19 August 2017 Written by 

అట్టహాసంగా వెంకయ్య ప్రమాణస్వీకారం

venkదేశ రాజధాని ఢిల్లీలో తెలుగు వెలుగులు కళ్ళు జిగేల్‌ మనిపించాయి. తెలుగు పంచెకట్టు ఆకట్టుకుంది. తెలుగు భాషకు, తెలుగు యాసకు వెలుగులిచ్చిన తెలుగు తల్లి వరపుత్రుడు, నెల్లూరు ముద్దుబిడ్డ మన ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతిగా కొలువుదీరారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10.45గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, వెంకయ్య నాయుడు చేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, గవర్నర్‌లు కూడా హాజ రయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం అదేరోజున ఆయన రాజ్యసభ ఛైర్మెన్‌గా సభాపతి స్థానంలో కూర్చుని అందరినీ అలరించారు.

1998 నుండి ఇప్పటి వరకు రాజ్య సభలో ముందువరుస సీట్లలో కూర్చుని ప్రతిపక్షంలో వుంటే అధికారపక్షాన్ని, అధికారంలో వుంటే ప్రతిపక్ష పార్టీలను దడదడలాడించిన వెంకయ్యనాయుడును చూసిన సభ్యులు ఇప్పుడు కొత్త కోణంలో సభాపతి స్థానంలో సభను ఎంతో హూం దాగా నడిపిస్తున్న వెంకయ్యను చూస్తున్నారు. కంగ్రాట్స్‌ వెంకయ్య నాయుడుజీ!

మీ వెంటే నేనుా...

దాదాపు పాతికేళ్లుగా ఆయన అడు గుల్లో అడుగులు వేస్తూ... ఆయన తిన్నాడా లేదా చూసుకుంటూ... ఆయన ఆరోగ్యాన్ని తన ఆరోగ్యంగా చూసుకుంటూ... ఆయన పడుకుని నిద్రపోయాడనుకున్నాకే తాను నిద్రకు ఉపక్రమిస్తూ, తెల్లారాక ఆయనకంటే ముందే లేచి ఆయన సేవలో తరిస్తూ... ఆయనే దైవంగా, ఆయనే మార్గంగా ఆరా ధిస్తూ... ఆయన ఆరోగ్యమే తన బలంగా, ఆయన ఆనందమే తన సంతోషంగా భావిస్తూ... ఆయనను కంటికి రెప్పలా, వీడని నీడలా అనుసరించాడు. అధికా రంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా, బాధ లలో వున్నా, సంతోషంలో వున్నా అన్నిం టికీ తోడులా వీడని నీడలా నడిచాడు.... అతని పేరే సత్యకుమార్‌. దాదాపు పాతి కేళ్లుగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి నీడలా కనిపెట్టుకున్న వ్యక్తి. వెంకయ్యనాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డిగా ఉన్నప్పుడు కడపజిల్లా పొద్దుటూరుకు చెందిన వై.సత్యకుమార్‌ ఆయన వద్ద కార్యదర్శిగా చేరారు. అక్కడ నుండి తన పని తీరుతో, నమ్మకమైన వ్యక్తిత్వంతో వెంకయ్యకు కుడిభుజమయ్యారు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వెంకయ్యకు సత్య అదనపు కార్యదర్శిగా పనిచేసాడు. 2014 నుండి కేంద్ర కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వెంకయ్య నాయుడుకు ఓ.ఎస్‌.డిగా వ్యవహరిస్తు న్నాడు. అయితే ఇంతకాలం వెంకయ్య నాయుడు రాజకీయపరమైన పదవులలో ఉండబట్టి సత్యను తన వ్యక్తిగత కార్య దర్శిగా, ఓఎస్‌డిగా నియమించుకున్నారు. ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆయనకు ఇక సత్య దూరం కావాల్సిందేనా అని అనుమానా లొచ్చాయి. అయితే ఉపరాష్ట్రపతి అయినా కూడా వెంకయ్య తన సత్యను వదల్లేదు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే సత్యకుమార్‌ను తన ఓఎస్‌డిగా నియ మించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఓఎస్‌డిగా ఆలిండియా సర్వీసు అధికారులను నియ మిస్తుంటారు. కాని తొలిసారిగా ఆలిం డియా సర్వీసుకు సంబంధం లేని వ్యక్తిని ఉపరాష్ట్రపతి ఓఓస్‌డిగా నియమించారు. ఇది 'సత్య'కే కాదు, నమ్మకానికి దక్కిన గౌరవం. వెల్‌డన్‌ సత్య!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter