19 May 2017 Written by 

సైబర్‌ భద్రత ఏదీ?...

vannacryసైబర్‌ నేరగాళ్ళ ఆగడాలకు అంతే వుండడం లేదు. ప్రపంచాన్నే కళ్ళముందు నిలిపే ఇంటర్నెట్‌కీ వాళ్ళవల్ల ముప్పు తప్పడం లేదు. అంతర్జాలాన్ని సకల మానవాళి ప్రయోజనం కోసం ఉపయోగించు కోవాల్సిన తరుణంలో, కంప్యూటర్లలోని సమాచారాన్ని తస్కరించి తద్వారా ఆర్ధికపరమైన ప్రయోజనం పొందాలని చూసే దుండగుల నేరప్రవృత్తి సహించరానిది. అనేకదేశాల్లోని ప్రజోపయోగమైన సంస్థలకు కూడా కష్టాలు పెట్టేందుకు వెనుకాడని అలాంటి ముష్కరులను ఏమనాలి?.. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ సైబర్‌ దాడులను ఉపేక్షిస్తూపోతే చివరికి ప్రపంచం ఏమవుతుందో?.. మొన్నటికి మొన్న సైబర్‌ దుండగులు చేసిన దాడులు ప్రపంచ మేధావులనే కలవరపరుస్తోంది.

సైబర్‌ నేరగాళ్ళు ప్రపంచంపై విరుచుకుపడి దాదాపు నూరు దేశాల్లో కీలకమైన వ్యవస్థలపై దాడులు చేశారు. వన్నాక్రై సైబర్‌ దాడితో అనేకదేశాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమై వున్న సమాచారాన్ని హ్యాక్‌ చేయడంతో అన్ని వ్యవస్థలూ పెను ప్రమాదానికి గురయ్యాయి. సుమారు రెండు లక్షల విండోస్‌ కంప్యూటర్లను లాక్‌ చేసి, మూడు వందల డాలర్లు ఇస్తారా?. లేదా వెంటనే మీ పీసీల్లోని సర్వర్లలో వున్న సమాచారాన్ని మొత్తం డిలీట్‌ చేసేయమంటారా?.. అంటూ ఆ సైబర్‌ దుండగులు బెదిరింపులకు పాల్ప డడం ఎంత దారుణం?.. ఈ ఘటనతో ప్రపంచమే అవాక్కయిపోయిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో వూహించుకోవచ్చు. మొదట బ్రిటన్‌తో మొదలైన ఈ దాడి శరవేగంగా నూరు దేశాలకు వెంటవెంటనే విస్తరించింది. ఈ దాడితో బ్రిటన్‌లో అల్లకల్లోలమైపోయింది. అక్కడి ఆసు పత్రులన్నీ తమ కంప్యూటర్లపై పట్టుకోల్పోవడంతో రోగుల సమాచారం తెలియక అందరూ బెంబేలెత్తిపోయారు. ఎవరికి చికిత్సలు అందించాలో తెలియని గందరగోళం ఏర్పడింది. ప్రపంచం మొత్తం ఇంటర్‌ నెట్‌కు కనెక్టై వున్న కంప్యూటర్లలో ప్రతి మూడింటి లోనూ ఒకటి ఈ దుర్మార్గమైన సైబర్‌ దాడులకు గురైందని ఆ తర్వాత గుర్తించారు. ఒక్కమాటలో చెప్పాలంటే మానవుడి వికృత ప్రవృత్తికి ఇది నిదర్శనం. అయితే, ఈ దాడులు ఎవరు చేశారన్నది మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదు. 'వాన్నాక్రై, వాన్నా క్రిప్ట్‌ అనే రాన్‌సమ్‌ వేర్‌తో ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. ఈ దాడి ప్రభావంతో అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, మెక్సికో, భారత్‌ తదితరత దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లు లాక్‌ అయిపోయాయి. భారత్‌లో పోలీసు వ్యవస్థకు సంబంధించిన అనేక కంప్యూటర్లపై కూడా ఈ ప్రభావం పడడంతో అంతా అయోమయమే. అయితే, భారత్‌పై ఈ దాడులు పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ బ్యాంకింగ్‌ వ్యవస్థ, ప్రత్యేకించి ఏటిఎం వ్యవస్థ అస్తవ్యస్థమైంది.

