Friday, 16 June 2017 12:45

అసెంబ్లీలో పడవలతో ఆట

Written by 
Rate this item
(0 votes)

galpikaఉండవల్లిలోని హైటెక్‌రత్న, సింగపూర్‌ సింహా చంద్రబాబు నివాసం. మనువడు దేవాన్ష్‌తో చంద్రబాబు బూచి ఆట ఆడు కుంటున్నాడు. వాళ్ళ ఆనందానికి అడ్డుకట్ట వేస్తూ అప్పుడే అక్కడకు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు, మంత్రులు కె.ఇ.కృష్ణ మూర్తి, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీతలు వచ్చారు. వాళ్ళ ముఖాలు సీరియస్‌గా వున్నాయి. అందరిలోనూ టెన్షన్‌ వుంది. వాళ్లను చూసి చంద్రబాబు ఏంటలా వున్నారని అడిగాడు. కోడెల రొప్పుతూ... అవతల మన పరువు పోతుంటే ఇక్కడ మీరు తీరిగ్గా బూచి ఆట ఆడుకుంటున్నారా? అని ఆవేశంగా అన్నాడు. ఏమైందని చంద్రబాబు అడిగాడు. ముందు టీవీ ఆన్‌ చేసి 'ఆత్మసాక్షి' ఛానెల్‌ పెట్టండి, ఏమైందో మీకే తెలుస్తుందని కోడెల ఇంకా ఆవేశంగా చెప్పాడు. కోడెల నోటి నుండి ఆ మాటను విన్న వెంటనే కంప్యూటర్‌ బ్రైన్‌ కలిగిన దేవాన్ష్‌ అక్కడే వున్న రిమోట్‌ తీసుకుని టీవీ ఆన్‌ చేసి నెంబర్లు నొక్కి 'ఆత్మసాక్షి' ఛానెల్‌ పెట్టేసాడు. ఆ బుడతుడు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతూ... ఇతను తాతను మించే మనువడు కాదు తాతను ముంచే మనుమడు అవుతాడని మనసులో అను కున్నారు. 'ఆత్మసాక్షి' ఛానెల్‌లో వెలగపూడిలోని అసెంబ్లీ, సచివాలయం భవనాలను చూపిస్తున్నారు. కొద్దిపాటి వర్షానికే ఉరుస్తున్న అసెంబ్లీ సచివాలయం, ప్రతిపక్ష నేత ఛాంబర్‌లోకి నీళ్లు, అసెంబ్లీ జలమయం... రాజధాని రోడ్లపై పడవల్లో తిరుగుతున్న ఎమ్మెల్యేలు... అంటూ యాంకర్‌ స్వప్న అసెంబ్లీ హాల్‌లో గొడుగు వేసుకుని తిరుగుతూ చెబుతోంది. అప్పుడే అక్కడకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌.కె. రోజా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌లు చేరుకున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ ఛాంబర్‌లో నీళ్లలో కాగితాల పడవలను వదిలి ఆడుకోసాగారు. ఆత్మసాక్షి ఛానెల్‌ రిపోర్టర్‌ దానిని షూట్‌ చేస్తుండగా యాంకర్‌ స్వప్న... చంద్రబాబు ఘోషించిన సింగపూర్‌ టెక్నాలజీ ఇదేనేమో... నిన్నగాక మొన్న కట్టిన సచివాలయంలో అప్పుడే పగుళ్లు... ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో నీళ్ళు... ఆ నీళ్ళలో కాగితం పడవలతో ఆడుకుంటున్న ఎమ్మెల్యేలు... సింగపూర్‌ అసెంబ్లీ కూడా ఇలాగే ఉంటుందా? అక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఇలాగే ఆడుకుంటారా? ఇన్ని వందల కోట్లు తగలేసి ఈ భవనాలు కట్టింది నీళ్లలో కాగితం పడవలు తిప్పుకోవడాని కేనా? అని ఆవేశంగా ప్రశ్నించింది. 'ఆత్మసాక్షి' ఛానెల్‌లో... అసెంబ్లీ, సచివాలయాలలో కుండపోత దృశ్యాలను చెన్నై, కర్నూలు వరదల కంటే భయంకరంగా ప్రసారం చేయ సాగారు. ఆ దృశ్యాలను చూస్తుంటే చంద్రబాబుకు చిర్రెత్తు కొచ్చింది. తాత ముఖంలో ఫీలింగ్స్‌ గమనించిన దేవాన్ష్‌ వెంటనే రిమోట్‌తో టీవీ ఆఫ్‌ చేసేసాడు. అప్పుడే పై అంతస్థులో నుండి లోకేష్‌ హాల్‌లోకి వచ్చాడు. లోకేష్‌ను చూడగానే పత్తిపాటి పుల్లారావు... చూసావా బాబు ఆ ఆత్మసాక్షి టీవీ వాడు ఎంత ఘోరంగా చూపిస్తున్నాడో... కొద్దిపాటి వర్షానికే సచివాలయం ఉరుస్తుందంటా... బిల్డింగ్‌ లన్నాక నీళ్ళు కారకుండా ఉంటాయా? అడుగుకు కేవలం 10వేల రూపాయలే ఖర్చుపెట్టి కట్టాం... అంతకంటే నాణ్యంగా భవనాలు కావాలంటే ఎట్లా వస్తాయని బాధ పడ్డాడు. అది విని లోకేష్‌... నేను పైన టీవీలో అంతా చూసాను, జరిగిందంతా కూడా మన మంచికే జరిగింది. వర్షాకాలంలో సచివాలయం, అసెంబ్లీ భవనాలను టార్బాలిన్‌ పట్టలతో కప్పి ఉంచుదాం, అలాగే ఈ రెండు భవనాలలో ఉరుస్తున్న చోట్ల నీటిని పట్టేందుకు పదివేల బకెట్లు కొందాం. వీటికి ఒక వంద కోట్లు మంజూరు చేస్తే సరి... మనోళ్లకు కూడా పని కల్పించినట్లుంటుందన్నాడు. లోకేష్‌ ఆలోచనకు అందరూ ఆశ్చర్యపోయారు. అంతా విన్న చంద్రబాబు... ముందు అక్కడకు వెళ్ళి పరిస్థితిని చూద్దాం పదండి... అంటూ బయటకొచ్చాడు. అక్కడ కాన్వాయ్‌లో కార్లకు బదులు పడవలున్నాయి. ఏంటివి అని చంద్రబాబు అడి గాడు. మనమిప్పుడు సచివాలయం వద్దకు పోవాలంటే ఇవే గతి అని సోమిరెడ్డి చెప్పాడు. దాంతో అందరూ నాలుగు పడవల్లో తెడ్లు వేసుకుంటూ సచివాలయం వద్దకు చేరు కున్నారు. చంద్రబాబు అసెంబ్లీ సచివాలయాన్ని చూసొచ్చాడు. వర్షపు నీళ్ళు ఎక్కడ కారుతున్నాయి, ఎక్కడ కారడం లేదన్నది పరిశీలనగా చూసొచ్చాడు. చంద్రబాబు బయటకు రాగానే మీడియా వాళ్లు చుట్టుముట్టేసారు. అసెంబ్లీలో కుండపోతపై మీ సమాధానం ఏంటంటూ కుండబద్ధలు కొట్టినట్లు అడిగారు. చంద్రబాబు ఆవేశంగా... ఆ సింగపూర్‌ కంపెనీ వాళ్ళను పిల వండి అని ఆదేశించాడు. వెంటనే సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ మీడియా ముందుకు వచ్చాడు. ఇందులో చంద్రబాబు గారి తప్పేమీ లేదు. మేము వర్షాలను దృష్టిలో పెట్టుకుని బిల్డింగ్‌లు కట్టలేదు. చంద్రబాబు సీఎంగా వుంటే వర్షాలు పడవని చాలా మంది అంటుంటే మేం దానిని నిజమనుకున్నాం. కానీ, ఇలా ఉన్న ఫళంగా వర్షం వస్తుందనుకోలేదు. వెంటనే వీటిని పడగొట్టి కొత్తవి కడతాం. కాకపోతే ఈసారి అడుగుకు 15వేలిస్తే సరిపో తుందని చెప్పాడు. అప్పుడే అక్కడకు యువరత్న బాలకృష్ణ వచ్చాడు. ఏంది గోల... ఏంది ఈ గొడవంతా అని అడిగాడు. వర్షం వల్ల వచ్చిన తలనొప్పి అని చంద్రబాబు చెప్పాడు. అప్పుడు బాలయ్య... ఓస్‌ అంతేనా? నేను గట్టిగా తొడ కొడితే వచ్చే వర్షం కూడా మధ్యలోనే అగిపోతుందన్నాడు. వెంటనే నారాయణ అతని చేతిని గట్టిగా పట్టుకుని... బాబూ... మీరు తొడ కొడితే వర్షం ఆగితే ఫర్వాలేదు... కాని ఆ సౌండ్‌కు అంతంత మాత్రంగా కట్టిన ఈ భవనాలు కూలిపోతే మీ బావగారు తలను సింగపూర్‌ సముద్రంలో దించుకోవాల్సిందే అని బ్రతిమలాడుకోసాగాడు.

Read 157 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
  • అమ్మో... దొంగల ముఠా
    కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter