16 September 2017 Written by 

'దేశం'ను వెంటాడుతున్న... గెలుపుగుర్రాల కొరత

gelupu gurraluనంద్యాల, కాకినాడలలో గెలుపుతో తెలుగుదేశం వర్గాల్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నా నెల్లూరుజిల్లా తెలుగు దేశం పార్టీలో మాత్రం గెలుపుగుర్రాల కొరత ఆ పార్టీని వెంటాడుతోంది. వైసిపికి బలమైన జిల్లా ఇది. వైకాపాను ధీటుగా ఎదుర్కోవాలంటే గెలుపుగుర్రాల ఎంపికపై పెద్ద ఎత్తునే కసరత్తు చేయాల్సివుంది.

2014 ఎన్నికల్లో సరిగా సీట్లు సాధించలేదని చెప్పి చంద్రబాబు దాదాపు రెండేళ్ళ పాటు ఈ జిల్లాను చిన్నచూపు చూసాడు. అభివృద్ధి విషయంలో సవతి తల్లి ప్రేమను చూపాడు. ఏడాది కాలంగా జిల్లా విషయంలో ఆయన మనసు కొంచెం మారింది. జిల్లా నుండి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డికి రెండో మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు ఈ జిల్లా పట్ల తనకున్న విద్వేషాన్ని కొంచెం పక్కనపెట్టాడు.

మెజార్టీ సీట్లు తెచ్చుకోలేక పరువు పోగొట్టుకున్నామని, చంద్రబాబు దృష్టిలో చులకనైపోయామని, ఈసారైనా జిల్లాలో పార్టీకి మెజార్టీ సీట్లు తెచ్చి చంద్రబాబు చేత భుజాలు తట్టించుకోవాలనే తపనతో జిల్లా తెలుగుదేశం నాయకులున్నారు. పార్టీ అధికారం కోల్పోతే ఈ జిల్లాలో సీట్లు ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా చంద్రబాబు పట్టించుకోడు. ఎందుకంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఖాతాలోకి పోతుంది. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి ఈ జిల్లాలో సీట్లు తక్కువ వస్తే మాత్రం అది జిల్లా నాయకుల అసమర్ధత అవుతుంది. వైకాపాకన్నా ఒక్కసీటు ఎక్కువ తెచ్చుకున్నా చంద్రబాబు వద్ద తలెత్తుకోగలరు.

ఈ దృష్టితోనే ముందుగా ఆయా నియోజకవర్గాలకు ఎవరైతే కరెక్ట్‌గా సరి పోతారన్న దానిపై ఇప్పటినుండే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫలానా సీటు ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పడానికి ఒకటి, రెండు సీట్లన్నా గ్యారం టీగా వుండేవి. జిల్లాలో ఇప్పుడు అలాంటి సీన్‌ లేకుండా పోయింది. జిల్లాలో 10 అసెంబ్లీలుంటే ఫలానా సీటులో తెలుగు దేశం ఘంటాపధంగా గెలుస్తుందని చెప్ప గల పరిస్థితి లేదు. జిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశంకు ఆశాజనకంగా వున్న సీటు సర్వేపల్లి. అది కూడా ఈమధ్య మంత్రి సోమిరెడ్డి వ్యక్తిగతంగా కష్టపడుతుండబట్టి. ఆయన పోటీ చేస్తే తెలుగుదేశంకు కొంత అనుకూలమే. కాకపోతే ఆయన ఎమ్మెల్సీగా వున్నాడు. ఎన్నికలప్పటికి ఆయన పదవీ కాలం మరో మూడేళ్లదాకా ఉంటుంది. కాబట్టి ఆయన పోటీ చేస్తాడా? లేదా అన్నది సందేహం. ఆత్మకూరుకు ఆనం రామనారాయణరెడ్డి రూపంలో గట్టి అభ్యర్థి దొరికాడు. కాకపోతే ఆయన వచ్చాక కూడా అనుకున్నంతగా వర్గాన్ని పునరేకీకరణ చేయలేకపోయాడు. వైకాపా వైపు వెళ్ళిన ఆయన మనుషులందరు కూడా దాదాపు అక్కడే వున్నారు. ఇక తెలుగుదేశంలోనే గూటూరు కన్నబాబు అసమ్మతి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వున్నాడు. ఆనంకు సీటిస్తే ఆయనకు వ్యతిరేకంగా పనిచేయ డానికి ఇతను రెడీగా వున్నాడు. ఆత్మకూరు లోనూ 'దేశం'కు ఏమంతా ఆశాజనకంగా లేదు. నెల్లూరు నగరం, నెల్లూరురూరల్‌, సూళ్లూరుపేటలలో టీడీపీకి కొత్త అభ్యర్థుల అవసరం వుంది. సూళ్లూరుపేటలో వైసిపి ఎమ్మెల్యే సంజీవయ్యకు ధీటైన అభ్యర్థి టీడీపీకి కొరతగా వుంది. నెల్లూరు నగరం, రూరల్‌లలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పి.నారా యణ, బీద రవిచంద్ర వంటి నాయకులు దిగితే తప్ప ఇక్కడున్న వైసిపి ఎమ్మెల్యేలను ధీటుగా ఢీకొట్టే పరిస్థితి లేదు. గూడూరుకు సిటింగ్‌ ఎమ్మెల్యే అని సునీల్‌ను నిలబెట్టినా కష్టమే! కావలిలో బీద మస్తాన్‌రావు తిరిగి పోటీచేయొచ్చు. ఉదయగిరి, వెంకటగిరి లలో సిటింగ్‌ ఎమ్మెల్యేలను మార్చుకోవా ల్సిన పరిస్థితి వుంది. అయితే వీరిని పక్కన పెడితే ఇంతకంటే బెటర్‌ అభ్యర్థులు కని పించడం లేదు. కోవూరులోనూ సిటింగ్‌ ఎమ్మెల్యేను కొనసాగిస్తారా? అక్కడా మార్పు గురించి ఆలోచిస్తారా? అన్నది చూడాలి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter