Friday, 14 July 2017 10:40

లోకేష్‌ షాక్‌కు.. నేతల మైండ్‌ బ్లాక్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaసదావర్తి భూములను ఎవరంటే వాళ్ళ చేత కొనిపిస్తే ఒప్పుకోను, బినామీలను అసలు ఒప్పుకోను, ఆళ్ల రామకృష్ణారెడ్డే కొనాలి, బినామీలను పెట్టుకుంటే రామకృష్ణారెడ్డి ఇంటి మీదకు ఐ.టి వాళ్లను పంపుతా... సిబిఐని ఉసికొల్పుతా! ఆయనపై కేసు వేసి కోర్టుకీడుస్తా... ఏబిసిడి న్యూస్‌ ఛానల్‌లో వస్తున్న తన పుత్రరత్నం నారా లోకేష్‌ ప్రెస్‌మీట్‌ను ఉండవల్లిలోని తన ఇంట్లో కూర్చుని ఎంతో ఆనందంగా చూస్తున్నాడు హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబునాయుడు. అక్కడే వున్న మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావులు పులి కడుపున పులే పుడుతుందనడానికి మన యువరాజే సాక్ష్యం సార్‌. పగబట్టిన వాళ్ల దుంపతెంచడంలో మీకేమాత్రం తీసిపోడు అని చెప్పారు. అప్పుడే అక్కడకు ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌బాబు వచ్చాడు. పెద్ద అట్టపెట్టె తెచ్చాడు. ఏంటది అని చంద్రబాబు అడిగాడు. హెల్త్‌డ్రింక్స్‌ సార్‌ అని జవహర్‌ చెప్పాడు. హెల్త్‌ డ్రింక్స్‌ అంటే ఏదన్నా ఆపిల్‌ జ్యూసో, మ్యాంగో జ్యూసో అయ్యుంటుందని అందరూ అనుకున్నారు. జవహర్‌ ఆ అట్టపెట్టె తెరిచి తలా ఒక బీరుసీసాను చేతిలో పెట్టాడు. అది చూసి చంద్రబాబు కోపంతో... జవహర్‌ ఏంటిది, మద్యం నేను తాగనని తెలుసు కదా! మద్యమే కాదు సిగరెట్‌, పాన్‌, ఖైనీ, జర్దా మసాలా, గుట్కా, మట్కా, పేకాట, సింగిల్‌ నెంబర్లాట... వగైరా వగైరా వ్యసనాలు నాకు లేవని తెలుసు కదా! ఈ మద్యం సీసాలెందుకు తెచ్చావని అడిగాడు. అందుకు జవహర్‌... అయ్యో సార్‌! మీ తెలివి తెల్లారినట్లే వుంది. ఇంతకాలం వీటిని మద్యం అనుకుని పొరపాటు పడి వీటిని ముట్టుకోలేదు. ఇవి మద్యం సీసాలు కాదు సార్‌, హెల్త్‌డ్రింక్‌ సీసాలు. వీటి సేల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మిమ్మల్నే పెడదామనుకుంటున్నా, అందుకే మీరు బీరు బాటిల్‌ ఎత్తితే ఆ ఫోటో తీసి ప్రచారానికి వాడుకుంటాం. అంతేకాదు, రాష్ట్రంలో ఈ హెల్త్‌డ్రింక్స్‌ సేల్స్‌ పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేం దుకు పలు ప్రణాళికలు రూపొందించామని చెప్పాడు. అవేంటో చెప్పు అని చంద్రబాబు విసురుగా అడిగాడు. జవహర్‌ అందుకు సమాధానమిస్తూ... రాష్ట్రంలోని ప్రతి ఆసుపత్రిలోనూ పేషంట్లకు సెలైన్‌లకు బదులు బీరు బాటిల్స్‌(హెల్త్‌డ్రింక్స్‌) వాడాలి. అలాగే ప్రతి నెల చౌకదుకాణాలలో రేషన్‌ తీసుకునే కార్డుదారులందరు కూడా విధిగా నెలకు ఐదు హెల్త్‌డ్రింక్స్‌ కొనుక్కోవాలి. రాష్ట్రంలో వున్న అన్ని కూల్‌డ్రింక్‌, మందుల షాపులలో ఈ హెల్త్‌డ్రింక్స్‌ అమ్మాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ బడుల్లో విద్యార్థులకు నీరుకు బదులుగా బీరు ఇవ్వాలని నిబంధన పెట్టాం. పురిటిబిడ్డలకు తల్లిపాల కంటే బాబుగారి బీరు శ్రేష్టం అని డాక్టర్ల చేతే చెప్పిస్తాం. ప్రతినెలా రాష్ట్రంలో ఎవరైతే ఎక్కువ బీర్లు కొనుగోలు చేసివుంటారో అలాంటి వారిని గుర్తించి 'బీరుబాహుబలి' బిరుదుతో సత్కరిస్తాం అని చెప్పాడు. అంతా విన్న చంద్రబాబు... నీ హెల్త్‌డ్రింక్స్‌ సేల్స్‌ ఐడియా బాగానే వుందిగాని దాని ప్రచారానికి చాలామందే వున్నారు. ప్రచా రానికి వాళ్లను వాడుకో అని చెప్పాడు. సార్‌, హెల్త్‌డ్రింక్స్‌ దేవాన్ష్‌ బాబుకు కూడా రెండిచ్చిపోతా అని జవహర్‌ అన్నాడు. నీకు దండం పెడతా నాయనా, వాటిని జనాలకు తాపించమని చెప్పాను, మాకు తాగించ మని కాదు, ముందు వెళ్లి ఆ పని చూడు అని చంద్రబాబు అతనిని పంపేసాడు. అంతలో యనమల రామకృష్ణుడు ఆయాస పడుతూ అక్కడకు వచ్చాడు. ఆయన మొహంలో టెన్షన్‌ కనిపిస్తుంది. ఏమైంది యనమల అని చంద్రబాబు అడిగాడు. నేను వైసిపి ప్లీనరీ నుండి వస్తున్నాను సార్‌, ప్లీనరీ బాగా సక్సెస్‌ అయ్యింది. ఇక అసలు విషయం ఏంటంటే అక్టోబర్‌ 27 నుండి జగన్‌ ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం దాకా పాదయాత్ర చేస్తానని ప్రకటించాడు. 2004 ఎన్నికలకు ముందు వై.యస్‌. ఇలాగే పాదయాత్ర చేసి గెలిచేసాడు. ఇప్పుడు కూడా సీన్‌ రిపీట్‌ అవుతుందేమోనని నా టెన్షన్‌ అని యనమల చెప్పాడు. చంద్రబాబు ఆవేశంతో... నిద్రలేస్తే మనల్ని విమర్శిస్తుంటాడు. మనం వేసిన రోడ్ల మీద పాదయాత్ర ఎలా చేస్తాడు. పాదయాత్ర చేయకుండా పోలీసులను పెడదాం అని అన్నాడు. అందుకు పత్తిపాటి పుల్లా రావు... అలా చేస్తే జగన్‌కు భయపడి మనమే పాదయాత్రను అడ్డుకున్నామని ప్రజల్లో చెడ్డ పేరొస్తుంది. దానికి బదులు భూగర్భ డ్రైనేజీ అనో, మంచినీటి పైప్‌లైన్ల పనులనో నెల్లూరులో మాదిరిగా రాష్ట్రంలో అన్ని రోడ్లను పగలగొడదాం, ఆ రోడ్ల మీద నడవలేక జగనే పాదయాత్రను మానుకుంటాడని సలహా ఇచ్చాడు. అంతలో అమరావతిలో ప్రెస్‌ మీట్‌ ముగించుకుని లోకేష్‌ వచ్చాడు. అంతా టెన్షన్‌గా ఉన్నట్లున్నారు, ఏంటి విషయం అని లోకేష్‌ అడిగాడు. జగన్‌ పాదయాత్ర గురించి యనమల చెప్పాడు. అది విన్న లోకేష్‌ చాలా తేలికగా... ఓస్‌ అంతేనా... అతను 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే నేను 30వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా... చాలా అని అడిగాడు. అది వినగానే సోమిరెడ్డి... బాబూ, మీరు మన రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే చాలు... మరీ 30వేలంటే పక్క రాష్ట్రాలే కాకుండా చైనా, మయన్మార్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లకు కూడా పోతారని అన్నాడు. ఎక్కడకు పోయినా పాదయాత్ర పక్కా. రేపే ముహూర్తం అని చెప్పి లోకేష్‌ లోపలకు వెళ్లాడు. లోకేష్‌ మాటలతో చంద్ర బాబుకు వెయ్యి ఏనుగుల శక్తి వచ్చింది. వెంటనే ఆయన సెల్‌ తీసి రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సిద్ధార్ధసింగ్‌, రామ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌ జైట్లీ, అమిత్‌షాలకు ఫోన్‌ చేసి తన కొడుకు పాదయాత్ర ప్రారంభోత్స వానికి రావాలని కోరాడు.

--------------

నవ్యాంధ్ర రాజధాని అమరావతి. జాతీయ, రాష్ట్ర నేతలంతా వచ్చి వున్నారు. అందరినోట 30వేల కిలోమీటర్ల పాదయాత్ర సాధ్య మేనా... అయినా ఇప్పుడు మొదలుపెడితే 2024 ఎలక్షన్‌ కన్నా పూర్తి చేయగలడా? అందరి నోటా అవే సందేహాలు. రామ్‌నాథ్‌కోవింద్‌, మోడీ, వెంకయ్య, అమిత్‌షా, చంద్రబాబులు వేదిక మీద కూర్చుని వున్నారు. అప్పుడే లోకేష్‌ కారు దిగాడు. కార్యకర్తలు జయజయధ్వానాలు చేస్తుండగా తెలుగు మహిళలు మంగళహారతులిచ్చారు. లోకేష్‌ పాద యాత్రలో పంపించడానికి పాతిక లారీల నిండా ఆహార పదార్ధాలు, వాటర్‌ బాటిళ్లు పెట్టి సిద్ధం చేసారు. నాన్నగారు ఇలారండి అని లోకేష్‌ చంద్రబాబును పిలిచాడు. పాదాభివందనం చేయడానికేమన్నా పిలుస్తున్నాడేమోనని చంద్రబాబు స్టేజీ నుండి క్రిందకు దిగి నిలబడ్డాడు. లోకేష్‌ వెంటనే రెండు చేతులతో నమస్కారం చేస్తూ చంద్రబాబు చుట్టూ మూడురౌండ్లు కొట్టాడు. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఇక పాదయాత్రకు బయలుదేరు నాయనా అని చంద్రబాబు అన్నాడు. ఎక్కడికి పొయ్యేది నాన్నగారు, నా పాదయాత్ర పూర్తయ్యిందని లోకేష్‌ అన్నాడు. ఆ మాటకు చంద్రబాబుతో పాటు అక్కడున్న అందరూ అవాక్కయ్యారు. చంద్రబాబు కొంచెం సాధారణ స్థితిలోకి వచ్చి... పాదయాత్ర పూర్తికావడమేంటని అడిగాడు. మీ చుట్టూ మూడుసార్లు పాదాలతో నడిస్తే 30వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్లే నాన్నగారు... మీరే నాకు తెలిసిన ప్రపంచం. ప్రపంచాన్నే మూడుసార్లు చుట్టి రావడమంటే ఇదే కదా... పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి మధ్య లోకసంచారం పోటీపెడితే శివుడి చుట్టూ రౌండ్లు కొట్టి వినాయకుడు చేసింది కూడా ఇదే కదా అని లోకేష్‌ అన్నాడు. ఆ మాటకు చంద్రబాబుతో పాటు అందరి మైండ్‌లు బ్లాకయ్యాయి.

Read 97 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వెనక్కి తగ్గేదే లేదు!
  పోలీస్‌స్టేషన్‌కు వెళితే ఎస్‌ఐ మా మాట వినడం లేదు... ఎస్‌ఐ చేత పని చేయించుకోలేకుంటే నా అనుచరుల ముందు నా పరువు పోతుంది.. ఎస్‌ఐ వద్దే పరపతిలేనోడివి... నువ్వేం నాయకుడివని అనుచరులు నన్ను వదిలిపోతున్నారు.... ఓ మండల స్థాయి నాయకుడు తన…
 • ఉంటారా? వెళ్ళిపోతారా?
  రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరు కింగ్‌లవుతారో, ఎవరు తెరమరుగవుతారో అంతే పట్టదు. రాజకీయాలలో ఎల్లకాలం వెలగడం అన్నది ఎవరికీ శాశ్వతం కాదని చాలామంది నాయకుల చరిత్రను పరిశీలిస్తే అర్ధమవుతుంది. నెల్లూరుజిల్లాలో సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉం డేది ఆనం…
 • వర్గాన్ని కాపాడుకోవడమా..? నియోజకవర్గాన్ని వదులుకోవడమా?
  జిల్లాలో పసుపు కొనుగోలు అక్రమాల సంగతేమోగాని దీనిమూలంగా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు పెద్ద చిక్కొచ్చిపడింది. పసుపు కొనుగోలు వ్యవహారాన్ని పెద్దకుంభకోణంగా చిత్రించిపెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. విచారణకు ఆదేశించి భారీ ఎత్తున ఉద్యోగులను సస్పెండ్‌ చేసింది. ఈ…
 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…

Newsletter