ఈ సైబర్‌ దుండగుల దాడులతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లు హ్యాకింగ్‌ అయిపోయి వాటిలోని విలువైన సమాచారాన్ని దుండగులు గుప్పిట పట్టుకున్నారు. వారడిగిన డబ్బుని బిట్‌కాయిన్ల రూపంలో చెల్లిస్తే తప్ప తిరిగి కంప్యూటర్లు పనిచేయవని హెచ్చరించారు. ఎంత బరితెగింపు?... ఒకవేళ ఏదైనా విలువైన సమాచారం పొరపాటున పక్కదారి మళ్ళితే జరిగే ప్రమాదం అంతా ఇంతా కాదు. శత్రుదేశాలకో, ఉగ్రవాదులకో ఆ రహస్య సమాచారాలు తెలిస్తే జరిగే భీభత్సాలు అన్నిన్ని కావు. అందువల్ల సైబర్‌దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. ఈ హ్యాకింగ్‌ల వల్ల బ్రిటన్‌లో ఆరోగ్యవ్యవస్థ దెబ్బతినిపోయింది. శస్త్ర చికిత్సలు నిలచిపోయి రోగులు విలవిలలాడిపోయారు. జర్మనీలో రైల్వే వ్యవస్థ కుదేలైపోయింది. వైమానిక వ్యవస్థ తలక్రిందులైంది. అనేక దేశాల్లో ఐటి రంగం, టెలికమ్యూనికేషన్ల రంగం, విద్యుత్‌ రంగం అన్నీ అస్తవ్యస్తమైపోయాయి. అనేక దేశాల్లోని బ్యాంకులు, ప్రముఖ సంస్థలు, ప్రజోపయోగసంస్థలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యాయంటే పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందో వూహించు కోవచ్చు. కంప్యూటర్‌ ఆన్‌ చేయగానే ఫైళ్ళు ఓపన్‌ కాక, ఈ సైబర్‌ నేరగాళ్ళ హెచ్చరిక మాత్రమే కన్పిస్తుండడంతో అందరూ అయోమయానికి గురయ్యారు. అయితే, ఎంతో అదృష్టం. బ్రిటన్‌లోని ఓ ఇరవైరెండేళ్ళ యువకుడైన సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు యాదృచ్చికంగా రాన్సమ్‌వేర్‌ కిల్లర్‌స్విచ్‌ను నొక్క డంతో దాదాపు 99 దేశాలను ఈ వన్నాక్త్రై వైరస్‌ నుంచి కాపాడినట్లయింది. అయినా, ఈ సైబర్‌ దాడులు ఈనాటివేమీ కాదు. కంప్యూ టర్లను హ్యాక్‌ చేయడం, సమాచారం దొంగిలించడం, ఏదో ఒక పేరుతో లింక్‌లు ఇవ్వడం, వాటిని క్లిక్‌ చేయడంతో ప్రమాద కరమైన వైరస్‌ కంప్యూటర్లలోకి వచ్చి, అక్కడున్న సమాచారమంతా మటుమాయం కావడం..ఇలాంటివి సర్వసాధారణమైపోతున్నాయి. సైబర్‌ భద్రత గాలిలో దీపం కావడం దారుణం.. దయనీయం. సైబర్‌ దాడు లను తక్షణం అరికట్టాలి. దుండగులను కఠినంగా శిక్షించాలి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వన్నాక్త్రై సైబర్‌ దాడుల వెనుక ఏ అదృశ్యహస్తాలున్నాయో బట్టబయలు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి సైబర్‌ దాడులకు తావు లేకుండా ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సాంకేతిక వ్యవస్థను కట్టుదిట్టం చేయాలి. అందుకు అంతర్జాతీయ స్థాయిలో అన్నిదేశాలు కలసి వెంటనే ఒక సమిష్టి కార్యాచరణను చేపట్టాలి. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వంటివి నేటి అధునాతన మానవుని విజ్ఞానానికి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని ప్రపంచం భావిస్తున్న తరుణంలో, వాటిని మానవ వికాసానికి కాక విధ్వంసానికి, మానవుని కష్టాలు పాలుచేయడానికి కొందరు దుండగులు ఉపయోగించాలని చూడడం రాక్షస నైజం. ఈ దాడులను, అనర్ధాలను వెంటనే అరికట్టకపోతే ఎంతో ప్రమాదం. వికాసానికి బదులు వినాశాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. సైబర్‌ విజ్ఞానాన్ని మానవాళికి అందించడంతో పాటు, దానికి తక్షణం కట్టుదిట్టమైన రక్షణ కూడా కల్పించాలి. తద్వారా మేధావులు మానవజాతికి మహోపకారం చేయాలి. వెంటనే సైబర్‌ దుండగుల ఆటలు కట్టించాలి. శాస్త్రవిజ్ఞానాన్ని మానవాళి ప్రయోజనాలకు

ఉపయోగించాలే తప్ప, వినాశానికి కాదని ప్రపంచ మేధావులంతా కలసి సగర్వంగా చాటిచెప్పాలి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ముగ్గురు మొనగాళ్లు
    ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • 'పీకే'దేమీ లేదు
    జగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు,…

Newsletter