16 June 2017 Written by 

'దేశం'కు అగ్నిపరీక్ష!

silpaసాధారణ ఎన్నికల కంటే ఒక ట్రెండు సంవత్సరాల ముందు వచ్చే ఉపఎన్నిక ఏదయినా అధికారంలో వున్న పార్టీకి అగ్ని పరీక్ష వంటిదే! రాష్ట్రంలో ఆయా పార్టీల స్థితిగతులు బయటపడేది కూడా ఉపఎన్నికల ద్వారానే! అధికార పార్టీకి ప్రజాదరణ పెరిగిందా, కోల్పోయిందా అన్నది కూడా ఉపఎన్నికల ఫలితాలలో తేట తెల్లం అవుతుంటుంది.

రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఏంటి, భవిష్యత్‌ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నదానికి కొలమా నంగా నంద్యాల ఉపఎన్నిక వచ్చి పడింది. భూమా నాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ సీటుకు ఉపఎన్నిక వచ్చింది. బహుశా కొద్ది రోజుల్లోనే దీనికి నోటిఫికేషన్‌ వెలువడవచ్చు.

మన రాష్ట్రంలో ఒక సాంప్రదా యాన్ని ప్రధానపార్టీలు కొనసాగిస్తు న్నాయి. ఎమ్మెల్యే గాని, ఎంపీగాని మర ణిస్తే ఆ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో సంబంధిత కుటుంబసభ్యులు పోటీ చేస్తే అవతల పార్టీ అభ్యర్థిని పెట్ట కుండా ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తూ వచ్చేది. కాని నంద్యాల సబ్జెక్ట్‌ వేరే! 2014లో భూమా నాగిరెడ్డి ఇక్కడ వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత తెలుగుదేశంలో దూరారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగానే మరణించారు. ఇక్కడ కొత్త సమస్య ఏంటంటే నంధ్యాలలో గెలిచింది వైసిపి, నాగిరెడ్డి మాత్రం మరణించేరోజుకు తెలుగుదేశంలో ఉన్నాడు. మా పార్టీ గెలిచిన సీటును మేమెందుకు వదులుకుంటామంటూ జగన్‌ మొదట్లోనే పోటీకి సంకేతాలిచ్చాడు. ఇక మా పార్టీ నాయకుడు కాబట్టి వారి కుటుంబసభ్యులనే పోటీకి దించాలంటూ చంద్రబాబు భూమా నాగిరెడ్డి సోదరుడి కొడుకైన భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో నంధ్యాల నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి కొద్ది ఓట్ల తేడాతో పరాజయం పాలైన శిల్పా మోహన్‌రెడ్డి ఉపఎన్నికల్లో నంధ్యాల సీటును ఆశించాడు. అయితే చంద్రబాబు భూమా కుటుంబానికే సీటు అని తేల్చడంతో, ఇక అక్కడ ఇమడలేక శిల్పామోహన్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన వై.యస్‌.జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరిపోయాడు. శిల్పా మోహన్‌రెడ్డి వైకాపాలో చేరడమే నంధ్యాలలో తెలుగుదేశంకు అసలైన పరీక్ష. నంధ్యాల నియోజకవర్గంలో బలమైన వర్గం, పరపతి కలిగిన నాయకుడు శిల్పామోహన్‌రెడ్డి, సొంతంగా ఓట్లున్నాయి. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఫ్యాన్‌ ప్రభంజనం పనిచేసినా, నంధ్యాలలో మాత్రం శిల్పా చాలా గట్టిపోటీనిచ్చాడు. ఓపక్క వై.యస్‌. సానుభూతి, ఇంకోపక్క శోభా నాగిరెడ్డి మరణంతో వచ్చిన సానుభూతి... ఇంత అనుకూల వాతావరణం ఉన్నా కూడా 2014 ఎన్నికల్లో నంధ్యాల నుండి భూమా నాగిరెడ్డి చచ్చీచెడి శిల్పా మోహన్‌రెడ్డి మీద కేవలం 2వేల చిల్లర ఓట్ల తేడాతో మాత్రమే గెలవగలిగాడు. అంటే ఇక్కడ శిల్పా వ్యక్తిగత బలం వై.యస్‌, శోభా నాగిరెడ్డిల సానుభూతిని ఢీకొట్టకలిగింది. తెలుగుదేశంలో ఉన్న ప్పుడే అంతగా పోటీనిచ్చిన శిల్పా మోహన్‌రెడ్డికి వైసిపిలో ఇంకా ఇమేజ్‌ పెరుగుతుంది. వైసిపి హవా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, శిల్వా వ్యక్తిగత ప్రతిష్ట అన్నీ కలిస్తే... ఇక్కడ శిల్పామోహన్‌రెడ్డిని ఢీకొనాలంటే కష్టమే! నంధ్యాల ఉపఎన్నికల్లో శిల్పామోహన్‌రెడ్డి రూపంలో వైకాపాకు బలమైన అభ్యర్థి దొరికాడు. అధికార పార్టీ కాబట్టి తెలుగుదేశం గెలుపు కోసం ఇక్కడ శక్తియుక్తులన్నింటిని ధారపోయవచ్చు. ఈ ఉపఎన్నికల్లో గెలుపు అటు అధికార తెలుగుదేశంకు ఇటు ప్రతిపక్ష వైకాపాకు ప్రతిష్టాత్మకం. తెలుగుదేశం గెలిస్తే ఆ పార్టీ నుండి ఇక వలసలు ఉండవు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఒక నమ్మకం ఏర్పడుతుంది. అదే ఓడిపోయి వైకాపా గెలిస్తే ఆ పార్టీ నుండి వైకాపాలోకి వలసలు మొదలవుతాయి. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం పోతుంది. మొత్తానికి నంద్యాల ఉపఎన్నిక ఫలితం ప్రభావం 2019 ఎన్నికలపై బలంగానే ఉంటుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter