Friday, 30 June 2017 08:58

కావలి వైకాపాలో... చిచ్చుపెట్టిన మేకపాటి!

Written by 
Rate this item
(0 votes)

ycpsనెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పెద్దగా మాట్లాడడు. మాట్లాడిన చోట ఏదో ఒక వివాదం తెస్తుంటాడు. ఇంకా ఎన్నికలకు దాదాపు రెండేళ్ల గడువుంది. అప్పటికి ఎవరు ఏ పార్టీలో వుంటారో, ఏ సీటును ఎవరు తెచ్చుకుంటారో తెలియదు. అప్పటి రాజకీయ పరిణామాలను ఇప్పుడే వూహించలేము. కాబట్టి ఫలానా సీటు ఫలానా ఆయనకే అని చెప్పడం కరెక్ట్‌ కాదు. అది కూడా మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పడం సముచితం కాదు. ఆయన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి అధ్యక్షుడు కాదు పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి. పార్టీ అధ్యక్షుడే అభ్యర్థుల విషయమై నోరెత్తడం లేదు. ఇప్పుడంత అవసరం కూడా లేదు. ముందు చేయాల్సిన పని పార్టీని పటిష్టం చేయడం. ప్రభుత్వ బలహీనతల్ని ప్రజల్లో బాగా ప్రచారం చేసి ప్రయోజనం పొందడం. మేకపాటి ఆ విషయాన్ని వదిలేసి ఇతర విషయాల మీద మనసు పెడుతున్నాడు.

కావలి నియోజకవర్గ ప్లీనరీలో వచ్చే ఎన్నికల్లోనూ సిటింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డే అభ్యర్థిగా వుంటాడని ఎంపి మేకపాటి ప్రకటించడం నియోజకవర్గం లోని పార్టీ నాయకుల మధ్య చిచ్చు రేపింది. రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డికి అప్పుడే మీరు సీటు ఎలా ఖరారు చేస్తారంటూ మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డిలు నిరసన గళం విప్పారు. వీళ్లిద్దరు కూడా కావలి టిక్కెట్‌ రేస్‌లో వున్నారు. అసెంబ్లీ సీటన్నాక ఒకరికి నలుగురు నాయకులు ప్రయత్నించడం సహజం. అయితే ఎన్నికల సమయంలో వివిధ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వుంటుంది. అలా ఒకరిని ఎంపిక చేసే టప్పుడు మిగతా ఆశావాదులను పిలిపిం చుకుని మాట్లాడి ఒప్పించాల్సి వుంటుంది. వారు కూడా పార్టీ కోసం పనిచేస్తేనే కదా అభ్యర్థి గెలిచేది. ఒక అభ్యర్థి ఎంపికలో ఇంత తతంగం ఉంటుంది. అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తేనే మిగతా నాయకులు అంగీకరిస్తారు. అంతేగాని పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడానికి రాజమోహన్‌రెడ్డి ఎవరు? వచ్చే ఎన్నికల్లో ఆయన సిటింగ్‌ సీటే ఆయనకు గ్యారంటీ వుండదు. ఆయన ఇంకొకరి సీటును ఖరారు చేయడమేమిటి? ఇలాంటి నోటి దూలే ప్రశాంతంగా వున్న పార్టీలో వర్గ చిచ్చు రేపుతుంది.

2014 ఎన్నికలప్పుడు కూడా మేకపాటి జిల్లా పార్టీలో ఇలాంటి కంపునే రేపాడు. అధిష్టానంతో సంబంధం లేకుం డానే పలువురు నాయకులకు సీట్లిస్తానని హామీ ఇచ్చి వారిని రెచ్చగొట్టాడు. నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వ్యతి రేకంగా ఆనం వెంకటరమణారెడ్డిని, నెల్లూరు నగరంలో అనిల్‌కుమార్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా అజీజ్‌ను, వెంకట గిరిలో కొమ్మి లక్ష్మయ్యనాయుడుకి బదు లుగా మరో నాయకుడిని ఆయన రెచ్చ గొట్టాడు. సీట్లిప్పిస్తానని వాళ్ళను తన చుట్టూ తిప్పించుకున్నాడు. దానివల్లే ఆరోజు పార్టీలో అంతర్గత కలహాలు వచ్చాయి. మళ్ళీ మేకపాటి గతంలో చేసిన పొరపాటునే పునరావృతం చేస్తున్నాడు. ఇది ఎంతమాత్రం పార్టీకి మంచిది కాదు.

Read 1033 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter