07 July 2017 Written by 

అడ్డం తిరిగిన సదావర్తి

hig cour'సదావర్తి'... ఈ పేరును రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇప్పటికే జనం నోళ్ళలో నానుతోంది. మన రాజకీయ పక్షాలు అలా నానేలా చేసాయి కూడా. చెన్నైకి సమీపంలో 83.11 ఎకరాల సదావర్తి సత్రం భూముల వేలంకు సంబంధించి కీలకమలుపు చోటు చేసు కుంది. సదావర్తి సత్రం భూములపై ఉమ్మడి హైకోర్టు తెలుగుదేశం నాయకు లకు దిమ్మతిరిగే షాకిచ్చింది.

సదావర్తి భూములను వేలం పాటల్లో దక్కించుకున్న మొత్తానికి ఎవరైనా అదనంగా 5కోట్లు చెల్లిస్తే వారికే సదావర్తి భూములను కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సవాల్‌ చేసింది. ఆ సవాల్‌కు మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. దీనిపై హైకోర్టు కెక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు సదావర్తి భూములకు అదనంగా 5కోట్లు చెల్లించేందుకు తాము సిద్ధంగా వున్నామని హైకోర్టుకు తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఆళ్ల పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం వేలంపాట మొత్తం 22.44కోట్లకు మరో 5కోట్లను జత చేసి 27.44 కోట్లను నాలుగు వారాల్లోగా చెల్లించి భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా పది కోట్లు జమ చేయాలని ఆదేశించింది. ఒకవేళ అలా నిర్ణీత గడువులోగా చెప్పిన డబ్బు జమ చేయకపోతే పిటిషనర్‌కు కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం కూడా వున్నట్లు తెలుస్తోంది.

సదావర్తి భూములపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ పెద్దలకు దిమ్మ తిరిగినట్లయ్యింది. గుంటూరు జిల్లా అమరావతిలోని అమర లింగేశ్వరస్వామి వారి సదావర్తి సత్రానికి చెందిన ఈ 83.11 ఎకరాల భూములు ఆక్రమణలో ఉన్నాయని చెప్పి గతేడాది మార్చిలో వేలం పాటల ద్వారా అనుయాయులకు కట్టబెట్టారు. మార్కెట్‌ రేటు ప్రకారం అక్కడ ఎకరా 6కోట్లు దాకా పలుకుతోందని. కాని ప్రభుత్వం ఎకరా ధరను 50లక్షలుగా మాత్రమే నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పెద్దల స్కెచ్‌తో కొందరు కుమ్మక్కై ఆ భూములకు అంత రేటు పెట్టకుండా ఎకరా ధరను 27లక్షల నూటఎనభై ఎనిమిది రూపాయలుగా నిర్ణయించారు. ఇలా మొత్తం 83.11 ఎకరాలను 22కోట్ల 44లక్షల 12వేల 625 రూపాయలకు కొంతమంది వ్యక్తులు అధికారపార్టీ వారి అండతో దక్కించుకున్నారు. అయితే దీనిపై ప్రతిపక్ష వైకాపా స్పందించింది. వందల కోట్లు విలువ చేసే భూములను నామమాత్రం ధరకే కట్టబెట్టారంటూ పోరాటానికి దిగింది. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే పట్టు విడవకుండా పోరాడాడు. చివరకు న్యాయపోరాటం ద్వారా తెలుగుదేశం పెద్దలకు చుక్కలు చూపించాడు. రేపు రామకృష్ణారెడ్డి తాను కాని, తన మనుషుల ద్వారా కాని అదనంగా 5కోట్లు చెల్లించి సదావర్తి భూములను విడిపిస్తే తెలుగుదేశం నాయకులు చేతిలో పడ్డ బంగారు బంతి జారిపోయినట్లుగా ఫీల్‌ కావడం ఖాయం.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter