టుంది. ముఖ్యనోటీసులు అందుకుంటారు. పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి క్రమంగా బాగుంటుంది. ఖర్చులు అదుపు చేయాలి.

 

6Virgoకన్య

ఇతరులను అతిగా నమ్మవద్దు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం, కోర్టు కేసులు వాయిదాపడటం, బంధు ముఖ్యు లలో ఒకరికి అనారోగ్య బాధలుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు తమ అధికారుల తోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. చేయదలచిన పనులందు పొరపాట్లు రాకుండా చూచుకొనాలి.

 

7Libraతుల

విద్యార్థులు చదువుపై బాగా దృష్టి పెట్టాలి. బిడ్డల విద్యా ఉద్యోగ శుభకార్య విషయాలు ఆందోళన కలిగి స్తాయి. అనుకున్న పనులు జరుపుకొనడానికి శ్రమ పడాల్సి వస్తుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా పడతాయి. ఉద్యోగులు ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుం టుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

 

8Scorpioవృశ్చికం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. దూర ప్రయాణా లుంటాయి. సన్నిహితులే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కొత్త వస్తువులు ఇంటికి సమకూరుతాయి. విద్యా ప్రగతి, ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులకు సహాయ పడతారు. బంధుత్వ స్నేహాలు బలపడతాయి. వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు అవకాశాలు బాగుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరిగి వృద్ధి కలదు.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత, బంధు మిత్ర వర్గంతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త పెట్టు బడులు, స్థిరాస్తుల లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సౌఖ్యం, ప్రముఖులతో పరిచయాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుట, మంచి ఆర్ధికాభివృద్ధి అవకాశాలు లభించడం జరుగుతుంది. తొందరపాటు మాటలు, ప్రవర్తన లేకుండా జాగ్రత్తపడండి.

 

10Capricornమకరం

వ్యవహారాలలో మీకు మంచి విలువ వుంటుంది. కొద్దిపాటి అనారోగ్య బాధలుంటాయి. ఉద్యోగులు ఇత రులతో జాగ్రత్తగా మెలగండి. వ్యాపారులకు, ఉద్యో గులకు అధికారుల వత్తిడి ఉంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. కుటుంబంలో కొంత అనుకూలత లేకున్నా సర్ధుబాటు చేసికొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలదు.

 

11Aquariusకుంభం

శుభకార్య నిర్ణయాలు జరుగుతాయి. ఇతరుల పనుల మీద ప్రయాణాలుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కాంట్రాక్టు పనులు, గృహ నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. అనవసర ఖర్చులు తప్పవు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు జరుగవచ్చును.

 

12Piscesమీనం

ఉద్యోగులు తమ అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగాలి. శుభకార్యాలలో పాల్గొంటారు. అదనపు ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. ఆహ్వానాలు నోటీసులు అందుకుంటారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. విద్యాప్రగతి బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. పనులు సక్రమంగా సానుకూలంగా జరుగు తాయి. మంచి ఆర్ధికావకాశాలు చేజారిపోవచ్చును.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter