16 June 2017 Written by 

తీరంకు సిఇజడ్‌ హారం

sezడాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి ఉండేది. ఆయన మరణం జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి బ్రేకులు వేసింది.

అయితే చాలా ఏళ్ల తర్వాత జిల్లా పారిశ్రామిక ప్రగతికి సంబంధించి ఓ శుభవార్త వెలువడింది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తీరప్రాంత ఉపాధి ప్రాంతం(కోస్టల్‌ ఎంప్లాయిమెంట్‌ జోన్‌-సిఇజడ్‌)ను నెల్లూరుజిల్లాలో ఏర్పాటు చేయాలని దాదాపు నిర్ణయించి నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక పరిశీలన కూడా పూర్తయ్యింది.

నీతి అయోగ్‌ సిఇఓ అమితాబ్‌కాంత్‌ ఇటీవలే కృష్ణపట్నం పోర్టును సందర్శిం చారు. పోర్టులో వున్న వసతులను, వేగ వంతంగా జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులను పరిశీలించారు. పోర్టు పరిధిలో సేకరించిన భూముల వివరాలు తెలుసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, వాటి ద్వారా పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఒక పెద్ద సెంటర్‌గా చేయొచ్చని ఆయన గుర్తించారు. కృష్ణ పట్నం పోర్టును ప్రధాని నరేంద్రమోడీ కలల రూపంగా భావించిన ఆయన ఈ పోర్టు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసు కెళ్లారు. ఆయన తీసుకున్న చొరవతోనే ఈ నెల 12వ తేదీన నీతి అయోగ్‌ కమిటీ సభ్యులు సంజయ్‌గుప్తా, యుదువీర్‌ మాతూర్‌, సుధీర్‌కుమార్‌, అతిషాకుమార్‌ లతో కూడిన బృందం కృష్ణపట్నం పోర్టును సందర్శించింది. వీరితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్ధార్ధజైన్‌, ఏపిఐఐసి ఛైర్మెన్‌ పి.కృష్ణయ్య, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.బాబు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముత్యాలరాజు, ప్రద్యుమ్న, ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మి, పోర్టు సిఇఓ ఎండ్లూరి అనిల్‌కుమార్‌లు పాల్గొన్నారు. కృష్ణపట్నం వద్ద సిఇజడ్‌ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలను గురించి పోర్టు అధికా రులు, జిల్లా అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా నీతి అయోగ్‌ కమిటీకి వివరించారు. ఈ వివరాల పట్ల కమిటీ సంతృప్తి చెందింది. కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా జిల్లా తీరప్రాంతంలో కనీసం 50చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సిఇ జడ్‌ను ఏర్పాటు చేయాల్సి వుంటుంది. సిఇజడ్‌ ప్రధానలక్ష్యం ఒక్కో పరిశ్రమ ద్వారా 10వేల నుండి 40వేల మంది వరకు ఉద్యోగాలను కల్పించడం. కేంద్ర ప్రభుత్వం మేకిన్‌ ఇండియా పాలసీ ద్వారా భారీ పరిశ్రమలను ఇక్కడ పెట్టించాలని భావిస్తోంది. ముఖ్యంగా కృష్ణపట్నంపోర్టు ఉండడంతో వివిధ దేశాల నుండి ముడి సరుకులను దిగుమతి చేసుకుని వాటి ద్వారా వస్తువులు తయారు చేసి తిరిగి విదేశాలకు ఎగుమతి చేసే మాన్యూ ఫాక్చరింగ్‌ యూనిట్‌లకు ఎక్కువ ప్రాధా న్యతనిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరి శ్రమల ద్వారా ఎగుమతులు, దిగుమతులు పెరగడంతో పాటు విదేశీ వస్తువుల దిగుమతులను తగ్గించుకోవచ్చు. తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచు కోవడంతో పాటు వస్తువుల ఎగుమతి ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఇంకా ఆర్జించే అవకాశముంటుంది. అంతేకాదు పరిశ్రమలు పెరిగే కొద్ది ఉపాధి అవకా శాలు పెరుగుతాయి. ఈ సిఇజడ్‌లో పరిశ్రమలను స్థాపించాలనుకునే వారిని కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహించే అవకాశం వుంది.

సిఇజడ్‌ వస్తే జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులను కూడా ఇతర జిల్లాల నుండి రవాణాను మెరుగుపరిచే దిశగా రహదారులను అభివృద్ధి చేయవచ్చు. సిఇజడ్‌ పై కేంద్రం నుండి త్వరలోనే అధికా రిక ప్రకటన వెలువడే అవకాశముంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter