Friday, 23 June 2017 08:01

'దేశం'లో శాంతిదూతలు

Written by 
Rate this item
(0 votes)

galpikaతన కలల రాజధాని అమరావతిలోని సచివాలయం నుండి ఉండవల్లిలోని తన ఇంటికి అప్పుడే చేరుకున్నాడు హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబునాయుడు. చంద్రబాబు హాల్‌లోకి రాగానే మనుమడు దేవాన్ష్‌ బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి తన తాత చేతికి టీవీ రిమోట్‌ అందిం చాడు. చంద్రబాబు టీవీ ఆన్‌ చేసి తనకు పెద్దగా ఇష్టంలేని ఏబిసిడి న్యూస్‌ఛానెల్‌ పెట్టాడు. అందులో ఎంపీ టీజీ వెంకటేష్‌, కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్రమంత్రి పత్తిపాటి పుల్లారావులు మీడియాతో మాట్లా డుతున్న దృశ్యాలు వస్తున్నాయి. మొదట టి.జి. మాట్లాడుతూ మా నాయకుడు చంద్రబాబు గారు దేశానికి ఎంతో సేవచేశారు. దేశం అంటే తెలుగుదేశం అనుకునేరు, భారతదేశం కన్నమాట... ఆయన సేవలను దృష్టిలో పెట్టు కుని ఆయ నను రాష్ట్రపతిని చేయాలి, అలాగే లోకేష్‌ను ఇంకో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రిని చెయ్యాలి అని చెప్పాడు. తర్వాత సుజనారాం మాట్లా డుతూ... చంద్రబాబును రాష్ట్రపతి, లోకేష్‌ను సీఎంగా చేయడంతో పాటు దేవాన్ష్‌ను కూడా మంత్రి వర్గంలోకి తీసుకోవాలి, మంత్రి కావడానికి దేవాన్ష్‌కు అన్ని అర్హతలున్నాయని చెప్పాడు. పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... మా చంద్రబాబు గాంధీమహాత్ముడంతటి వాడు. కాకపోతే ఆయన గోచీ పెట్టుకుం టాడు, ఈయన ఫ్యాంటు, షర్టు, లోపల బనియన్‌ వేసుకుంటాడు... అంతే తేడా అని చెప్పాడు. పత్తిపాటి తనను గాంధీతో పోల్చే సరికి చంద్రబాబుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాళ్ల మాటలకు కడుపు నిండిపోవడంతో పుల్కాలు తినకుండా తన బెడ్‌రూంలోకి వెళ్లి గోడకు వేలాడదీసివున్న గాంధీఫోటోను చూస్తూ... ఓ శాంతిదూత... నాలాగే మా పార్టీ నాయకులు కూడా మీ ఆశయాలను పాటించేలా ఆశీర్వదించండి స్వామి అని మన సులో వేడుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

----------

అది దెందులూరు నియోజకవర్గంలోని కృష్ణానది ఇసుక రీచ్‌ ప్రాంతం. అక్కడ ఎమ్మార్వో వనజాక్షి అక్రమ ఇసుక ట్రాక్టర్లను ఆపేసింది. ట్రాక్టర్ల యజమానులు ఆమెతో గొడవ పడుతున్నారు. అప్పుడే అక్కడకు కాళ్లకు చెప్పులు లేకుండా కాలినడకన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వచ్చాడు. ఎమ్మార్వో వనజాక్షితో గొడప పడుతున్న తన అను చరులను... నాయనా, మహిళలను గౌర వించండి, వారి పట్ల మర్యాదగా ప్రవర్తిం చండి, వారిని దూషించడం తగదు అని హితబోధ చేసాడు. కాని, వారిలో ఓ వ్యక్తి... బోచెప్పొచ్చావులే పోవయ్యా... నీ బోడి శాంతి సందేశాలు వినడానికి మేమిక్కడ గాజులు తొడుక్కుని లేం. నీ కబుర్లు చెవులు తెగినోళ్లకు చెప్పుకోపో అని కసిరాడు. అయినా చింతమనేని ప్రభాకర్‌లో ఎటువంటి కోపమూ రాలేదు. బాబూ నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఆవేశం అన్నింటికి పరిష్కారం కాదు, మనసును నిజాయితీగా ఉంచుకో, అహింసను మించిన ఆయుధం లేదు, ఆ మహిళా అధికారిణికి క్షమాపణలు చెప్పి మీ దారిన మీరు వెళ్లండి, అహింసా పరమోధర్మః అని చింతమనేని అన్నాడు. వెంటనే ఇంకో వ్యక్తి... ముందు నువ్వు పక్కకు జరుగు అంటూ చింతమనేని చేయి పట్టుకుని లాగాడు. వెంటనే చింతమనేని... నాయనా, ఒక చెంపన కొడితే రెండో చెంప చూపించమని మా గురువు బాపూజీ గారు చెప్పారు. ఇప్పుడు మీరు నా కుడి చెంపను కొట్టారు, ఇదిగో ఎడమ చెంప... దీనిని కూడా కొట్టండి... కాని మీరందరూ హింసోన్మాదాన్ని వదిలేసి అహింసాయుత మార్గంలో నడవండి... జై బాపూజీ అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు.

---------------

విజయవాడలోని రవాణాశాఖ కమిషనర్‌ కార్యాలయం. ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు అక్కడకు వచ్చారు. ముగ్గురు చేతుల్లోనూ గులాబీ పూలున్నాయి. ముగ్గురూ ఆ గులాబీ పూలను కమిషనర్‌ బాలసుబ్ర హ్మణ్యంకు ఇచ్చారు. ఏంటివి, నాకెందుకిస్తు న్నారని ఆయన అడిగాడు. నాని వుండి... సార్‌, 'శంకర్‌ దాదా జిందాబాద్‌' సినిమా చూడలేదా? అధికారులు సక్రమంగా పనిచేయనప్పుడు నిరసన తెలిపే పద్ధతి. మేమేదో కడుపు నింపుకోవడానికి నాలుగు బస్సులను ఎంతో నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా నడుపుకుంటున్నాం. మాకు తెలిసిందల్లా ప్రేమ, అహింసా, భూతదయ. మేం నూరణాల గాంధీజీ ఫాలోయర్స్‌మి. మీ డిపార్ట్‌మెంట్‌ వాళ్ళు లంచాల కోసం మా బస్సులను ఆపేస్తున్నారట. అది పద్ధతికాదు సార్‌, నిజాయితీగా ఉండమనండి, సంపా దించిన దాంట్లోనే సర్దుకుని తినండి అని హితబోధ చేశాడు. అక్కడవున్న ఓ బ్రేక్‌ ఇన్స్‌పెక్టర్‌... మీరు చెప్పే సొల్లు కబుర్లు వినడానికి మేం ఖాళీగా లేం... ముందు బయటకెళ్లండి అంటూ ఆవేశంగా అరిచాడు. బోండా వుండి... సార్‌, అంత ఆవేశమెందుకు సార్‌, దేశానికి స్వాతంత్య్రం ఆవేశం వల్ల రాలేదు సార్‌, అహింసాయుత ఉద్యమం వల్ల వచ్చింది. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదని 'నరసింహ' సినిమాలో రజనీకాంత్‌ చెప్పాడు... చూల్లేదా? రోజూ ధ్యానం, యోగా చేయండి, మనసులను ప్రశాంతంగా ఉంచు కోండి అని చెప్పాడు. బుద్దా వెంకన్న అందు కుని... ప్రశాంతంగా జీవించడంలో వున్న సుఖం ఇంకెందులోనూ లేదు, మాకు గొడవ లన్నా, వివాదాలన్నా పడవు, కాబట్టి మేం మా సమస్య చెప్పు కున్నాం, శాంతియుతంగా వెళ్ళిపోతున్నాం అంటూ వెనుదిరిగారు.

----------------

విశాఖపట్నంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌. అప్పుడే ఓ కారొచ్చి ఆగింది. శాంతి స్వరూప్‌ బిరుదాంకితుడు, ఎంపి జేసీ దివాకర్‌రెడ్డి దిగాడు. నేరుగా ఇండిగో విమాన సంస్థ కౌంటర్‌ వద్దకు వెళ్లి సెల్‌ఫోన్‌లో తన టికెట్‌ బుకింగ్‌ మెసేజ్‌ చూపించి బోర్డింగ్‌ పాస్‌ అడిగాడు. అక్కడున్న సిబ్బంది... సారీ సార్‌, టైం అయిపోయింది. అయినా, ఇంత లేటుగా వచ్చారేమిటి అని అడిగారు. జేసీ తల పట్టుకుని... అయ్యో, ఈ చైనా వాచీని నమ్ముకుని ఎంత తప్పు చేసాననుకుంటూ... వారితో... సారీ తమ్ముడు... నిన్న నా ఫ్రెండ్‌ చైనా నుండి వస్తూ ఈ చేతి గడియారం తెచ్చాడు. దీంట్లో చైనా టైమే వుంది... నేను దీనిని నమ్ముకుని లేటుగా వచ్చాను. ఏం చేస్తాం, రోడ్డు గుండా వెళ్లిపోతాలే అని అన్నాడు. అందుకు అక్కడున్న సిబ్బంది... సారీ, మీరు పార్లమెంటు సభ్యులు... ఎంపీలలో మీ అంత శాంతి స్వభావులను ఇంకెక్కడా చూడలేదు, మీ కోసం కంపెనీ అధికారులతో మాట్లాడి విమానాన్ని అరగంట ఆపించే ప్రయత్నం చేస్తామన్నారు. అప్పుడు జేసీ వారి చేతులు పట్టుకుని... వద్దు తమ్ముడు, నా ఒక్కడి కోసం వందలమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం నాకిష్టముండదు. నేను లేట్‌గా వచ్చి తప్పు చేసాను, తప్పుకు ప్రాయ శ్చితం అనుభవించాల్సిందేనని మా గురువు గారు చెప్పారు. నేను తప్పు చేస్తే స్వర్గంలో వున్న ఆయన ఆత్మ నన్ను క్షమించదు. మా దివాకర్‌ గాడేందిరా ఈ పనిచేసాడనుకుం టాడని అన్నాడు. ఎవరు సార్‌ ఆ గురువుగారు అని సిబ్బంది అడిగారు. ఇంకెవరు గాంధీజీ అని జేసీ చెప్పాడు. ఆయనకు మీకు సంబం ధమేంటని సిబ్బంది అడిగారు. ఐదో తరగతిలో ఆయన గురించి వచ్చిన పాఠం చదువుకున్నాలే... అప్పటినుండి ఆయనతో నాకు మంచి ఫ్రెండ్‌షిప్‌... హేరామ్‌ అని అరిచాడు... అంతే ఆ క్షణంలోనే హేరామ్‌ హేరామ్‌ అంటూ చంద్రబాబు అరవసాగాడు. ఆ అరుపుకు ఉలిక్కిపడి భువనేశ్వరీదేవి లేచింది. హేరామ్‌ అని పదే పదే అరుస్తున్న చంద్రబాబు ముఖం మీద నీళ్లు చల్లింది. దెబ్బకు ఆయన లేచి కూర్చున్నాడు. ఏమైంది... ఎందుకు 'హేరామ్‌' అంటూ అరిచారు అని ఆమె అడిగింది. చంద్రబాబు తేరుకోవడానికి పది నిముషాలు పట్టింది. చింతమనేని ప్రభాకర్‌, కేశినేని నాని, జేసీ దివాకర్‌రెడ్డి సంఘటనలన్నీ తనకు కలలో వచ్చాయని గ్రహించాడు. అప్పుడు ఆయన భువనేశ్వరీదేవితో... రాత్రి గాంధీ గారిని గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. మన పార్టీ నాయకులందరూ గాంధీ బాటలో నడుస్తు న్నట్లు కల వచ్చిందని చెప్పాడు. అది విని భువనేశ్వరీ... మీ మైండ్‌సెట్‌కు సెట్‌కాని వ్యక్తుల గురించి ఆలోచిస్తే ఇలాంటి కలలే వస్తాయి. బంగారం లాంటి నిద్రను చెడగొట్టారు, ఇక పడుకోండి అని చెప్పి ఆమె తిరిగి నిద్రలోకి జారుకుంది. చంద్రబాబు మాత్రం పడుకుంటే మళ్ళీ కలలో ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందోనని అలాగే మేల్కొని జాగారం చేశాడు.

Read 114 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter