09 June 2017 Written by 

09-06-2017 రాశిఫలాలు

rasi 09

1Ariesమేషం

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. దూరం నుండి ఆహ్వానాలు అందుకొంటారు. ఉద్యోగులకు తమ అధికారుల, సహచరుల సహకారం బాగుంటుంది. బిడ్డల విషయంగా శ్రద్ధ అవసరం. అల్పులతో మనస్పర్థలు రావచ్చు. కాబట్టి, అనవసర విషయాలలో జోక్యం చేసి కొనవద్దు. చేసే పనులందు అనుకూలత ఉండినా టెన్షన్‌ పడుతుంటారు. ఆదాయం పెరుగుతుంది.

 

2Taurusవృషభం

గృహ మార్పులు, గృహ వస్తు వాహన రిపేర్లుం టాయి. ఆత్మీయులను, పెద్దలను కలుసుకుంటారు. కాంట్రాక్టులు, ఏజెన్సీలు, లీజులు పొడిగింపబడగలవు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెద్దలు, బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగార్థులకు అవకాశాలకు మరికొంత సమయం పడుతుంది. సమాజంలో పలుకుబడి బాగుంటుంది.

 

3Geminiమిధునం

శుభకార్యాలు నిర్ణయింపబడగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసికొనండి. విలువైన వస్తువులు కొంటారు. పెట్టుబడులు షేర్లు లాభిస్తాయి. అనుకున్న పనులను ఏదో ఒక రీతిలో సాధించుకొంటారు. ఉద్యో గార్ధులకు అవకాశాలు దొరుకుతాయి. ముఖ్య పనులకు సలహాలు పొందడం మంచిది. ఆర్థికస్థితి బాగుంటుంది. ఖర్చులు పెరిగినా భారమనిపించవు.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులు నిజబాధ్యతలను సక్రమంగా నిర్వ హిస్తారు. అధికారులకు స్థానమార్పులుంటాయి. సొంత పనులు వ్యవహారాలు అనుకూలం కావడానికి కష్టపడాలి. ఇతరులకు మాట సహాయం చేయడం, గతంలోని విషయాలను గూర్చి ఇతరులచే విమర్శింపబడటం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబసౌఖ్యం బాగుంది.

 

5Leoసింహం

కొత్త కాంట్రాక్టులు, వాణిజ్య భాగస్వామిగా అవకా శాలు దొరుకుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. అవగాహన లేని వ్యవహారాలలో జోక్యం చేసుకొనవద్దు. దైవ కార్యాలలో భాగస్వాములు కాగలరు. ఉద్యోగార్థులకు అవకాశాలు దొరికే పరిస్థితి ఉన్నది. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

 

6Virgoకన్య

ఉద్యోగులకు దైనందిన విధి నిర్వహణలో గుర్తింపు గౌరవాలుంటాయి. శుభకార్యాలలో పాల్గొనడం, దూర ప్రయాణాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో కొద్ది ఆటం కాలు తప్ప ఆదాయ లోపం కలుగదు. బంధు ముఖ్యుల అనారోగ్య వార్తలు వినడం, కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం జరుగుతుంది. ఉద్యోగార్థులు ప్రయత్నాలందు జాగ్రత్తగా వ్యవహరించండి.

 

7Libraతుల

ప్రభుత్వ కార్యాలయాలలో పనులు వాయిదా పడ వచ్చును. ఉద్యోగులకు అధికారుల అనుకూలత, బాధ్యతల పెంపు ఉంటుంది. అధికారులకు స్థానమార్పు లుంటాయి. స్థిరాస్తుల షేర్లపై ఆదాయముంటుంది. కోర్టు కేసులందు ఊరట లభిస్తుంది. వాహన రిపేర్లు, శరీరా నికి చిన్న గాయాలు తగలడం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు, శుభవార్తలు వింటారు.

 

8Scorpioవృశ్చికం

ఆరోగ్య విషయంలోను ఆహార విషయంలోను జాగ్రత్తలు అవసరం. ఉద్యోగులు పబ్లిక్‌తోను, అధికారుల తోనూ జాగ్రత్తగా మెలగండి. వ్యాపార రంగాల వారికి అధికారుల పరిశీలనలుంటాయి. ఇతరుల వ్యాఖ్యలు మీపై విమర్శనల రూపంలో ఉంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వ్యాపార పారిశ్రామిక రంగాలలో పెట్టు బడులకు అవకాశాలు దొరుకుతాయి.

 

9Sagittariusధనుస్సు

దూర ప్రయాణాలు, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. ఋణాలివ్వడం, హామీలివ్వడం చేయవద్దు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఉమ్మడి వెంచర్లకు, కొత్త కాంట్రాక్టులకు అనుకూలము. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు వత్తిడి పనిభారం అధికం. ఉద్యో గార్ధులకు ఇంటర్వ్యూ అవకాశాలుంటాయి.

 

10Capricornమకరం

పెట్టుబడులు షేర్ల యందు సంతృప్తి ఉండదు. శుభకార్యాలలో పాల్గొనడం, బంధుమిత్రులను కలుసు కొనడం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాలు కష్టం మీద పూర్తి చేస్తారు. కోర్టు కేసులందు సమస్యలుండ వచ్చును. ఉద్యోగార్థులకు అవకాశాలు దొరకగలవు. ప్రభుత్వ ఋణాలు, చేతివృత్తి వారికి అభివృద్ధి కలదు. చేపట్టిన ప్రతి పని సమస్యగా కనిపిస్తుంది.

 

11Aquariusకుంభం

విలువైన వస్తువులు, వాహనాలు, గృహోపకరణాలు కొంటారు. అధికారుల వత్తిడి, చికాకులు ఉద్యోగులకుండ గలవు. ఉద్యోగార్థులకు మరి కొద్దికాలం పట్టగలదు. కోర్టు కేసులు, రావలసిన బాకీలు వాయిదా పడతాయి. రాజకీయ వర్గాల వారు ఇబ్బందుల్లో పడతారు. స్థిరాస్తులు, షేర్ల మీద ఆదాయం పెరుగుతుంది. సొంత వృత్తుల వారికి సామాన్యంగా జరిగిపోతుంది.

 

12Piscesమీనం

ఆత్మీయులు, కుటుంబీకులతో సంతోషంగా గడుపు తారు. నగదు చెల్లింపులు సంతకాలుంటాయి. కోర్టు కేసులు వాయిదా పడవచ్చును. స్త్రీలకు గుర్తింపు గౌర వాలుండి కార్యనిర్వహణలో ప్రతిభ కనబరుస్తారు. ఉద్యో గులకు అధికారులతో సత్సంబంధాలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. స్థిరాస్తులు, విలువైన వస్తువులను కొంటారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
    నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter