09 June 2017 Written by 

ఇఫ్కో అక్రమ భూములను స్వాధీనం చేసుకోవాలి

iffcoఇఫ్కో కిసాన్‌సెజ్‌ అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకున్న 596 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని కోరారు. వివాదాలేమీలేని ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో జిల్లా కలెక్టర్‌ సాగదీత ధోరణితో వ్యవహరిస్తు న్నారని వారు ఫిర్యాదు చేశారు. రాచర్ల పాడు చెరువును ఇఫ్కో చెర నుంచి విడి పించి రైతులకు అప్పగించాలని వారు కోరారు. కిసాన్‌సెజ్‌ కోసం 1986లో 2,778.23 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌, దేవాదాయశాఖ భూములను కావలి ఆర్డీవో ఇఫ్కోకు అప్పగించారని వారు చెప్పారు. ఇవికాకుండా వివిధ సర్వేనెంబర్లకు సంబంధించిన 596ఎకరాల భూమిని ఇఫ్కో ఛైర్మెన్‌, ఇఫ్కో పేర్లతో వారి ఆధీ నంలో ఉంచుకున్నారని ఫిర్యాదు చేశారు. వారికి ఈ భూములు ఏ రకంగా వచ్చా యనే వివరాలు కూడా రెవెన్యూ రికార్డుల్లో లేవని, రూ.500కోట్లకు పైగా విలువచేసే ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా అధికారులను అనేకసార్లు కోరినా ఫలితం లేదన్నారు. కిసాన్‌సెజ్‌ భూములపై హైకోర్టు స్టే ఉన్నా, గమేసా కంపెనీ సెజ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది కాలుష్య కారక రసాయనాలను ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. జిల్లా యంత్రాంగం ఆ ఫ్యాక్టరీని తనిఖీ చేసి ఫ్యాక్టరీని మూయించి వేసేలా ఆదేశాలివ్వాలని మంత్రిని కోరారు. ఈ పరిశ్రమ రెండో యూనిట్‌కు రాచర్లపాడు పంచాయతీ అనుమతి నిరాకరించిం దన్నారు. అయితే కలెక్టర్‌ కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలి పారు. రాచర్లపాడు చెరువులో ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులు చేస్తుంటే ఇఫ్కో అధికారులు అడ్డుకుని క్రిమినల్‌ కేసులు పెట్టారని తెలిపారు. జడ్పీటీసీ శ్రీధర్‌రెడ్డి, ఊచగుంటపాలెం సర్పంచ్‌ శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు బెజవాడ గోవిందరెడ్డి, అక్కుల్‌ రెడ్డి, ప్రభాకర్‌నాయుడు మంత్రిని కలిసిన వారిలో వున్నారు. ఈ ఫిర్యాదు మీద కలెక్టర్‌తో చర్చించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
    జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
  • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
    దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
  • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
    రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter