07 July 2017 Written by 

విషం కక్కుతున్న డ్రాగన్‌

china indiaభారత్‌-చైనా సరిహద్దుల్లో మాటల యుద్ధం రగులుకుంటోంది. సరిహద్దుల్లో సమస్యకు సరైన పరిష్కారం కనుగొనకపోతే భారత్‌పై చైనా యుద్ధానికి కూడా దిగవచ్చునంటూ చైనా విశ్లేషకులు హెచ్చరించేదాకా పరిస్థితి వచ్చింది. సిక్కిం సెక్టార్‌లోని డోక్‌లామ్‌ ప్రాంతం భూటాన్‌ పరిధిలోకి వస్తుందని, అక్కడ చైనా సైన్యం రోడ్డు నిర్మించడమంటే భారత్‌-చైనా సరిహద్దుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఉన్న యథాతథ స్థితిని అతిక్రమించడమేనని భారత్‌ వాదన. అయితే, డోక్‌లామ్‌ ప్రాంతం తమదేనని, తమ భూభాగంలోకి జొరబడిన భారత సైనికులు వెనక్కి తగ్గాల్సిందేనని చైనా హెచ్చరిస్తోంది. దీనిపై మాటామాటా పెరిగి మాటల యుద్ధం దాకా వస్తోంది.

చరిత్రను చూసి పాఠాలను నేర్చుకోండంటూ 1962 నాటి యుద్ధాన్ని చైనా ప్రస్తావిస్తే, ఇప్పటి భారత్‌ 1962 నాటి భారత్‌ కాదు.. అని భారత్‌ సమాధానం. 'అవును. నిజమే.. ఇప్పుడు చైనా కూడా వేరు'.. అని చైనా అంటోంది. చైనా కవ్వింపు ధోరణి అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎంతోకాలంగా ఇరుదేశాలూ సఖ్యంగా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో భారత్‌- చైనాల మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. గతంలో కంటే సంబంధాలు ఇప్పుడు అంత సఖ్యంగా వుం డడం లేదు. సిక్కిం సరిహద్దులో వున్న డోక్‌లామా ప్రాంతంలో 2012లో భారత్‌ నిర్మించివున్న వున్న బంకర్లను తొలగించాలని చైనా కోరగా, భారత్‌ తిరస్కరించడం.. అందుకు ఆగ్రహించిన చైనా ఆ బంకర్లను కూల్చివేయడంతో వివాదం రాజుకుంది. ఆ తర్వాత చైనా సైనికులు డోక్‌లామ్‌లో రహదారిని నిర్మించే ప్రయత్నం చేస్తుండగా భారత సైనికులు అడ్డుకోవడంతో ఈ వివాదం మరింతగా జటిల మైంది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న ఈ సరి హద్దు వివాదం ఇప్పుడు సరిహద్దుల్లో మరింత ఉద్రిక్త తను పెంచుతోంది. అయితే, తొలినుంచీ భారత్‌పై చైనాకు కంటగింపే ఉంది. ఒకవైపు భారత్‌తో చెలిమి చేస్తూనే, మరోవైపు ఏదోవిధంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉండడం దాని నైజం. అనేక సందర్భాల్లో అది రుజువైంది. ఆ దేశాధ్యక్షుడు భారత్‌లో స్నేహంగా పర్యటిస్తూనే వున్న సందర్భంలో కూడా చేసుకున్న బాసలను అతిక్రమించి సరిహద్దుల్లో చైనా బలగాలు భారత్‌ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నంచేసిన సందర్భాలున్నాయి. అంతేకాదు, భారత్‌పై నిరంతరం ఉగ్రవాద విషసర్పాలను వదులుతున్న పాక్‌కు అన్నివిధాలుగా అండదండలందిస్తోన్న చైనాకి ఇటీవలికాలంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ప్రతిష్ట కంటగింపుగానే ఉంది. అమెరికాలో భారత ప్రధాని మోడీకి అఖండస్వాగతం లభించిన తర్వాత చైనా మరింత అక్కసుతో ఉంది. భారత్‌పై మరింతగా కారాలు మిరియాలు నూరడమే పనిగా పెట్టుకుంది. అందులోనూ అగ్రరాజ్యమైన అమెరికాతో భారత్‌ దోస్తీని చైనా ఎంతమాత్రమూ సహించలేకపోతోంది. అందుకే అంతర్జాతీయస్థాయికి చెందిన అనేక విషయాల్లో భారత్‌ మాటను చైనా అసలు ఖాతరు చేయడం లేదు. ముఖ్యంగా ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు సాగించే విషయంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నా చైనా మాత్రం భారత్‌కు వ్యతిరేక వాదనలే వినిపిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన జైష్‌ ఏ మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించాలని భారత్‌ ప్రయత్నిస్తుంటే, అందుకు చైనా అడ్డుచక్రం వేస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయస్థాయిలో 48 దేశాల కూటమి అయిన న్యూక్లియర్‌ సప్లయిర్స్‌ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం వచ్చేందుకు అనేక దేశాలు సహకరిస్తున్నా, చైనా మాత్రం భారత్‌కు ఆ సభ్యత్వం లేకుండా చేసేందుకు లేనిపోని సాకులు చెప్తూ మోకాలడ్డుతోంది. మరోవైపు, భూటన్‌, నేపాల్‌ దేశాలకు భారత్‌ చేయూతనివ్వడంపై కూడా చైనా భారత్‌పై గుర్రుగానే

ఉంది. భారత్‌ సముద్రజలాల చుట్టూ ఓడరేవులను, నౌకాదళ స్థావరాలను నిర్మించుకోవడం..తద్వారా భవిష్యత్తులో భారత్‌ను భయపెట్టేందుకేనని వేరే చెప్పనక్కరలేదు. అందుకే, పాకిస్తాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో చైనా ముందస్తుగా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోందన్న విషయం ప్రపంచానికి తెలిసిందే. నేపాల్‌, భూటాన్‌లు భారత్‌పై ఆర్ధిక అవసరాలకు, రక్షణావసరాలకు ఆధారపడివున్న నేపథ్యంలో, చైనా అందుకు సహించక ఆ రెండు దేశాలను భారత్‌నుంచి దూరం చేసేందుకు భారత్‌పై రకరకాల విమర్శలు చేస్తూనే వుంది. తొలినుంచి తొందరపాటు తత్వం భారత్‌కు లేదు కనుకనే, చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలతో భారత్‌ ఎంతోకాలం నుంచి మంచి స్నేహ భావంతోనే ఉంటోంది.

ప్రధాని మోడీ రాకతో అటు అమెరికా నుంచి ఇటు భూటాన్‌ దాకా అనేక దేశాలు భారత్‌తో మంచి స్నేహసంబంధాలు కోరుకుంటున్న నేపథ్యంలో, ఇవన్నీ చైనాకు కంటగింపుగానే ఉంటున్నాయి. కేవలం ఆధిపత్యం కోసమే ఆరాటపడుతూ, మంచి స్నేహాన్ని సైతం అర్ధం చేసుకోకపోగా, అపార్ధం చేసుకోవడం వల్లే చైనాకు అసహనం కలుగుతోంది. మాటలతో తూటాలు పేల్చడం, కయ్యానికి కాలుదువ్వడం, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వంటివి చైనాకు వెన్నతో అబ్బిన విద్య కనుక, రెచ్చ గొట్టే ధోరణితోనే ఏదోఒకరకంగా అవతలివారిని గుంతలోకి లాగాలన్న ఆలోచన సహజమే. అయితే, అలాంటి మాయమాటల్లో పడక తెలివిగానే ఈ సమస్యను అధిగమించాల్సి ఉంది.

ఏదేమైనా, యుద్ధం అనేది.. ఎవరికీ... ఏనాటికీ మంచిది కాదు. యుద్ధంతో విధ్వంసం జరుగుతుందే తప్ప సమస్యలు ధ్వంసం కావు. ప్రపంచమంతా శాంతిని, ప్రగతినీ కోరుకుంటుంటే..ఇంకా ఈ అధునాతన కాలంలో కూడా ఘర్షణలు, యుద్ధాలంటూ విద్వేషాలు పెంచుకోవడం ఏ దేశానికీ మంచిది కాదు.

ఇరుదేశాలవారూ సహనం వీడక.. సంయమనంతో.. సుహృద్భావ వాతావరణంలో శాంతియుతంగా.. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • ఇసుకతో ఇక్కట్లు
  నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…

Newsletter