23 June 2017 Written by 

కొత్త ఎస్పీగా రామకృష్ణ

spజిల్లా ఎస్పీ విశాల్‌గున్నీని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేసారు. నెల్లూరుజిల్లా కొత్త ఎస్పీగా పిహెచ్‌డి రామ కృష్ణను నియమించారు. 13నెలల కాలంగా కడప జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఆయనను ఇక్కడకు బదిలీ చేసారు. కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన రామకృష్ణ 1998లో గ్రూప్‌-1 పోటీ పరీక్షల ద్వారా పోలీసు శాఖలో చేరారు. 2001లో డిఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. నల్గొండ, వరంగల్‌, తూర్పుగోదావరి జిల్లాల్లో డిఎస్పీగా పని చేశారు. 2007లో ఏఎస్పీగా పదోన్నది పొందారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఓఎస్‌డిగా, నల్గొండలో ఓఎస్డీగా విధులు నిర్వహించారు. 2009లో నాన్‌కేడర్‌ ఎస్పీగా పదోన్నతి లభించింది. హైదరాబాద్‌లో కౌంటర్‌ ఇంటెలిజన్స్‌, ఎస్‌ఐబి విభాగాలలో నాలుగేళ్లపాటు పని చేశారు. 2013 అక్టోబర్‌లో చిత్తూరు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అక్కడనుండి గుంటూరురూరల్‌ ఎస్పీగా వెళ్లారు. 2016 మే 11వ తేదీన కడప ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ 13నెలలు పని చేసిన అనంతరం బదిలీపై నెల్లూరు ఎస్పీగా వస్తున్నారు. విధినిర్వహణలో సమర్ధవంతంగా పనిచేయడంతో పాటు సామాజిక స్పృహ వున్న అధికారిగా రామకృష్ణకు పేరుంది. మరి నెల్లూరులో ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో చూడాలి.

ఇక ఇక్కడ నుండి బదిలీ మీద తూర్పుగోదావరికి వెళుతున్న విశాల్‌గున్నీ సినిమా ఎస్పీగా పేరు తెచ్చుకున్నారు. షోకు ఎక్కువ, సరుకు తక్కువ అన్నట్లు పనిచేశారు. ఎస్పీగా నెల్లూరులో తొలి పోస్టింగ్‌ అయినా యువకుడిగా వుండి కూడా పోలీస్‌ టెంపర్‌ చూపలేకపోయారు. నేరాల నిరోధానికి పోలీసుల్లో వుండాల్సిన శౌర్యం, ధైర్యం కంటే కంప్యూటర్‌లను, కమాండింగ్‌ కంట్రోల్‌ సెంటర్‌లనే ఎక్కువుగా నమ్ముకున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల పేరుతో పలువురు నుండి పెద్దఎత్తున ముడుపులు దండారనే ఆరోపణలు కూడా మూటగట్టుకుని వెళుతున్నారు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • ఇసుకతో ఇక్కట్లు
  నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter