16 June 2017 Written by 

16-06-2017 రాశిఫలాలు

rasi 16

1Ariesమేషం

కళా క్రీడా శాస్త్ర సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహ కరంగా వుంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలుం టాయి. సభలు, సమావేశాలు, శుభకార్యాలలో పాల్గొం టారు. పెద్ద మొత్తాలలో పెట్టుబడులు, కొనుగోళ్ళు, ఆర్ధిక లావాదేవీలు చేయవద్దు. ఆర్ధికపరమైన ఇబ్బందులుం డినను ఆదాయ లోపం రాదు. కుటుంబపరమగు సమస్యల నుండి బయటపడతారు.

 

2Taurusవృషభం

దూరప్రయాణాలు ఖరారు కాలవు. పనులందు వత్తిడి ఎక్కువగా వుంటుంది. నిర్మాణాలు, కాంట్రాక్టు పనులు నిదానంగా సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అధికారులకు స్థాన మార్పు, ఉద్యోగులకు బాధ్యతల భారం పెరుగుతుంది. విద్యావకాశాలు లభించగలవు. ఆశించినంత ఆదాయం వుండదు. పలు రకాలుగా ఖర్చుల భారం పెరుగుతుంది.

 

3Geminiమిధునం

వ్యాపార వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఉద్యోగులకు అధికారవర్గం నుండి సహాయ సహకారాలు వుంటాయి. ఉన్నత విద్యావ కాశాలు, దూర ప్రయాణాలుంటాయి. శుభకార్యాలు నిర్ణయం కావడం, ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశం దొరకడం, కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. స్థిరాస్తుల మీద ఆదాయం వుంటుంది.

 

4Cancerకర్కాటకం

దూరప్రయాణాలు చేసేవారు శ్రమపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి అభివృద్ధి వుంటుంది. ఉద్యోగ నిర్వహణ సమస్యలను దాటుకుంటారు. వాహనాలు నడిపేవారు జాగ్రత్త. విద్యావకాశాలు బాగుంటాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ సూచనలు, సలహాలు అందరూ ఆమోదిస్తారు. సోదరుల కుటుంబాలకు మేలు జరుగుతుంది.

 

5Leoసింహం

వృత్తిలో ఇబ్బదులను అధిగమించగలరు. అవసరం లేని హామీలు, రుణాలు ఇవ్వవద్దు. ఉద్యోగావకాశాలు లభించవచ్చు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. గృహోపకరణాలు కొత్తవి కొంటారు. విద్యావకాశాలు బాగుంటాయి. చేసే పనిలో ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా వుండి ఇతరులు సహాయ పడతారు. అయితే, వత్తిడి ఎక్కువగా వుంటుంది.

 

6Virgoకన్య

నిర్మాణాలు, రిపేర్ల వంటివి చేపడతారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అధికారులకు స్థాన మార్పు మరియు అదనపు బాధ్యతలుంటాయి. అనుకున్న పనులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువర్గంతో విభేదాలుంటే సర్దుబాటు కాగల అవకాశాలున్నవి. విద్యావృద్ధి అవకాశాలున్నాయి. ఆర్ధికంగా బాగుండి, ఆదాయం పెరుగుతుంది.

 

7Libraతుల

శుభకార్యాలు నిర్ణయం కావడం, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. దూరప్రయాణాల్లో శ్రమ పడతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా వుంటాయి. పిల్లలతో సమస్యలు రావచ్చును. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలు, పథకాలు అమలు చేయడానికి మంచి సమయం. కొత్త వ్యాపారాలు, కొత్త పెట్టుబడులకు అవకాశాలున్నవి.

 

8Scorpioవృశ్చికం

విద్యావకాశాలు బాగుంటాయి. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. అధికారులకు స్థాన మార్పు, ఉద్యో గులకు పనిభారం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొం టారు. వ్యవహారాలను జాగ్రత్తగా నడపండి. బంధువుల వల్ల ఇబ్బందులు రావచ్చును. వస్తు, వాహన, గృహ రిపేర్ల ఖర్చులు, అనుకోని అదనపు ఖర్చులుంటాయి.

 

9Sagittariusధనుస్సు

శుభకార్యాలలో పాల్గొంటారు. ఉన్నత విద్యావ కాశాలు లభించును. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్త వహిం చాలి. దూరప్రయాణాలుంటాయి. చేపట్టిన పనులందు చిన్న ఆటంకాలు వచ్చినా అనుకూలంగా నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాలు, తొరదరపాటు సంభాషణలు చేయకండి. కొత్త వ్యాపారాలను సంకల్పిస్తారు.

 

10Capricornమకరం

అధికారులకు స్థాన మార్పు. ఉద్యోగులకు అదనపు పనిభారం వుంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలుంటాయి. షేర్లు, స్థిరాస్తులు, పెట్టు బడులపై ఆదాయం వుంటుంది. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విద్యావకాశాలు బాగుం టాయి. అవసరాలేవైననూ కొంత రుణం చేస్తారు. స్థిరాస్తుల లావాదేవీలను వాయిదా వేసికొనడం మంచిది.

 

11Aquariusకుంభం

నిర్మాణాలు, కొత్త కాంట్రాక్ట్‌ పనులు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొనడం, దూర ప్రయాణాలుంటాయి. ప్రభుత్వ అనుమతులు, రుణాలు లభించగలవు. విద్యావ కాశాలు బాగుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ఉద్యోగు లకు ఆదరాభిమానాలు వుంటాయి. డబ్బు, వస్తువులు జాగ్రత్తపరచుకోండి. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతున్నా వత్తిడి ఎక్కువగా వుంటుంది.

 

12Piscesమీనం

ఉద్యోగులకు అధికారుల ఆదరణ అనుకూలత బావుంటుంది. కొన్ని స్థిరమైన కుటుంబ నిర్ణయాలు తీసుకొంటారు. ఉద్యోగావకాశాలు లభించగలవు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులందు అనుకూలత, బాకీలు కొంత లభించుట జరుగుతుంది. ఆర్థిక స్థితి బాగుంది. వృత్తి, వ్యాపారాలలో మంచి అవకాశాలు లభించగలవు. ఆదాయం పెరుగుతుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter