మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ తేదీ ఏకంగా 45డిగ్రీలు నమోదైంది. 16వ తేదీ 44.5డిగ్రీలు నమోదైంది. ఇంత తీవ్రంగా కాస్తున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల దాకా జనం ఇంటి నుండి బయటకొచ్చే పరిస్థితులు లేవు. 5గంటల తర్వాత బయట కొచ్చినా నిప్పుల కుంపటిలో అడుగుపెట్టినట్లుగానే వుంటోంది. ఎండల దెబ్బకు మిట్టమధ్యాహ్నం వేళ నెల్లూరు రోడ్లు కర్ఫ్యూ విధించా రన్నట్లుగా నిర్మానుష్యంగా మారుతున్నాయి.
Published in
సింహపురి సమాచారం
Tagged under
