23 June 2017 Written by 

'కులం' కుంపట్లో 'దేశం'

kulam2014 ఎన్నికల్లో అధికారం కోసం, తన పార్టీ గెలుపు కోసం చంద్రబాబునాయుడు ఏ కులాలనైతే రెచ్చగొట్టాడో, పదవుల పేరుతో, ప్రయోజనాల పేరుతో ఏ ప్రజలనైతే చీలగొట్టాడో అవే కులాలు ఇప్పుడు చంద్రబాబు పాలిట శాపంగా మారాయి. ఆ కులాలన్నీ చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఓ పక్క మతాలను మరచిపోదాం, కులాలను నిర్మూలిద్దా మంటూ పోరాటాలు జరుగుతుండగా, చంద్రబాబు 2014 ఎన్నికల్లో కులం కార్డులు ప్రయోగించే అధికారంలోకి వచ్చాడు. ఒక్కో కులానికి ఒక్కో రకమైన హామీ ఇచ్చారు. కులాల వారీగా కార్పొ రేషన్లు, పథకాలు చేపట్టారు. కాని, ప్రజా స్వామ్య వ్యవస్థలో కుల రాజకీయాలను ఎక్కువకాలం చేయలేరు. కులాల పరంగా ఓటు బ్యాంకును ఎక్కువకాలం నిలుపుకోలేరు.

ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఏపి రాజ కీయాలపై కుల ప్రభావం చాలా తక్కువుగా వుండేది. ఇక్కడ కులంకంటే నాయకుల గుణ గుణాలకు ప్రాధాన్యత ఉండేది. మొదటిసారి 2014 ఎన్నికల్లో చంద్రబాబు కులం కార్డును బలంగా ప్రయోగించాడు. రాష్ట్రాన్ని కులాల కాష్టంగా మార్చాడు. రిజర్వేషన్లు, కార్పొ రేషన్లు, ప్రత్యేక నిధుల పేరుతో రాష్ట్రంలోని దాదాపు అన్ని కులాలను రొచ్చులోకి దించి వున్నాడు.

ఇప్పుడు అవే కులాలు చంద్రబాబుకు కంపరం తెప్పిస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటంతో ఇప్పటికే చంద్రబాబుకు తల బొప్పి కట్టింది. చంద్రబాబు చేతిలో మోస పోయామని కాపులు ఇప్పటికే ఆగ్రహంతో వున్నారు. 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఓట్లేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ హామీని అటకెక్కించడం తెలిసిందే! కేవలం కాపు కార్పొరేషన్‌ ఒకటి ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కాపులు బాబుకు వ్యతిరేకంగా వున్నారు. కాపు రిజర్వేషన్ల పేరుతో చంద్ర బాబు బలహీన వర్గాల వారిలోనూ అల జడి రేపారు. కాపులను బీసీలలో చేర్పిస్తే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన బీసీ కులాలన్నింటికీ ఇబ్బందే! చంద్రబాబు బీసీలలో కాపులను చేరుస్తా మని హామీ ఇచ్చాకే బీసీలలోనూ చీలక వచ్చింది. బీసీలు చంద్రబాబు వ్యతిరేక మవుతున్నారు.

ఇక మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి, మాలమహానాడుల మధ్య జరుగు తున్న వర్గీకరణ పోరులో కూడా చంద్ర బాబు నలిగిపోతున్నాడు. రిజర్వేషన్‌ వర్గీ కరణకు మద్దతునిస్తారనే ఉద్దేశ్యంతో మందా కృష్ణ 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు పలికాడు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక వర్గీకరణ ఊసే లేదు. మాదిగ కులస్థులలో ఇది తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మాదిగ వర్గీయులు చంద్రబాబుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది.

ఇక తాజాగా జరిగిన సంఘటన తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా తీరని నష్టం కలిగించేదే! ఎన్నికలకు ముందు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయండని బ్రాహ్మణులెవరూ కోరలేదు. కాని అధికా రంలోకి వచ్చాక చంద్రబాబే బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. మాజీ చీఫ్‌ సెక్రటరీ, నిజాయితీపరుడైన ఐవిఆర్‌ కృష్ణా రావును దానికి ఛైర్మెన్‌గా నియమించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌గా ఆయన పని ఆయనను చేసుకోనిస్తే బాగుండేది. కాని బ్రాహ్మణ కార్పొరేషన్‌లోనూ తెలుగు దేశం రాజకీయ జోక్యం పెరిగింది. ఎప్పుడూ తటస్థంగా వివాదాలకు అతీ తంగా వుండే కృష్ణారావు కార్పొరేషన్‌పై రాజకీయ ఆధిపత్యాన్ని సహించలేకపో యాడు. దీనికితోడు సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్‌లను పోస్ట్‌ చేసాడని కృష్ణారావుపై ఆరోపణలు... ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజకీయ మైలేజీ రావడం లేదంటూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ పదవి నుండి అవమాన కర రీతిలో తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా వున్న బ్రాహ్మణులలో ఆగ్రహం కలిగిం చింది. ఐవిఆర్‌ కృష్ణారావు గౌరవప్రదమైన వ్యక్తి. ఆయనపై అందరికీ అభిమాన ముంది. అలాంటి వ్యక్తిని అవమానిస్తే బ్రాహ్మణులు వూరుకుంటారా?

ఇలా రాష్ట్రంలో చంద్రబాబు స్వార్ధం కోసం ప్రతి కులాన్ని కలబెట్టాడు. ఇప్పుడు ఆ కులాల రొచ్చులో తానూ మునిగిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter