14 July 2017 Written by 

14-07-2017 రాశిఫలాలు

rasi 14

1Ariesమేషం

ఆదాయ వృద్ధి ప్రయత్నాలు జరుపుతారు. బిడ్డల చదువులు, పెండ్లిండ్లు సమస్యగానే ఉంటాయి. గృహ వస్తు, వాహన రిపేర్లుంటాయి. ఉద్యోగులకు స్థాన మార్పులు, అధిక బాధ్యతలుంటాయి. చిరు వ్యాపారులు కాంట్రాక్టర్లకు బాగుంటుంది. కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలుండి సర్దుబాటు కాగలవు. వృత్తి వ్యాపా రాలు బాగుండి ఆదాయం ఫరవాలేదనిపిస్తుంది.

 

2Taurusవృషభం

కాంట్రాక్టు పనులు, గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. అనుకున్న పనులను సమర్ధవంతంగా జరుపుతారు. మీ సూచనలు సలహాల వల్ల ఇతరులకు మంచి జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు బాధ్యతలు, అధికారులకు స్థాన మార్పులుంటాయి. ఉన్నత విద్యావకాశాలు దొరకగలవు. ఆర్ధిక వ్యవహారాలను జాగ్రత్తగా జరపండి.

 

3Geminiమిధునం

భూ లావాదేవీలు వాయిదా వేసికొనండి. ఆరోగ్యం బాగుంటుంది. అవసరాలకు ఋణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుండి అనుకూలత, బంధువర్గంతో కొద్దిపాటి విభేదాలుంటాయి. ఉన్నత విద్యా వకాశాలుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. కొత్త ఆభరణాలు, స్థిరాస్తులు సమకూరుతాయి.

 

4Cancerకర్కాటకం

నిర్మాణాలు జరిపే వారికి, కాంట్రాక్టర్లకు స్వల్ప ఇబ్బందులుంటాయి. ఉద్యోగులకు పని భారం, అధికా రుల వత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శుభ కార్యాలు నిర్ణయం కాగలవు. బిడ్డల విద్యా వ్యవహారాలు సంతోషం కలిగిస్తాయి. కొత్త వస్తువులు సమకూరుతాయి. ఆదాయంకు తగినట్లు ఖర్చులుంటాయి. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి.

 

5Leoసింహం

అనవసర వ్యవహారాలలో ప్రవేశించవద్దు. ఉద్యో గులకు పనిభారం పెరిగినను అధికారుల సహకారం బాగుంటుంది. బిడ్డలకు విద్యాఉపాధి అవకాశాలు బాగుంటాయి. వివాహ ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. విలువైన వస్తువులు, పత్రాలు భద్రపరచుకొనండి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆర్ధికావకాశాలుండి అవకాశాలను సద్వినియోగం చేసుకొంటారు.

 

6Virgoకన్య

వ్యాపారులకు, ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా ఇబ్బందులుంటాయి. శుభకార్యాలు నిర్ణయం కావడం, దూర ప్రయాణాలుండగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పని సామర్ధ్యం, స్థాన మార్పులుండవచ్చును. స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగవు. అయినా డబ్బుకు ఇబ్బందులు ఉండవు.

 

7Libraతుల

అవసరాలకు ఋణం చేయవలసి రావచ్చును. ఉద్యోగులకు విధి నిర్వహణలో జాగ్రత్తపడండి. వాహనాలు నడిపేవారు, యంత్రాలు, కరెంటు పనులు చేసేవారు జాగ్రత్తపడాలి. ఉద్యోగావకాశాలు బాగుంటాయి. ఆర్ధి కంగా కొద్ది ఒడిదుడుకులుంటాయి. ఆదాయం సామా న్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలందు అనుకూలత ఉంటుంది. గృహ వస్తువాహన రిపేర్లుంటాయి.

 

8Scorpioవృశ్చికం

అధికారులకు స్థానమార్పులుండవచ్చును. ఉద్యో గులు విధి నిర్వహణలో జాగ్రత్త వహించండి. భాగ స్వామ్య చర్చలు ఫలించగలవు. విలువైన వస్తువులు సమ కూర్చుకొంటారు. ఉన్నత విద్యావకాశాలు లభించగలవు. ఆరోగ్యం ఫరవాలేదు. రావలసిన బాకీలు కొంత అందు తాయి. కుటుంబసౌక్యం కలదు. అనుకున్న పనులు ఆకస్మికంగా నెరవేరతాయి.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులకు స్థానమార్పులు, అధికారులకు ప్రమోషన్లు లభించగలవు. కుటుంబవ్యక్తులతో కొద్దిపాటి విభేదాలుండి సర్దుబాటు కాగలవు. శుభకార్యాలు నిర్ణయం కావడం, దూర ప్రయాణాలుంటాయి. ఉన్నత విద్యావకాశాలు లభించగలవు. అనుకున్న పనులు నెర వేరగలవు. కొత్త పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు అవకాశాలు దొరుకుతాయి.

 

10Capricornమకరం

వ్యతిరేకించిన వారే మీకు చేరువకాగలరు. స్థిరా స్తుల లావాదేవీలు, నూతన వస్తువులు కొనడం జరుగు తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో అవకాశాలు కలిసివస్తాయి. ఆర్ధికంగా బాగుండి ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలు, దూర దేశ ప్రయాణాలు నిర్ణయం కాగలవు. బంధుశ్రేణి నుండి శుభవార్తలు వింటారు. విద్యావకాశాలు బాగుంటాయి.

 

11Aquariusకుంభం

వ్యాపారాలలో అభివృద్ధి, దైవ సేవా సంస్థలకు సహాయపడడం, నిర్మాణాలు చేసేవారికి పురోగతి బాగుం టుంది. టెండర్లు, లీజులు లభించే దానికి మంచి సమయం. ఉద్యోగులకు స్థానమార్పులు, లేక అదనపు బాధ్యతలుంటాయి. కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము బాగుంటుంది. ఇంటా బయట వ్యవహారాలందు అవ రోధాలను అధిగమించుతారు.

 

12Piscesమీనం

ఉద్యోగ ప్రయత్నాలకు, ఉన్నత విద్యావకాశాలు దొరుకుతాయి. ప్రముఖులతో పరిచయాలు, శుభకార్యాలు నిర్ణయం కావడం జరుగుతుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ సలహాలు, మీ నిర్ణయాలు ఎదుటి వారికి అంగీకారమై, మంచి గుర్తింపు గౌరవాలు పొందుతారు. డబ్బు మదుపు చేసే అవకాశాలు దొరుకుతాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter