30 June 2017 Written by 

కల్పవృక్షం, కామధేనువు లాంటి చెక్‌పోస్ట్‌కు చెక్‌!

checkostబి.వి.పాలెం ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌... ఇప్పటివరకు ఇది ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు తనిఖీ కేంద్రం. జూలై 1వ తేదీ నుండి ఇది ఇక చరిత్ర గర్భంలో కలిసిపోనుంది. జూలై 1వ తేదీ నుండి జిఎస్‌టి అమలులోకి రానుండడంతో ఈ చెక్‌పోస్ట్‌ కథ ముగిసిపోనుంది.

నిజంగా ఈ చెక్‌పోస్ట్‌ది పెద్దచరిత్రే అనుకోవచ్చు. ఈ చెక్‌పోస్ట్‌ వద్ద ఇంత కాలం వాణిజ్యపన్నులు, రవాణా, పోలీసుశాఖాధికారులు విధులు నిర్వహిస్తుండేవాళ్ళు. ఈ చెక్‌పోస్ట్‌ వద్ద పోస్టింగ్‌ కోసం ఆయా శాఖల్లో పైరవీలు బాగానే జరిగేవి. ఇక్కడ పోస్టింగ్‌ అంటే రోజూ మంచి రాబడి వున్నట్లే! పైఅధికారులకు లక్షల్లో లంచాలు ఇచ్చి ఇక్కడ పోస్టింగ్‌ వేయించుకునేవాళ్ళు. భారీగా ముడుపులు ముట్టజెప్పడంతో పాటు రాజకీయంగా పలుకుబడివున్న వాళ్ళకే ఇక్కడ పోస్టింగ్‌ పడేది. ఇక్కడ పని చేసిన చిన్న ఉద్యోగులు కూడా కోట్లలో సంపాదించివున్నారు. ఈ చెక్‌పోస్ట్‌ మీద ఎన్నిసార్లు అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేసారో లెక్కేలేదు. అయినా ఇక్కడ అవినీతి అన్నది ఎప్పుడూ మూడు పువ్వులు, ఆరు కాయలుగానే సాగుతుం డేది. ఎన్నోఏళ్లుగా ఎన్నో వేలమంది అధి కారులు, సిబ్బందిని లక్షాధికారులను, కోటీశ్వరులను చేసిన ఈ చెక్‌పోస్ట్‌ ఇక గత అవినీతి చరిత్రకు సాక్ష్యంగా మిగిలిపోనుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter