07 July 2017 Written by 

సమర్ధతకు గుర్తింపేది?

mettuఆయన తెలుగుదేశం నాయకుడు... అంతకుముందు ఆయన కాంగ్రెస్సే... కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ గల్లంతు కావడంతో ఆయన ఆ పార్టీలో ఉండలేక అధికార తెలుగుదేశంలో చేరిపోయారు. అయితే ఆయన తెలుగుదేశంలో చేరాడన్న మాటేగాని తెలుగుదేశం నాయకులు ఆయనను తమ పార్టీవాడిగా చూస్తున్నట్లు లేదు. వీళ్లు పట్టించుకోకుండా పోవడానికి ఆయన వార్డు స్థాయి నాయకుడో, మండలస్థాయి నాయకుడో కాదు, జిల్లా స్థాయి పదవిలో వున్న నాయకుడు. జిల్లాలోని ప్రతి మండలంతో, ప్రతి గ్రామంలోని రైతుతో సంబంధాలు కలిగివున్న నాయకుడు. ఆయనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యఅను చరుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 2013లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల తర్వాత ఆనంను కాదనుకుని తెలుగుదేశంలో చేరారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌గా ఎటువంటి అవినీతి ఆరోపణ లకు ఆస్కారం లేకుండా సమర్ధవంతమైన పాలనను అందిస్తు న్నారు. బ్యాంకులో సంస్కరణలు చేపట్టారు. బ్యాంకును ఆధునీ కరణ పట్టాలెక్కించారు. జిల్లా వ్యాప్తంగా కొత్తబ్రాంచ్‌లతో పాటు రైతులకు సౌకర్యాలు పెంచారు. బ్యాంకు ద్వారా రైతులకు అందించే సేవలను మెరుగుపరిచారు. మెట్టుకూరు ధనుంజయరెడ్డి బ్యాంకు ఛైర్మెన్‌గా పనిచేస్తున్నా అనధికారికంగా తెలుగుదేశం నాయకుడిగా, ఆ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నట్లే లెక్క. ఒక ఎంపీ ఏడు అసెంబ్లీల పరిధిలో మాత్రమే పని చేయగలడు. ఒక ఎమ్మెల్యే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం. కాని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ జిల్లాలోని 10అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రైతులపై ప్రభావం చూపగలడు. అంతే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అవసరమైన నాయకుడు కూడా! ఇటు సొంత నియోజకవర్గం ఆత్మకూరుతో పాటు పక్క నియోజకవర్గమైన వెంకటగిరిలో కూడా బలం, బంధుత్వం వుంది. ఆర్ధికంగానూ ప్రత్యర్ధిని ఢీకొట్టే సత్తావున్న నాయకుడు. రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబు వాడుకో దగ్గ ఆయుధం ధనుంజయరెడ్డి.

అధికారికంగానూ, రాజకీయంగానూ ఇంత ప్రాధాన్యతగల పదవిలో వున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌కు తెలుగు దేశంపార్టీలోనే సరైన ప్రాధాన్యత లభించడం లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన 'నుడా' ఛైర్మెన్‌ ప్రమాణస్వీకారోత్సవంతో పాటు మినీ మహానాడు కార్యక్రమంలోగాని, పార్టీ పరంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలప్పుడు గాని ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీకటౌట్‌లలో, వాల్‌పోస్టర్‌లలో, పత్రికా ప్రకటనలలో ఆయన ఫోటోను ఎక్కడా వేయడం లేదు. చిన్న చిన్న పదవులున్న నాయకులకు, మాజీలకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ హోదాకు ఇస్తున్నట్లుగా లేదు. దీనినిబట్టి చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఆయనను తమ పార్టీ నాయకుడిగా కా, ఇంకా కాంగ్రెస్‌ నాయకుడిగానే పరిగణిస్తున్నారేమోననే అనుమానాలొస్తున్నాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter