16 June 2017 Written by 

కమలంలో 'కుల'కలం

kamalamనెల్లూరుజిల్లా కమలం పార్టీలో కులం కంపు రేగింది. ఉన్న పదవులన్నీ ఒకే సామాజిక వర్గం వారికిస్తున్నారంటూ అసమ్మతి రేగింది. జిల్లా పార్టీలో ఎప్పుడూ లేని విధంగా కులం కాష్టం రగిలింది. 'నుడా' డైరెక్టర్‌ పదవి విషయంలోనే కులం చిచ్చుకు ఆజ్యం పోసినట్లయ్యింది.

బీజేపీకి సంబంధించి నెల్లూరుజిల్లాలో వెంకయ్యనాయుడు పెద్ద నాయకుడు. కాకపోతే ఆయన జాతీయ నాయకుడు కాబట్టి జిల్లా స్థాయిలో అతనిని చూడలేము. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ జిల్లాలో బీజేపీ వాళ్ళకు కొన్ని పదవులిచ్చారు. కనుమూరు పరిశ్చంద్రారెడ్డిని గూడూరు వెంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు ఛైర్మెన్‌గా, ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన బెజవాడ అనిల్‌కుమార్‌రెడ్డిని పెద్దాసుపత్రి అభివృద్ధి కమిటీలో సభ్యుడిగా నియమించడం తెలిసిందే! అలాగే బీజేపీ సీనియర్‌ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్‌ రెడ్డిని ఎంపెడా డైరెక్టర్‌గా నియమించడం తెలిసిందే! ఈ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు. ఇంతవరకు బాగానే వుండింది.

తాజాగా నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి(నుడా)లో బీజేపీ నుండి ఒకరిని డైరెక్టర్‌గా నియమించారు. నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిని నుడాలో డైరెక్టర్‌గా నియ మించడంపై ఆ పార్టీలోని మిగతా సామాజిక వర్గాల నాయకులు పదవులన్నీ ఒక సామాజికవర్గం వారికేనా అని కారాలు మిరి యాలు నూరుతున్నారు. అయితే ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన నియామకం కాదని తెలుస్తోంది. 'నుడా'లో ముగ్గురు డైరెక్టర్‌లకు గాను బీజేపీకి ఒక పోస్ట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం పేర్లు పంపమని బీజేపీ జిల్లా అధ్యక్షుడిని తెలుగుదేశంపార్టీ వాళ్లు కోరారు. దాంతో బీజేపీ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి నగరానికి చెందిన బీజేపీ నాయకుడు ఎం.ఈశ్వరయ్య పేరును సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఒక పేరు కాదని, ఆప్షన్‌గా ఇంకో పేరు కూడా పంపించమని, అది కూడా శ్రీసిటి, మేనకూరు సెజ్‌లున్నాయి కాబట్టి నాయుడుపేట డివిజన్‌ నుండి పంపించ మని తెలుగుదేశం వాళ్లు కోరారు. దీంతో సురేంద్రరెడ్డి రెండో పేరుగా నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి పేరును పంపాడు. నెల్లూరు నగరం నుండి ఛైర్మెన్‌గా కోటంరెడ్డి శ్రీని వాసులురెడ్డి ఉన్నారు. ఇక ఆత్మకూరు డివిజన్‌ నుండి ఖాజా వలిని, కావలి డివిజన్‌ నుండి పాలడుగు రంగారావును డైరె క్టర్లుగా తీసుకున్నారు. ఇక నాయుడుపేట డివిజన్‌కు కూడా ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆప్షన్‌గా ఇచ్చివున్న సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి పేరును ఖరారు చేసారు. బీజేపీ వాళ్ళు ఆప్షన్‌ క్రింద ఇచ్చిన పేరే ఈరోజు ఆ పార్టీలో కుల చిచ్చును రాజేసింది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter