Friday, 07 July 2017 07:53

ప్రాణాలు తీస్తున్న పందేలు!

Written by 
Rate this item
(0 votes)

cricketబ్రతుకులు డొల్ల... భవిష్యత్‌ గుల్ల

క్రికెట్‌... ఆడేవాళ్ళకు డబ్బులు, చూసేవాళ్ళకు ఆనందం... ఈ క్రికెట్‌ ప్రపంచంలో ఆడేవాళ్ళు చూసేవాళ్ళు కాకుండా ఇంకో జాతి వుంది. అదే బెట్టింగ్‌ జాతి. క్రికెట్‌ను అందరూ ఆటగా చూస్తే ఈ బెట్టింగ్‌ జాతి మాత్రం జూదంగా చూస్తుంది. ప్రపంచంలోనే ఈరోజు క్రికెట్‌ పెద్ద జూదమైపోయింది. ఆ జూదంలో వేలకోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. వాస్తవానికి క్రికెట్‌ ఆట ద్వారా ఆయా జట్లకు, ఆయా దేశాల క్రీడా సంఘాలకు వచ్చే ఆదాయం కంటే కూడా ఒక మ్యాచ్‌ జరిగితే బుకీలకే వస్తున్న ఆదాయం ఎక్కువ. అంతగా విస్తరించిపోయింది క్రికెట్‌ జూదం.

క్రికెట్‌ బెట్టింగ్స్‌ ఎంతోమంది బ్రతుకులను బస్టాండ్‌ పాల్జేస్తున్నాయి. భవిష్యత్‌ను చిదిమేస్తున్నాయి. క్రికెట్‌ పందేల మత్తులోపడి మన జిల్లాలోనే ఆస్తులను కర్పూరంలా కరిగించిన వాళ్లున్నారు. బెట్టింగ్స్‌లో అప్పులపాలై చేస్తున్న వ్యాపారాలను, వున్న ఊరిని వదిలేసి పరారైన వారున్నారు. ఆఖరకు బెట్టింగ్‌ల మూలంగా బైక్‌ల దొంగతనాలకు పాల్పడి పోలీసులకు దొరికినవాళ్ళు కూడా వున్నారు.

కాగా, ఇటీవల జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో క్రికెట్‌ బెట్టింగ్స్‌ మూలంగా ఓ కుటుంబమే బలైపోయింది. క్రికెట్‌ బుకీల వేధింపులకు తట్టుకోలేక ముగ్గురు ఈ లోకాన్నే విడిచి వెళ్లారు. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో నివసిస్తున్న మల్లిఖార్జున, అతని భార్య మాధురి, కుమారుడు ప్రణబ్‌తో ఇటీవల విహారయాత్రలకని తమిళనాడులోని రామేశ్వరంకు వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌ గది అద్దెకు తీసుకుని దిగారు. ఈ నెల 1వ తేదీ రాత్రి భార్యాభర్తలిద్దరూ విషం తాగి, కొడుకు గొంతులోనూ విషం పోశారు. తండ్రి కొడుకులు లాడ్జి గదిలోనే మృతి చెందగా, మాధురి మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. వీళ్ల ముగ్గురి చావుకు ఓ క్రికెట్‌ బుకీ వేధింపులే ప్రధానకారణంగా తెలుస్తోంది. ఓ రాజకీయపార్టీకి చెందిన ఈ బూకీకి నెల్లూరు నగరంలో జూదస్థావరాల నిర్వాహకుడిగా పేరుంది. పేరుకు ఒక పార్టీలో వున్నప్పటికీ అన్ని పార్టీల వారితోనూ ఇతనికి పరిచయాలుంటాయి. క్రికెట్‌ పందేలను నిర్వహించడం, బెట్టింగ్స్‌ ఓడిపోయిన వారి నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం చేస్తుంటారు. మల్లిఖార్జునకు కూడా బుకీ నుండి ఇటువంటి వేధింపులే ఎదురయ్యాయి. బుకీ ప్రతిరోజూ ఇంటికెళ్లి అవమానకర రీతిలో తిట్టొచ్చేవాడు. ఈ అవమానాలు భరించలేకే మల్లిఖార్జున భార్యాబిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నమెంట్స్‌, ఐపిఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు జిల్లాలో భారీఎత్తున బెట్టింగ్స్‌ సాగుతున్నాయి. కొందరు బుకీలు వీటిని నిర్వహిస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్స్‌ మూలంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అమాయకులు ఆస్తులను కాజేసుకుంటున్నారు. క్రికెట్‌ బెట్టింగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సి వుంది. ఇకముందు ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సివుంది.

Read 867 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
    నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter