Friday, 07 July 2017 08:02

మద్యంపై మరో దండయాత్ర

Written by 
Rate this item
(0 votes)

madyam pi yudhamకొత్త ఎక్సైజ్‌ పాలసీ పుణ్యమా అని మద్యంపై మరోసారి మహిళలు రోడ్డెకాల్సి వచ్చింది. మద్యం షాపులకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. వీధుల్లో మద్యం షాపులు వద్దంటూ మహిళలు చేస్తున్న పోరాటాలు చూస్తుంటే... 1992 నాటి సారా వ్యతిరేకోద్యమం గుర్తుకువస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం షాపులను సుప్రీం కోర్టు నిషేధించడంతో ఈ షాపులన్నీంటిని కూడా యజమానులు జనావాస ప్రాంతాల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే తమ ఇళ్ళ మధ్య మద్యం షాపులేంటంటూ స్థానికులు, ముఖ్యంగా మహిళలు తిరగబడ్డారు. పలు ప్రాంతాల్లో మద్యం వ్యాపారులకు, మహిళలకు మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.

జనావాసాలు, విద్యాసంస్థలు ఉండే తమ ప్రాంతాల్లో మద్యం దుకాణం వద్దనేవద్దంటూ మహిళలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి మద్దతుగా నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆందోళనలో పాల్గొని మద్యం దుకాణం వద్ద బైఠాయించారు. మద్యం దుకాణం తక్షణమే తొలగించాలని లేని పక్షంలో ఆందోళన సాగిస్తామని హెచ్చరించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ ఆందోళనతో మూడు రోజుల్లో దుకాణం తొలగిస్తానని మద్యం దుకాణం యజమాని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే, స్థానికులు శాంతించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో జాతీయ రహదారికి 500మీటర్ల అవతల మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో అయ్యప్ప గుడి సమీపంలో మద్యం దుకాణాన్ని రెండురోజుల క్రితం తల్పగిరి కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలో ఎక్కడా మద్యం దుకాణాలు లేకపోవడంతో మద్యంప్రియులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుని మందు కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయాన్ని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంగళవారం సాయంత్రం పెద్దఎత్తున మహిళలు, స్థాని కులు కలిసి మద్యం దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు. నర్సింగ్‌ కళాశాల, జనావాసాలు ఉండే ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఏంటంటూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించి దుకాణం ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని, సుప్రీంకోర్టు నిబంధనలు అనుసరించి దూరప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోమంటే వాటిని జనావా సాల మధ్య ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మద్యం దుకాణాల కోసం ఆటోనగర్‌ మాదిరిగా మద్యంనగర్‌ అని ఒక కాలనీ ఏర్పాటు చేసి దుకాణాలన్నీ అక్కడకు తరలించాలని డిమాండ్‌ చేశారు. మహిళలు, విద్యార్థినులు ఉన్న ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేస్తే వారికి రక్షణ కరువవుతుందని, దీనికి అధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంద న్నారు. ఈ ఆందోళనతో దుకాణం యజ మాని వెంకటేష్‌ అక్కడకు చేరుకుని చర్చలు జరిపారు. తాను లక్షలు వెచ్చించి అన్ని అనుమతులతో దుకాణం ఏర్పాటు చేసు కున్నానని, ఒక్కరోజుకే మూసేస్తే తీవ్రంగా నష్టపోతానని తెలిపారు. మానవతా దృక్ఫ థంతో తనకు మూడురోజులు అవకాశం ఇస్తే ఉన్న సరుకుని విక్రయించేసి దుకా ణాన్ని తొలగిస్తానని ఎమ్మెల్యేకు, ప్రజలకు హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. ఆందోళనలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయిదన నగర సిఐ మంగారావు, ఎస్సై విజయ్‌కుమార్‌ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దిలీప్‌ నర్సింగ్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ ప్రభుదాస్‌, కార్పొరేటర్‌ బొబ్బల శ్రీనివాసయాదవ్‌, టిడిపి, లోక్‌సత్తా, కాంగ్రెస్‌, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

Read 66 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter