09 June 2017 Written by 

జయహో..ఇస్రో

gslv takeoffభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. జిఎస్‌ఎల్‌వి మార్క్‌ 3 డీ-1 జీశాట్‌-19 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి అంతరిక్షంలో భారత కీర్తిని రెపరెపలాడించింది. ఈ విజయం భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే ఒక అద్భుతం. ఇస్రో చరిత్రలోనే ఇదొక సరికొత్త అధ్యాయం. భారత శాస్త్రవేత్తల నిరంతర కృషికి..వారి దృఢదీక్షకు, అసమాన ప్రతిభకు ఇదొక తిరుగులేని నిదర్శనం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి రాకెట్లను రూపొందించి రోదసిలోకి విజయవంతంగా పంపిన ఇస్రో.. ఇప్పుడు అత్యధిక బరువు వుండే రాకెట్లను సైతం అవలీలగా అంతరిక్షంలోకి పంపడంలో తన సత్తాను నిరూపించుకుంది. ఇది భారత జాతికంతటికీ గర్వకారణం. ఈ విజయంతో భారత్‌ కీర్తి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది.

ఇటీవల ఒకేసారి నింగిలోకి 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపి ప్రపంచరికార్డు సాధించిన ఇస్రో..మళ్ళీ కేవలం నాలుగు నెలల్లోపే రోదసిలోకి అత్యంత భారీ ప్రయోగం నిర్వహించి విజయం సాధించింది.. భూ చలన వేగానికి ధీటుగా సంచలించే జియో సింక్రనస్‌ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక (జిఎస్‌ఎల్‌వి) మార్క్‌ 3-డి 1 జీశాట్‌ 19 సమాచార ఉపగ్రహాన్ని రోదసిలోకి విజయవంతంగా పంపి భారీ రాకెట్‌ ప్రయోగాల్లో భారత్‌ తన సత్తాను చాటుకుంది. శ్రీహరికోటలోని సతీష్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి ఈ చరిత్రాత్మక ప్రయోగం జరిగింది. ఇంటర్నెట్‌, టీవీ, టెలికాం రంగాలకు అవసరమైన ఎంతో సాంకేతిక నిపుణుతను ఇప్పుడు పంపిన జీశాట్‌-19 అందజేస్తుంది. అత్యంత క్లిష్టమైన క్రయోజనిక్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించి ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

సుమారు 5,80,600 కిలోల బరువున్న ఈ రాకెట్‌ రోదసిలో ప్రయాణించి, ఇందులో 3,136 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని 35,975 కిలోమీటర్ల ఎత్తులో వున్న జిటిఓ (భూ అనువర్తిత బదిలీ కక్ష్య)లోకి తీసుకువెళ్ళగలిగిందంటే మన శాస్త్రవేత్తల ప్రజ్ఞాపాటవాలు ఎంత గొప్పవో తేటతెల్లమవు తుంది. దాదాపు రెండువందల ఏనుగుల బరువుండే రాకెట్‌ను రోదసి లోకి విజయవంతంగా పంపడమంటే మాటలు కాదు. అంతటి అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న ఇస్రోకి అభినందనలు. వాణిజ్యపరంగా కూడా ఇస్రోకి ఈ విజయం మరింత మేలుబాటలు పరుస్తుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇంతటి విజయాన్ని సాధించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ల ప్రయోగంలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఎన్నో వ్యయప్రయాసలు, మరెన్నో వైఫల్యాలను సైతం అధిగమించి ఇస్రో ధృఢసంకల్ప దీక్షతో, అలుపెరుగని కృషితో విజయపథాన సాగిపోతూవుండడం ఎంతైనా గర్వకారణం. అన్ని వైఫల్యాలను అధిగమిస్తూ రాకెట్ల తయారీలో ఇస్రో తన అపార శక్తిసామర్ధ్యాలను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే వుంది. స్వదేశీ పరిజ్ఞానంతో సొంతంగా క్రయోజనిక్‌ ఇంజిన్‌ను తయారుచేసుకుని తాజాగా జిఎస్‌ఎల్‌వి మార్క్‌-3 డి 1ను రోదసిలోకి పంపింది. ఇది తొలి ప్రయోగంలోనే విజయవంతమై అంతరిక్ష పరిజ్ఞానంలో భారత్‌ అగ్రరాజ్యాల సరసన చేరిందంటే ఇస్రో కృషి-పట్టుదల ఎంత ఘనమైనవో తెలుస్తుంది. కాగా, అంతరిక్ష పరిజ్ఞానంతో దేశంలోని సామాజిక, ఆర్ధిక, సాంకేతిక స్థితిగతులన ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకే ఇస్రో అందుకు అవసరమైన అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఇంటర్నెట్‌ వేగాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తోంది. దేశంలో సుమా రు 45 కోట్ల మందికి పైగానే ఇప్పుడు ఇంటర్నెట్‌ వినియోగించుకుంటున్నారు. అయితే ఇంటర్నెట్‌ వేగం విషయంలో అనేక దేశాలకన్నా భారత్‌ ఇంకా వెనుకబడే ఉంది. అందువల్ల ఇంటర్నెట్‌ వేగాన్ని పెంచే మంచి సామర్ధ్యం వున్న మూడు ఉపగ్రహాలను ఇస్రో సిద్ధం చేస్తోంది. అందులో తొలిది జిఎస్‌ఎల్‌వి మార్క్‌-3 ద్వారా ఇప్పుడు పంపిన జీశాట్‌-19 సమాచార ఉపగ్రహం. ఆ తర్వాత జీశాట్‌-11, జీశాట్‌-20 అనే రెండు ఉపగ్రహాలను కూడా ఇస్రో ప్రయోగించనుంది. ఈ ప్రయోగాలతో కేవలం రెండేళ్ళలోనే సాంకేతికాభి వృద్ధి గణనీయంగా పెరిగి, నెట్‌ వేగం కూడా బాగా పెరుగుతుంది. అంతేకాదు, నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలతోపాటు, ఫోన్‌లు, టీవీ, వీడియో సేవలు మరింతగా అందుబాటులోకి వచ్చి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ యుగం త్వరలోనే ఆవిష్కృతమవుతుంది. ఒకప్పట్లో రష్యా నుంచి ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు స్వయంకృషితో రష్యా ఉపగ్రహాలను సైతం రోదసిలోకి పంపే స్థాయికి ఎదిగిందంటే అంతరిక్ష రంగంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి-పట్టుదల ఎలాంటివో తెలుస్తుంది. ఇస్రో ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు, చేస్తున్న ప్రయోగాలు దేశానికి ఎంతో ఉపయోగకరం. భూమిలోపల, సాగర గర్భంలోను, ఇతర గ్రహాల్లోనూ గ్రహాంతరాల్లోనూ వుండే అమూల్యమైన వనరుల సమాచారాన్ని ఉపగ్రహాలు మనకు అందిస్తున్నాయి. ప్రకృతి విపత్తులను కూడా ముందే తెలుసుకుంటున్నాయి. సమాజాభ్యుదయానికి ఎంతో ఉపకరించే ఈ ఉపగ్రహాల సేవలు జాతికి బహుళప్రయోజనాలను అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, జిఎస్‌ఎల్‌వి ద్వారా భారత వ్యోమగాముల్ని రోదసిలోకి పంపాలన్న ఆలోచనలు కూడా ఇస్రోకి వున్నాయి. ఆ కల సాకారమైతే, మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో రష్యా, అమెరికా, చైనాల తర్వాత భారత్‌కూ స్థానం లభిస్తుంది. భవిష్యత్తులో చందమామ చెంతకు చేరుకోవడం, అంగారక తదితర గ్రహాలపై మరింత విస్తృత ప్రయోగాలు జరపడం వంటి బృహత్తరమైన ఆలోచనల కార్యరూపానికి ఇస్రో ఇప్పటినుంచే సమాయత్తం అయ్యేందుకు...ఈ తాజా ప్రయోగ విజయం ఒక శుభసూచిక అని వేరే చెప్పనక్కరలేదు. విజయపరంపరలతో ముందుకు సాగుతున్న ఇస్రోకు శుభాభినందనలు.

సాహో.. ఇస్రో!.. జయహో ఇస్రో!...



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter