16 June 2017 Written by 

మూడేళ్ళు.... జిల్లాలో కనిపించని అభివృద్ధి ఆనవాళ్ళు!

barragesకలెక్షన్‌లలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 'బాహుబలి' చిత్రాన్ని చూసిన తర్వాత అదే హీరో ప్రభాస్‌ నటించిన 'బుజ్జిగాడు' సినిమాను చూస్తే ఎంత చెత్త ఫీలింగ్‌ కలుగుతుందో, 2004 నుండి 2009 వరకు బాహుబలి లాంటి వై.యస్‌. పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలకు ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి పరిపాలనా నచ్చడం లేదు. ప్రజలు వై.యస్‌. స్థాయి పరిపాలనను ఆశిస్తుంటే, ఆయన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్ర బాబునాయుడు పన్నీరు సెల్వం స్థాయి పెర్ఫార్మెన్స్‌ కూడా ఇవ్వలేకపోతున్నారు.

ముఖ్యంగా నెల్లూరుజిల్లాలోనే చూసు కుందాం. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ మూడేళ్లలో జిల్లాలో ఏం జరిగింది. జనానికి ఏం ఒరిగింది! శ్రీసిటీలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పూర్తయిన పరి శ్రమలను ప్రారంభించారు. ఇఫ్కో సెజ్‌లో వివాదాల నడుమ 'గమేషా' అనే పరి శ్రమను ప్రారంభించారు. ఈ మూడేళ్లలో సీఎం రావడానికేమో 14సార్లు జిల్లాకు వచ్చాడు. కాని... ఏం ఉపయోగం. 2015లో వరదలప్పుడు కూడా వచ్చాడు. నగరంలో వున్న ఆక్రమణలన్నింటిని తొలగించాల్సిందేనని చంఢశాసనుడి లెవల్లో ఆదేశించాడు. కాని ఏం జరిగింది. సీఎం చెప్పిన పని ఇప్పటికీ అమలు జరగలేదు.

ఈ మూడేళ్లలో జిల్లాలో చెప్పుకోదగ్గ శాశ్వత అభివృద్ధి ప్రాజెక్ట్‌లేవీ లేవు. శ్రీసిటీ సెజ్‌ ఉంటే యాజమాన్యం సొంతంగా కష్టపడి విదేశీ కంపెనీలను ఒప్పించి తెచ్చు కుంటున్న ప్రాజెక్ట్‌లు తప్పితే ప్రభుత్వ పరంగా, ప్రభుత్వం వల్ల వస్తున్న పెట్టు బడులేవీ లేవు. దక్షిణాసియాలోనే అతిపెద్ద పోర్టుగా రూపాంతరం చెందడానికి అన్ని అవకాశాలున్న పోర్టు కృష్ణపట్ణం పోర్టు. వై.యస్‌. హయాంలో ఈ పోర్టు ప్రగతి పథంలో పరుగులు తీసింది. మొత్తం 41 బెర్తులతో రూపొందాల్సిన పోర్టు... వై.యస్‌. హయాంలో వున్న స్పీడే ఆ తర్వాత కూడా ఉండుంటే ఇప్పటికి 41 బెర్తులు పూర్తయి వుండేవి. కాని ఈ మూడేళ్లలో పోర్టు పరిధిలోకి ఒక కొత్త పరిశ్రమ కూడా రాలేదు. కనీసం ప్రభుత్వ పరంగా ఈ సెజ్‌ పరిధిలోకి పెట్టుబడు లను తీసుకొచ్చే ప్రయత్నాలు జరగలేదు. ఈ మూడేళ్లలో జిల్లా మొత్తానికి ఒక్క కొత్త ప్రాజెక్ట్‌ గాని, పదిమందికి ఉద్యోగాలిచ్చే పరిశ్రమలు గాని, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు గాని వచ్చిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌ ప్రభు త్వంలో మొదలైన నెల్లూరు, సంగం బ్యారేజీలు కూడా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. జిల్లాకు చంద్రబాబు అప్పు డప్పుడు వస్తున్నాడు, పోతున్నాడు. ఉప యోగమేంటో తెలియదు. ఈ మూడేళ్లలో జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటీ లేదు.

అదే 2004లో వై.యస్‌. సీఎం అయ్యాక మూడేళ్లలోనే కృష్ణపట్నం పోర్టు పరుగులు పెట్టింది. అపాచి సెజ్‌ శంకు స్థాపన జరిగిన మరుసటి ఏడాదే ఉత్ప త్తులు ప్రారంభించింది. మేనకూరు సెజ్‌ ఒకందుకు మొదలు పెట్టినా ఇంకో రకంగా ముందుకు పోయింది. శ్రీసిటీ సెజ్‌ ఈరోజు దేశంలోనే అత్యున్నత సెజ్‌గా అభివృద్ధి చెందింది. వాకాడు వద్ద స్వర్ణముఖి బ్యారేజ్‌ కట్టుకోగలిగాం. సోమశిలలో 74టిఎంసీల పూర్తి సామర్ధ్యంలో నీటిని నిల్వ ఉంచగలిగారు.

మొదటి వై.యస్‌. మూడేళ్ల పాలన ముందు నేటి చంద్రబాబు మూడేళ్ల పాలన దిగదుడుపే!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter