04 August 2017 Written by 

నాకు నేనే మేనేజర్

kajalప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారం పై పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంలో పలువురు సెలబ్రిటీలు పోలీస్ విచారణకు హాజరయ్యారు. ఇందులో గ్లామర్ భామ కాజల్ మేనేజర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. కాజల్ మేనేజర్ రోనీ డ్రగ్స్ డీలర్ గా వ్యవహరించాడని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాజల్ మేనేజర్ గా అన్ని చూసుకునే రోనీ విషయం తెలిసి కాజల్ షాక్ అయిందట .. ఈ సంఘటనతో ఆమె ఓ నిర్ణయం తీసుకుందట ? ఇక పై ఇలాంటి మేనేజర్ లను నమ్మకూడదని ఫిక్స్ అయిందట, అంతే కాదు తన విషయాలను స్వయంగా తానె చూసుకుంటానని, వీలయితే ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను అని అంటోంది. పరిచయం లేని వాళ్ళను మేనేజర్స్ గా పెట్టుకోవడం తప్పే అని గట్టిగానే చెబుతోంది ఈ చందమామ !!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
    నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter