16 June 2017 Written by 

పొత్తు కోసం ఎత్తులు

modi jag cmసంకీర్ణ ప్రభుత్వాల యుగంలో జాతీయ రాజకీయాలలోనూ ప్రాం తీయ పార్టీల పాత్ర చాలా కీలకంగా మారింది. కేంద్రంలో ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ప్రాంతీయ పార్టీలే పునాదులుగా నిలబడ్డ పరిస్థితిని చూసాం. నాలుగు సీట్లున్న ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో ప్రభుత్వాలను పడగొట్టడం చూసాం. ప్రధాని పీఠంపై వున్న నాయకులు కూడా తమ కుర్చీలు కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీల అధినేతల కాళ్ళూ, గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడడం చూసాం. నిన్న మొన్నటి వరకు దేశ రాజకీయాలలో కనిపించిన పరిస్థితి ఇది.

కాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అందుకు పూర్తి భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయంటే ప్రాంతీయ పార్టీలను తమ కూటమిలో చేర్చుకోవ డానికి జాతీయ పార్టీలు ఆరాటపడాలి. మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా వుంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో పొత్తు కలుపుకునేందుకు ఒకరు, ఉన్న పొత్తును నిలుపుకునేందుకు మరొకరు తపన పడుతుండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

వాజ్‌పేయి నాటి ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు చాలా బెట్టుగా ఉండేవాడు. బీజేపీ నాయకులే తన కాళ్ల దగ్గరకు రావాలన్నట్లుగా ఉండేవాడు. ఏమన్నా తేడా వస్తే, తనకేమన్నా విలువ తగ్గితే పెట్టె బేడా సర్ధుకుని ఎన్డీఏ నుండి బయటకొచ్చేస్తానన్నట్లు బెదిరించేవాడు. బీజేపీ అంతర్గత పరిణామాలపై కూడా ఆయన గతంలో నోరు విప్పిన సందర్భాలున్నాయి. అయితే అప్పటికి, నేటి మోడీ కాలానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్రంలోని బీజేపీని ఆయన బెదిరించడం కాదు కదా, బ్రతిమలాడి వారితో పొత్తును కొనసాగించాల్సిన స్థితిలో వున్నాడు. బీజేపీ ఎక్కడ తమతో తెగదెంపులు చేసుకుంటుందోనని భయపడుతున్నాడు. ఈమధ్య ఏపిలో బలపడాలంటూ ఢిల్లీ బీజేపీ నాయకులు ప్రకటనలు గుప్పించారు. దీనికి తగ్గట్లే పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఈమధ్య విజయవాడలో భారీ సభ పెట్టి మాట్లాడారు. తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకుంటేగాని రాష్ట్రంలో బీజేపీ బలపడే పరిస్థితి లేదు. వీళ్లు బలం పెంచుకోవడానికి తమతో ఎక్కడ పొత్తు వదులుకుంటారోనని చంద్రబాబు భయం. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీతోనే కలిసి పయనించాలని చంద్రబాబు ఆశ. దీనికి కారణం ప్రజల్లో మోడీ ఇమేజ్‌ పెరిగిందని నమ్మకం కలగడమే! మొన్న యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయివుంటే చంద్రబాబు వాయిస్‌ ఇంకోరకంగా ఉండేది. బీజేపీతో తెగదెంపులకు సిద్ధంగానే ఉండేవాడు. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు విచ్ఛిన్నం కాకుండా కాపాడేందుకు ఆయన తనకున్న అవకాశాలన్నింటిని వాడుకుంటున్నాడు.

మరోపక్క ప్రతిపక్ష వైకాపా కూడా కేంద్రంలో బీజేపీతో మైత్రికే మొగ్గుచూపుతుండడం విశేషం. వైసిపి కాంగ్రెస్‌లో నుండి వచ్చిన గుడ్డముక్కే! అయితే కాంగ్రెస్‌ నుండి వేరుపడ్డ పార్టీలన్నీ కూడా గతంలో తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరాయి. కాని వైసిపి అధినేత జగన్‌ పరిస్థితి అది కాదు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీనే ఢీకొట్టాడు. ఆమె వ్యక్తిగత కక్ష కారణంగా జగన్‌ 16 నెలలు జైలులో వున్నాడు. ఇలాంటి పరాభవాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. ఇంత హింసించిన సోనియాగాంధీ వద్దకు అతను పోలేడు. అదీగాక జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పతనమైతే జగన్‌ పంతం కూడా నెరవేరినట్లవుతుంది. అందుకనే జాతీయ రాజకీయాలలో తనకంటూ ఒక వేదిక కోసం జగన్‌ కాంగ్రెస్‌ వైపు కాకుండా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాడు.

చంద్రబాబు అయినా జగన్‌ అయినా బీజేపీ వైపు మొగ్గు చూపడానికి మరో బలమైన కారణం వుంది. ఇద్దరి మీద కేసులున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌, ఓటు-నోటు కేసులో చంద్రబాబులు ఇరుక్కున్నారు. దీంతో కేంద్రం చేతిలో ఇద్దరూ బందీలుగా వున్నారు. ఈ కేసులుండబట్టే మోడీ, అమిత్‌షాల ద్వయం వీరితో ఆడుకుంటోంది. రేపు ఈ ఇద్దరిలో వాళ్లు ఎవరిని వాడుకుంటారో చూడాలి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter