07 September 2017 Written by 

వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు

ysr leadersరాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ రోజు నాయకుల మధ్య సమన్వయం లేక మూడు అసెంబ్లీ సీట్లలో ఓడిపోవాల్సి వచ్చింది.

జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు జాస్తిగా వున్నాయి. అధికారపార్టీ కాబట్టి ఆ మాత్రం విభేదాలు సహజమే! జిల్లాలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో ఆ స్థాయిలో వర్గపోరు లేకున్నా కొద్దిమంది నాయకుల మధ్య వున్న మనస్పర్ధలు పార్టీకే చేటుగా మారే అవకాశాలున్నాయి.

కావలి నియోజకవర్గంలో పార్టీలో మూడు గ్రూపులయ్యాయి. 2014 ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం గట్టిగా పనిచేసిన మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి రేపు కావలి సీటు కోసం పోటీలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో మాజీఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి కూడా కావలి సీటును ఆశిస్తున్నాడు. ఎవరి ప్రమేయం లేకుండానే ఇటీవల ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వచ్చే ఎన్నిక ల్లోనూ కావలి సీటు ప్రతాప్‌కే అని ప్రకటించడం ఇక్కడ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. 2014 ఎన్నికలప్పుడు కూడా నెల్లూరు నగరం, రూరల్‌, గూడూరు సీట్లకు తన అనుచరులను అభ్యర్థులుగా చేసుకోవాలని చెప్పి మేకపాటి ఇలాంటి తలనొప్పినే తెచ్చిపెట్టాడు. అభ్యర్థుల విషయంలో అధిష్టానం ముందుగా మేకపాటి నోటికి తాళం వేయాలి. గత ఎన్నికల్లో వెంకటగిరిలోనూ పార్టీ నాయకుల మధ్య సమన్వయం కుదరకపోవడం వల్లే అక్కడ అభ్యర్థిగా వున్న కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఓడిపోయాడు. ఉదయగిరిలోనూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పోకడలు నచ్చక మండల స్థాయి నాయకులు చాలామంది దూరమయ్యారు. ఈసారన్నా వారిని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిలతోనూ పార్టీలో కొందరు నాయకులకు పడడం లేదు. వచ్చే ఎన్నికల లోపు నేతల మధ్య కలతలను రూపు మాపి, కేడర్‌ను ఒకేతాటిపై నడిచే విధంగా అధిష్టానం దృష్టి పెట్టాల్సి వుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…
 • మేకపాటిని తప్పిస్తేనే మేలు?
  నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మూడుసార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాడు. నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో ఆయన పేరిట ఇదో రికార్డు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ రిజర్వుడ్‌లో ఉన్నటువంటి నెల్లూరు లోక్‌సభ జనరల్‌లోకి…
 • ఈ మలుపులు... ప్రమాదాలకు పిలుపులు
  కోవూరు నుండి విజయవాడ దాకా జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చారు. ప్రతి క్రాసింగ్‌ వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేసారు. చిన్న పల్లెటూరుకు కూడా ఇవి ఏర్పడడంతో హైవేను దాటి పోవడం అన్న ప్రశ్నేలేదు. కాబట్టి ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చు. దరిద్రం ఏంటంటే…
 • పేద గుండెల ధ్వని... 'జై ఆంధ్రా' ఉద్యమ సేనాని... మెట్టలో పుట్టిన మేటి నేత మాదాల జానకిరామ్‌
  ఉదయగిరి అంటే గుర్తొచ్చేది అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే.. ఆధునిక రాజకీయ కాలంలో గుర్తొచ్చేది స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు. వారి రాజ కీయ ప్రస్తానం మొదలైంది ఇక్కడే! అలాగే వారితో పాటు గుర్తొచ్చే నాయకుడు మాజీ మంత్రి…

Newsletter