07 September 2017 Written by 

కలంపై పేలిన తూటా

gauriబెంగుళూరులోని ప్రముఖ మహిళా జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ ఈనెల 5వ తేది రాత్రి హత్యకు గురయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో ఆమె ఇంటిబయట నిల్చుని ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై ఆమెకు అతి దగ్గరగా వచ్చి కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి దుర్మరణం పాలయ్యారు. ఈ హత్యోదంతం బెంగు ళూరులో సంచలనం సృష్టించింది. బెంగు ళూరు మహానగరంలో ఇలా ఒక మహిళా జర్నలిస్ట్‌ను అత్యంత దారుణంగా హత మార్చడం ఘోరం..దారుణం. జర్నలిస్టు లపై దాడులకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి, జర్న లిస్టులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెంగుళూరుకు చెందిన గౌరీలంకేష్‌ అభ్యుదయవాది. బెంగు ళూరులో బిఏ పూర్తిచేసి, ఢిల్లీలోని జెఎన్‌ యులో ఆమె మాస్‌ కమ్యూనికేషన్‌ పట్టా అందుకున్నారు. ఢిల్లీతో పాటు, ఫ్రాన్స్‌, అమెరికాల్లోని కొన్ని పత్రికల్లో పనిచేసి ఆ పత్రికలకు తన సేవలందించిన ఘనత ఆమెకుంది. ఆ తర్వాత ఆమె బెంగుళూ రుకు వచ్చి, తండ్రి అడుగుజాడల్లోనే లంకేష్‌ అనే వారపత్రికను నడిపేవారు. తాను నమ్మిన విశ్వాసాలకు అద్దంపట్టేలా ఆ పత్రికను కొనసాగించారు. సండే పత్రికకు, ఈటీవీ తెలుగుకు బెంగుళూరు బ్యూరో ప్రతినిధిగా గతంలో కొంతకాలం సేవలం దించిన ఆమెకు ఆంగ్లం, కన్నడ భాషల్లో మంచి భాషాపరిజ్ఞానం ఉంది. మావోయి స్టులకు సానుభూతిపరురాలైన ఆమె.. వారు జనజీవనస్రవంతిలో కలిసేందుకు కృషిచేశారు. మావోయిస్టులకు ప్రభుత్వా నికి మధ్య వారధిగా సేవలందించారు. బెంగుళూరులోని మతసామరస్య వేదిక ప్రతినిధిగా ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దేవాలయాల్లో జరిగే మూఢనమ్మకాలను విమర్శిస్తూ అనేక కథనాలు రాసేవారు. విద్యార్థుల కోసం గైడ్‌ పేరిట మాసపత్రికను కూడా ప్రచు రిస్తున్నారు. రాష్ట్ర పత్రికా అకాడమీ, ప్రెస్‌ క్లబ్‌, సందేశ్‌ పాత్రికేయ పురస్కారాలను ఆమె అందుకున్నారు. ఆదివాసీలు, గిరి జనుల హక్కులపై క్రియాశీలకంగా పని చేస్తున్నారు. కాగా, గత ఏడాది నవం బరులో బిజెపి నేతలు వేసిన పరువునష్టం కేసులో ఆమెకి ఆరునెలల జైలుశిక్ష పడింది. అయితే బెయిల్‌పై ఆమె బయటే ఉన్నారు. అభ్యుదయవాదిగా పేరొందిన ఆమె హత్యకు గురికావడం పట్ల దేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు, రాజ కీయవేత్తలు తమ విచారం ప్రకటించి ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. పాత్రికేయసంఘాలు, అనేకమంది సాహితీ వేత్తలు ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ, దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించా లని కోరుతున్నారు.

గౌరీలంకేష్‌ మృతి కలచివేసింది - సిఎం సిద్ధరామయ్య

ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీలంకేష్‌ మృతి తనను కలచివేసిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. రెండేళ్ళ క్రితం సాహితీవేత్త ఎం.ఎం కలబురగి హత్యోదంతం నుంచి తేరుకునేలోగానే గౌరీలంకేష్‌ను దుండుగలు హత్యచేశారని విచారం వెలి బుచ్చారు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసుబృందాలు రంగంలోకి దిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా మాజీప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌, కేంద్రమంత్రి సదానందగౌడ, బిజెపి కర్నాటక అధ్యక్షుడు యడ్యూరప్ప, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, పలువురు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు.. తదితర ముఖ్యులెందరో గౌరీలంకేష్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ తమ సంతాపం తెలియజేశారు. ప్రత్యేకించి రాహుల్‌గాంధీ ఒక ప్రకటనలో 'నిజం ఎప్పుడూ నిశ్శబ్ధంగా ఉండదు. మన హృదయాల్లో ఆమె సుస్థిర స్థానం సంపాదించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలియజేస్తున్నా'నని పేర్కొంటూ ఆమె మృతికి విచారం ప్రకటించారు. ''ఇదొక అత్యంత కిరాతక చర్య. బెంగుళూరులో శాంతి భద్రతల పరిస్థితికి ఈ హత్యోదంతం అద్దం పడుతోంది. దుండగులు, నేరస్థులకు ఈ నగరం నెలవుగా మారిందంటూ''.. ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా పలు పాత్రికేయ సంఘాలు, పలువురు సాహితీవేత్తలు ఆమె హత్యను ఖండించాయి. మహిళా జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ను హత్యచేసిన దుండగులను వెంటనే అరెస్ట్‌ చేసి, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పాత్రికేయసంఘాలు విజ్ఞప్తిచేస్తున్నాయి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter