Friday, 09 June 2017 09:51

నవ నిర్మాణ దీక్షలో జబర్దస్త్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది ప్రపంచంలోని పాతిక మేటి నగరాలను మిక్సీలో వేసి రుబ్బితే వచ్చిన అమరావతి రాజధాని నగరం. హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్ర బాబు నివాసం. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శిద్ధా రాఘవ రావు, నిమ్మకాయల చినరాజప్ప, పీతల సుజాతలు అప్పుడే ఇంట్లోకి వచ్చారు. అప్పుడే లోకేష్‌ తన కొడుకు దేవాన్ష్‌ను భుజాల మీద కెత్తుకుని... ''చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా'' అనే పాట పాడు కుంటూ హాల్‌లోకి వచ్చాడు. అక్కడ వున్న మంత్రులను చూసి లోకేష్‌ పాట ఆపేసి, ఏం సార్‌, అందరూ ఇంత పొద్దున్నే కట్టకట్టుకుని వచ్చా రని అడిగాడు. ఈరోజు విజయ వాడ బెంజ్‌సర్కిల్‌లో నవనిర్మాణ దీక్ష వుంది కదా ఏర్పాట్ల గురించి మాట్లాడుదామని వచ్చామని ఉమా చెప్పాడు. నాన్నగారు పూజగదిలో దేవుడితో హాట్‌లైన్‌లో మాట్లాడు తున్నారు, పది నిముషాలు వెయిట్‌ చేయండని చెప్పి లోకేష్‌ లోపలకు వెళ్లాడు. చంద్రబాబు హాట్‌లైన్‌లో దేవుడుతో మాట్లాడుతున్నాడా? ఢిల్లీతో మాట్లాడుతున్నాడా? అయినా ఈ లోకేష్‌ మాటలు ఓ పట్టాన అర్ధమై చావవు అని అనుకుంటూ మంత్రులు అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపటికి చంద్రబాబు అక్కడకు వచ్చాడు. సోమిరెడ్డి వుండి ఆయ నతో... మీరు దేవుడుతో మాట్లాడు తున్నారని లోకేష్‌ అన్నారు, అలాంటి పేరున్న నాయకుడు మన పార్టీలో గాని, ఎన్టీఏలోగాని ఎవరు లేరే, ఎవర్సార్‌ ఆ దేవుడు అని అడిగాడు. నేను మాట్లాడేది నిజం దేవుడు తోనే... ఆయనే ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు. ప్రతిరోజూ ఆయ నతో మాట్లాడాకే నా దినచర్య మొద లవుతుంది. నా పనులన్నీ ఆయనే చెబుతాడు. ఆయన చెప్పినవే నేను చేస్తాను. ఆ దేవుడు శాసిస్తాడు, ఈ చంద్రబాబు ఆచరిస్తాడు. అమరా వతిలో రాజధాని కట్టమంది ఆయనే, పోలవరం నిర్మించమంది ఆయనే... అని చంద్రబాబు చెప్పాడు. ఆ మాటకు ఎదురుగా వున్న మంత్రులు ఆశ్చర్యంతో నోర్లు తెరవగా, గోడ మీద పటంలో వేలాడుతున్న వెంక టేశ్వరస్వామి ఆశ్చర్యంతో నామాల మీద వేలేసుకున్నాడు. తర్వాత చంద్రబాబే వుండి.. బెంజ్‌సర్కిల్‌లో నవనిర్మాణదీక్ష ఏర్పాట్లు ఎలా జరు గుతున్నాయని అడిగాడు. అప్పుడు దేవినేని ఉమ... బెంజ్‌ సర్కిల్‌లో ప్రతిగంటకు కొన్ని వందల బస్సులు, లారీలు, కార్లు వస్తుంటాయి. వాట న్నింటిని ఆపేసి అందులోని వారిని సభలో కూర్చోబెడతాం. అలాగే సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ కొచ్చిన వాళ్లను కూడా ఇక్కడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. నందిగామ నుండి పది బస్సులు,

ఉయ్యూరు నుండి 15బస్సులు పెడుతున్నాం. గన్నవరం నుండి 20బస్సులు, బందరు నుండి పాతిక బస్సులు పెడుతున్నాం. జనం తక్కువైతే నూజివీడు నుండి కూడా 50బస్సులు పెడతామని చెప్పాడు. మీరు బస్సులు ఎన్ని పెట్టారన్నది ముఖ్యంకాదు, జనం ఎంతమంది వచ్చారన్నదే నాకు ముఖ్యం. జనం లేకుంటే మీకు జాతరే అని చంద్ర బాబు వార్నింగ్‌ ఇచ్చాడు.

---------------

అది బెంజ్‌సర్కిల్‌. నవనిర్మాణ దీక్ష సభా ప్రాంగణం. వేలసంఖ్యలో కుర్చీలు వేసారు. పదుల సంఖ్యలో మాత్రమే కుర్చీలు నిండాయి. మంత్రులు దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలు టెన్షన్‌తో వున్నారు. అటు వైపు ఒక్క వాహనం కూడా వెళ్లడం లేదు. ఆ సెంటర్‌లో ఒక్క మాల్‌ కూడా తెరువ లేదు. అక్కడ వున్న ఎంపీ కేశినేని నానితో దేవినేని ఉమ... ఏమైంది ఈరోజు, ఇటు వైపు ఒక్క బండి కూడా వెళ్లడం లేదని అడిగాడు. అందుకు నాని... ఈరోజు బెంజ్‌ సర్కిల్‌లో నవనిర్మాణ దీక్ష అనేసరికి ఈ రూటులో ప్రయాణాలు మాను కున్నారు. అర్జంట్‌గా పోవాల్సినవారు అడ్డదారుల్లో పోతున్నారని చెప్పాడు. అప్పుడే చంద్రబాబు వచ్చాడు. సభకు హాజరైన జనాన్ని చూసాడు. అరికాల్లో మండిందాయనకు. నిన్న బస్సులు, రైళ్లు, విమానాలని లెక్కలు చెబితిరి... ఎక్కడ జనం, ఈరోజు నవనిర్మాణ దీక్ష ఫెయిల్‌ అవుతుందని దేవుడు చెప్పాడు. అలాగే జరిగింది. కనీసం రేపటి సభకన్నా జనం బాగా వచ్చే టట్లు చూడండని చెప్పి వెళ్లి పోయాడు.

దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లా రావులు సోమిరెడ్డితో సభలకు జనాన్ని తీసుకురావడం ఓ ఆర్ట్‌... రేపటి సభకన్నా జనం రాకపోతే మన పరువు పోతుంది. మీరే ఏదో ఒకటి చేయండన్నా అని అడిగారు. వెంటనే సోమిరెడ్డి ఫోన్‌ తీసి స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(66+)కు కాల్‌ చేసి విషయం చెప్పాడు. అవ తల నుండి వివేకా... ఆ సంగతి నాకొదిలేయండి, మీరు తల మీద తడిగుడ్డ వేసుకుని నిద్రపోండని భరోసా ఇచ్చాడు.

-------------

రెండోరోజు ఏ1 కన్వెన్షన్‌ సెం టర్‌లో నవనిర్మాణదీక్ష... హాల్‌ కిక్కి రిసిపోయింది. లోపల ఎంత జనం ఉన్నారో బయట అంతకు మూడిం తల మంది వున్నారు. లోపల సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. అక్కడకు వచ్చిన వారిలో మహిళలు, వృద్ధులు, పిల్లలు ఎక్కువుగా వున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన చంద్రబాబు కిక్కిరి సిన జనాన్ని చూసి దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావులను మెచ్చుకు న్నట్లుగా చూసాడు. దాంతో వారిలో ఎనలేని ఉత్సాహం వచ్చింది. అప్పుడే అక్కడకు వచ్చిన సోమిరెడ్డితో వాళ్ళు... వివేకన్న ఏం మాయ చేసా డన్నా, ఇంతమంది జనం వచ్చారని అడిగాడు. దానికి సోమిరెడ్డి... ఏ ముంది, ఈరోజు నవ నిర్మాణదీక్ష సభలో యాంకర్లు శ్రీముఖి, రవిలచే 'పటాస్‌' ప్రోగ్రామ్‌, అనసూయ, రష్మిల ఆధ్వర్యంలో 'జబర్దస్త్‌' ప్రో గ్రామ్‌, యాంకర్‌ సుమ ఆధ్వర్యంలో 'పట్టుకుంటే పట్టు చీర' కాంపిటీషన్స్‌ జరుగుతాయని ప్రచారం చేయిం చాడు. అంతేకాదు, వాళ్లను రప్పిం చాడు కూడా! ఇంకో ఇంపార్టెంట్‌ విషయం ఏంటంటే ఈరోజు సభలో చంద్రబాబు స్పీచ్‌ వుండదని ప్రచారం చేశాడు. అందుకే జనం ఇంతగా ఎగబడ్డారని చెప్పడంతో వాళ్లు ఏమైనా మీ నెల్లూరోళ్లు అసాధ్యులన్నా అంటూ నోర్లెళ్ళబెట్టారు.

Read 230 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter