Saturday, 19 August 2017 14:31

బాబుకు బాలయ్య టెన్షన్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaకేసీఆర్‌ ఆంధ్రులను బలవంతంగా నెట్టేసిన హైదరాబాద్‌ నగరం. ఆ నగ రంలో టివి 10.5 స్టూడియో! ఆ ఛానల్‌ ప్రతినిధి మురళీగోపాల్‌ ఐ.టి మంత్రి లోకేష్‌బాబు ఇంటర్వూ పెట్టుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా... సార్‌, మిమ్మల్ని అందరూ 'పప్పు' అని అంటుం టారు. ఆ పేరెలా వచ్చింది. ఆ పేరుతో పిలుస్తున్నందుకు మీరేమీ ఫీల్‌ కారా? అని మురళీగోపాల్‌ అడిగాడు. అందుకు లోకేష్‌... ఫీల్‌ కావడమెందుకు, నేను పప్పు, మా నాన్న నిప్పు... నేను వాడేది బాటా చెప్పు... పాత ఇనుముకు పట్టేది తుప్పు... మమ్మల్ని ఆడిపోసుకునే వాళ్లదే తప్పు... నెక్ట్స్‌ నువ్వేంటో చెప్పు... అని చెప్పాడు. లోకేష్‌ ప్రాసల ప్రజ్ఞకు మురళీ గోపాల్‌ చప్పట్లు తట్టి... సార్‌, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళితే ఈ ప్రాసలు ఇక వినలేనేమో అన్న లోటుం డేది. వెంకయ్య స్థానాన్ని భర్తీ చేయడానికి మీరొచ్చారు. 'పప్పు' పట్ల మీ అభిప్రాయం అని మళ్ళీ అడిగాడు. అందుకు లోకేష్‌... పప్పు... అప్పు లేనిదే మనిషి జీవితం నడవదు. కందిపప్పు... మినపప్పు... పెసరపప్పు... జీడిపప్పు... శెనగపప్పు... బాదంపప్పు... పిస్తాపప్పు... ఆకుకూర పప్పు... తోటకూర పప్పు... ఇలా ప్రతి ఇంటిలోనూ, ప్రతి హోటల్‌లోనూ, ప్రతి అంగట్లోనూ నేనుంటాను. కాబట్టి నాకు ఆ పేరు పెట్టిన వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాని చెప్పాడు. అంతలో లోకేష్‌ సెల్‌ మోగింది. అర్జంట్‌గా విజయవాడ సీఎం ఆఫీసుకు రమ్మని పిలుపు. లోకేష్‌ ఇంటర్వ్యూను ముగించి లేచాడు.

్య్య్య్య్య

ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం. హైటెక్‌రత్న చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమామహే శ్వరరావు, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు, కె.ఇ.కృష్ణమూర్తి, నంద్యాల ఓఎస్‌డి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు వున్నారు. అందరి ముఖాల్లోనూ టెన్షన్‌ కనిపిస్తోంది. అప్పుడే బాలకృష్ణ, లోకేష్‌లు అక్కడకు వచ్చారు. దిగులుగావున్న చంద్ర బాబును, మంత్రులను చూసి బాలయ్య... ఏం అలా వున్నారని అడిగాడు. దానికి సోమిరెడ్డి... నంద్యాల ఎలక్షన్‌ మనకు సెమీఫైనల్‌ లాంటిది. ఓడితే పరువు - ప్రతిష్ట జాయింట్‌గా పోతాయి. అక్కడ పరిస్థితి టైట్‌గా వుంది. జగన్‌ అక్కడే తిష్టవేసాడు, సుడిగాలిలా ప్రచారం చేస్తు న్నాడు. జనం బ్రహ్మరథం పడుతున్నారు. అతనికి పోటీగా మనం ప్రచారానికి లెజండ్స్‌ను దించాలి. పవన్‌ కళ్యాణ్‌ను దించుదామా అంటే... గెలిస్తే క్రెడిట్‌ అంతా అతనికి పోతుంది. మనం డమ్మీల మవుతాం. జగన్‌ను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నాం అని చెప్పాడు. అప్పుడు లోకేష్‌... దానికంత టెన్షన్‌ ఎందుకు డాడీ... నేను, మామయ్య నంద్యాల ప్రచారానికెళ్తాం అని అన్నాడు. వెంటనే బాలయ్య అందుకుని... నంద్యా లలో గెలవాలంటే జగన్‌కు పదిరోజులు కావాలి, నాకు పదిగంటలు చాలు అని అన్నాడు. ఆ మాటకు చంద్రబాబు టక్కున... జగన్‌ను గెలిపించడానికా? అని అనేసాడు. అదేంటి బావా... మన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి నేను పదిగంటలు నంద్యాలలో ప్రచారం చేస్తే చాలు. అంతా తారుమారైపోతుంది అని బాలయ్య చెప్పాడు. అందుకు చంద్ర బాబు... నా బాధ కూడా అదే... మిమ్మల్ని ప్రచారానికి పంపిస్తే నా తల రాత తారుమారవుతుందేమోనని భయం. ఎక్కడ నువ్వు ఎవరి మీద చేయిచేసుకుం టావో, ఎక్కడ లోకేష్‌ తెలుగుదేశాన్ని మతతత్వ పార్టీ అని తిడతాడో అని నా ఆందోళన. అట్లాగని నువ్వు హీరోవి... లెజండ్‌వి... అభిమానులు వున్నవాడివి... నిన్ను ప్రచారానికి పోకుండా ఆపలేను అని చంద్రబాబు మనసులో బాధను చెప్పుకున్నాడు. అప్పుడు సోమిరెడ్డి... మీరేం వర్రీ కాకండి సార్‌, బాలయ్యను, లోకేష్‌ను మేం నంద్యాలకు తీసుకెళతాం, బ్రహ్మాండంగా ప్రచారం చేయిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు. అప్పుడు చంద్రబాబు... అభిమానులను బాలకృష్ణపైన పడకుండా చూడండి, అలాగే లోకేష్‌కు మనది తెలుగుదేశంపార్టీ అని బట్టీ పట్టించి తీసుకెళ్లండి... అని సలహా ఇచ్చి లేచాడు. దాంతో లోకేష్‌ను, బాలయ్యను వెంటబెట్టుకుని సోమిరెడ్డి నంద్యాల బయలుదేరాడు. చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి రెండు పుల్కాలు తిని మనసులో బాలకృష్ణ, లోకేష్‌ల గురించి టెన్షన్‌ పడుతూ నిద్రలోకి జారుకున్నాడు.

్య్య్య్య్య

చంద్రబాబు చాలా తొందరగా అంటే ఆరుగంటల వ్యవధిలోనే వీడియో కాన్ఫ రెన్స్‌ ముగించి ఇంట్లోకి వెళ్లాడు. నంద్యా లలో విశేషాలేంటో చూద్దామని టీవీ ఆన్‌ చేసి ఏబిసిడి ఛానెల్‌ పెట్టాడు. నంద్యాల లోని ఆత్మకూరు బస్టాండ్‌ సెంటర్‌లో బాలయ్య ప్రచారానికెళ్లాడు. అక్కడ వేల సంఖ్యలో అభిమానులు పోగయ్యారు. బాలయ్యతో సెల్ఫీల కోసం యువకులు ఎగబడుతున్నారు. తోసుకుంటున్నారు. ఆ సీన్‌ చూస్తుంటే చంద్రబాబుకు దడ మొద లైంది. ఎక్కడ అభిమానులను బాలయ్య విసుక్కుంటాడో... ఎక్కడ తోస్తాడో... ఎక్కడ వాళ్లంతా రివర్స్‌ అవుతారోననే భయం వచ్చింది. కాని, అక్కడ చూస్తే బాలయ్య చిరునవ్వుతో అందరితో సెల్ఫీలు దిగుతున్నాడు. అభిమానులు తన మీద పడుతున్నా... కూల్‌గా వారితో తోసుకో వద్దు, మీ అందరితో నేను ఫోటోలు దిగుతాను అని చెబుతూ కలిసిపోయాడు. వారితో ఎంతో స్నేహంగా మెలగసా గాడు. ఆ సీన్‌ చూసి చంద్రబాబుకు కన్నీళ్లు వచ్చినంతపనయ్యింది. ఏబిసిడి ఛానెల్‌ వాళ్లు వెంటనే మార్కెట్‌సెంటర్‌లో మంత్రి లోకేష్‌బాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయసాగారు. లోకేష్‌ ప్రసంగం మొదలుపెట్టాడు. మీకు శిల్పా మోహన్‌రెడ్డి తెలుసా అండి అని జనాన్ని ప్రశ్నించాడు. టీవీలో దానిని చూస్తున్న చంద్రబాబు గుండె కళుక్కుమంది. వీడి దుంపతెగ... శిల్పామోహన్‌రెడ్డి మన పార్టీ అభ్యర్థి అనుకుంటున్నాడేమో... ఆయనను గెలిపించమని అడుగుతా డేమో... అని మనసులో సందేహిస్తుం డగా... లోకేష్‌ మాత్రం... ఈ శిల్పా మోహన్‌రెడ్డి మొన్నటి వరకు మన పార్టీలో ఉన్నోడే... కాని, ఇప్పుడు పార్టీకి వెన్ను పోటు పొడిచి వైసిపిలోకి వెళ్లాడు. ఇలాంటి వారికి ఓటేస్తారా బ్రదర్‌... అంటూ ప్రశ్నించాడు. టీవీలో దీనిని విన్న చంద్రబాబు... ఫర్వాలేదు. కరెక్ట్‌గా మాట్లాడి నాకు బి.పి తగ్గించాడనుకు న్నాడు. అక్కడ లోకేష్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... అన్నలు, తమ్ముళ్లు... 'ఈ దేశంలో అత్యంత అవినీతి పార్టీ, కుల పిచ్చి, మతపిచ్చి వున్న పార్టీ తెలుగుదేశం' అనగానే చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. కాని అక్కడ మాత్రం లోకేష్‌ కంటిన్యూ చేస్తూ... తెలుగుదేశం కాదు... కానేకాదు. కులపిచ్చి, మత పిచ్చి వున్న పార్టీ వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ... అవు నంటారా... కాదంటారా తమ్ముళ్లు అని ఆవేశంగా అన్నాడు. ఆ మాట వినగానే చంద్రబాబుకు పోయిన ప్రాణం తిరిగొచ్చి నట్లై... వెరీగుడ్‌ వెరీగుడ్‌... కరెక్ట్‌గా మాట్లాడావ్‌... కరెక్ట్‌గా చెప్పావ్‌ అని అరవసాగాడు. అలా నిద్రలో నుండి లేచి మంచం మీద కూర్చునే అరవసాగాడు. చంద్రబాబు అరుపులకు పక్కనేవున్న భువనేశ్వరీ దేవి లేచి... ఆయన ముఖాన నీళ్లు చల్లింది. అప్పుడుగాని చంద్రబాబు ఈ లోకంలోకి రాలేదు. అప్పటికిగాని తనకు తెలియలేదు... తనకొచ్చింది కల అని. వచ్చిన కల గురించి చంద్రబాబు భువనేశ్వరీదేవికి చెప్పాడు. అప్పుడామె... వాళ్లను ప్రచారానికి పంపించడమెందుకు, మీరిలా టెన్షన్‌ పడుతూ పీడకలలు కనడమెందుకు... వాళ్ళు సక్రమంగానే ప్రచారం చేసి వస్తారులే, ఇక పడుకోండి అని గదమాయించింది.

Read 118 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter