26 May 2017 Written by 

గాడిలో పడ్డ జగన్‌

jaganకత్తి మొనతేలేదైనా, వజ్రం మెరిసేదైనా మెరుగుపడితేనే! తల్లి గర్భంలోనే అన్నీ నేర్చుకోవడానికి అందరూ అభిమన్యులు కాదు, అందరికీ శ్రీకృష్ణుడు లాంటి మేనమామలు ఉండరు. ప్రతి వ్యక్తికి కూడా అనుభవమే జీవితసారాన్ని బోధిస్తుంది. భవిష్యత్‌ మార్గాన్ని సూచిస్తుంది. ఏ రంగంలోనైనా ముందు కష్టపడడం, ఆ తర్వాత ఫలితాన్ని ఆశించడం అన్నది ప్రాథమిక సూత్రం కావాలి.

ముఖ్యంగా రాజకీయాల్లో కష్టపడకుండా పదవులు పొందేవాళ్ళు నాయకులు కాదు. కష్టపడకుండానే సీఎం కుర్చీ దక్కడానికి అందరు నాయకులకూ ఎన్టీఆర్‌ లాంటి మామలు దొరకరు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం కాకుండా వైసిపియే అధికారంలోకి వచ్చుంటే పరిస్థితి ఏంటి? ఆ గెలుపు వై.యస్‌దేగాని జగన్‌ది కాదు. ఎందుకంటే అప్పటికి జగన్‌ రాజకీయాలలో ఎల్‌కెజి మాత్రమే చదువుతున్నాడు. వై.యస్‌. బొమ్మను చూసి, ఆయన చేసిన మంచి పనులను చూసే ప్రజలు ఓట్లేసారనే పేరుండేది. తండ్రి పేరు చెప్పుకుని సీఎం కుర్చీ ఎక్కాడన్న పేరు జగన్‌కు జీవితాంతం ఉండిపోయేది. అదీగాక అప్పుడే అధికారంలోకి వచ్చుంటే తాను చేసిందే రైట్‌ అనుకునే మూర్ఖత్వం స్థాయి అతనిలో ఇంకొంచెం పెరిగివుండేది. తెలిసీ తెలియని తప్పులు చేసి రాజకీయాల్లో గబ్బు పట్టుండేవాడు.

రాజశేఖరరెడ్డి కూడా 30ఏళ్లు నిత్యం పోరాడబట్టే ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల నాడినిబట్టి పని చేయగలిగాడు. ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పరిపాలన చేసాడు. జగన్‌కు 2014లో ప్రతిపక్ష నేతగా అలాంటి అపూర్వ అవకాశమే వచ్చింది. 2014లో ముఖ్యమంత్రి కుర్చీ కంటే ప్రతిపక్ష నేత బాధ్యత రావడమే ఆయన రాజకీయ జీవితంలో మేలిమలుపు. ఈ మూడేళ్లలో ప్రతిపక్ష నేతగా సమర్ధవంతంగా రాణించగలిగాడు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను అసెంబ్లీ లోపల, బయటా ఎండగట్టడంలో విజయం సాధించాడు. రాష్ట్రంలో ఓ పక్క ఎల్లో మీడియాను, ఇంకోపక్క ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటూనే ఇంకోపక్క తన పార్టీ కేడర్‌లో ధైర్యం నింపుతున్నాడు. 2014 ఎన్నికలలో తాను చేసిన పొరపాట్లను పునఃసమీక్షించుకుంటూ, వాటిని పురావృతం కానీయడం లేదు. వైసిపిలోకి వస్తామంటున్న కాంగ్రెస్‌ సీనియర్లను ఆహ్వానిస్తున్నాడు. సీనియార్టీని బట్టి ప్రాధాన్యతినిస్తున్నాడు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నాడు. అందరితో మంచి, చెడ్డా పార్టీ పరిస్థితులపై చర్చిస్తున్నాడు. గతానికంటే భిన్నంగా తమకు దగ్గరగా వ్యవహరిస్తున్న జగన్‌ను చూసి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆనందిస్తున్నారు. వచ్చే ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోగలమనే నమ్మకంతో వున్నారు. ముఖ్యంగా ఢిల్లీ పరిణామాలు కూడా ఆ పార్టీలో ఉత్సాహవంతమైన వాతావరణాన్ని ఏర్పరచాయి. ఇంతకాలం చంద్రబాబుకే ఢిల్లీలో లాబీయింగ్‌ వుండేది. జగన్‌పై కాంగ్రెస్‌ కక్షకట్టి ఉండడం, మిగతా నాయకులతో సంబంధాలు లేకపోవడం జగన్‌కు లోటుగా అనిపించేది. విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించాక ఆ లోటు తీరింది. జగన్‌ తరపున ఢిల్లీలో లాబీయింగ్‌ చేయడంలో, ఏపిలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకుపోవడంలో విజయసాయిరెడ్డి సఫలమయ్యాడు. ఢిల్లీలో పట్టుదొరకడంతో రాష్ట్ర రాజకీయాల్లో జగన్‌ ఇక సరైన ట్రాక్‌లో పయనించబోతున్నాడు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter